Investment Schemes: మరింత భారం కానున్న పిల్లల చదువులు.. మీ చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే ఇలా ప్లాన్ చేయండి ..
భవిష్యత్తు కోసం సరైన ప్రణాళిక ఈ రోజు నుంచే చేయాలి. పిల్లల భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు.. ఈ విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం..
ద్రవ్యోల్బణం దాదాపు సున్నాకి తగ్గవచ్చు కానీ.. సగటు భారతీయ కుటుంబ ప్రధాన వ్యయం వేగంగా పెరుగుతోంది. ఉన్నత చదవుల కోసం అవుతున్న ఖర్చు ఇప్పటికే డబుల్ అయ్యింది. సంవత్సరానికి 10-12 శాతం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ప్రతి భారతీయ కుటుంబం తప్పనిసరిగా ప్లాన్ చేయాల్సిన అవసరం నేటి కాలంలో ఏర్పడింది. మన జీవిత ఆర్ధిక ప్రణాళికలో పిల్లల చదువు కూడా ఒకటి. నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సుకు ప్రస్తుతం దాదాపు రూ. 6 లక్షలు ఖర్చవుతుంది. ఆరేళ్లలో ఖర్చు రూ.12 లక్షలకు చేరే అవకాశం ఉంది. 2027 నాటికి, ఇంజినీరింగ్ డిగ్రీ పొందడానికి రూ. 24 లక్షలు ఖర్చు అవుతుంది. ముందు తరాల వారు తమ చదువును పూర్తి చేయాలంటే భారీగా ఖరైదనదిగా మారిపోయింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ సంస్థలలో ఫీజు తక్కువగా ఉంది. ఇప్పుడు, నాణ్యమైన ప్రభుత్వ సంస్థల్లో ప్రవేశాల కోసం కూడా అదే స్థాయిలో పోటీ ఉంటోంది. దీంతో చాలా మంది ప్రైవేట్ సంస్థల వైపు మొగ్గు చూపుతున్నారు.
జీవనశైలి ద్రవ్యోల్బణం, పిల్లల చదువుల ఖర్చును కూడా ప్రభావితం చేసింది. మీ జీవన ప్రమాణాలు పెరిగేకొద్దీ.. మీరు మీ పిల్లలను ఉన్నత విద్య కోసం ఎక్కడికి పంపాలనే నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే, భారతీయ తల్లిదండ్రులకు ఆందోళన కలిగించే పెద్ద ప్రశ్న ఏమిటంటే.. వారు తమ పిల్లల ఉన్నత విద్యకు నిధులు సమకూర్చగలరా..? ముందుగానే ప్లాన్ చేసి సరైన చర్యలు తీసుకుంటే మాత్రమే వారి భవిష్యత్తును నిర్మించవచ్చు. అయితే ఇలాంటి సమంయలో తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం పొదుపు ఎలా చేసుకోవాలి. ఆ సమయంలో ఎదురయ్యే సవాళ్లను.. మనం ఎలా అధిగమించవచ్చో పరిశీలిస్తుంది.
భవిష్యత్తు ప్రణాళిక ఈ రోజు నుంచే..
భవిష్యత్తు కోసం సరైన ప్రణాళిక ఈ రోజు అవసరం. పిల్లల భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు.. ఒక విషయాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. అది భవిష్యత్ ద్రవ్యోల్బణం అని చెప్పవచ్చు.
స్వల్పకాలిక పెట్టుబడి పథకం..
పిల్లలు పుట్టిన తర్వాత, తల్లిదండ్రులు వారి భవిష్యత్తు కోసం ప్లాన్ చేయడం ప్రారంభిస్తారు. నేటి కాలంలో ఉన్నత విద్య కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా గరిష్ట రాబడిని పొందాలనుకునే ఏదైనా పెట్టుబడి పథకం కోసం చూస్తున్నట్లయితే.. మీరు పిల్లల కోసం స్వల్పకాలిక పెట్టుబడి పథకం కోసం చూస్తున్నట్లయితే, పోస్ట్ ఆఫీస్ RD పథకం ఒక గొప్ప పెట్టుబడి ఎంపిక. ఈ పథకంలో, మీరు ప్రతి నెలా 100 రూపాయల చిన్న పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద ఫండ్ చేయవచ్చు. ఇందులో, మీరు 5.8 శాతం రాబడిని పొందుతారు. మీరు పిల్లల పేరుతో ఈ ఖాతాను తెరవవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్..
ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్ కూడా గొప్ప పెట్టుబడి ఎంపిక. ఇందులో కూడా మీరు ప్రతి నెలా SIP చేయడం ద్వారా భారీ ఫండ్‌ను సృష్టించవచ్చు. మీరు కేవలం రూ.100 నుండి SIP ప్రారంభించవచ్చు. సాధారణంగా, పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్లలో సంవత్సరానికి 10 నుండి 15 శాతం వడ్డీ రేటును పొందుతారు, అయితే ఇది మార్కెట్ రిస్క్‌పై ఆధారపడి ఉంటుంది.
దీర్ఘకాలిక పెట్టుబడి పథకం..
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది మీరు 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టగల దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. ఈ పథకంలో, మీరు వార్షిక వడ్డీ రేటు 7.1 శాతం పొందుతారు. దీని కింద ఏడాదికి రూ.500 నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన
సుకన్య సమృద్ధి యోజన అనేది ఆడపిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించే గొప్ప పథకం. ఈ పథకం కింద, మీరు రూ. 500 నుండి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు 7.6 శాతం రాబడిని పొందుతారు.
పిల్లల పేరు మీద బ్యాంక్ ఎఫ్‌డి..
ఇది కాకుండా, మీరు పిల్లల పేరు మీద బ్యాంక్ ఎఫ్‌డి కూడా చేయవచ్చు. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 నుండి 10 సంవత్సరాల FDలపై సాధారణ పౌరులకు 6.10 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం