Business Idea: జాబ్ చేస్తూ మీ ఇంట్లోనే ఈ బిజినెస్ మొదలు పెట్టవచ్చు.. పెట్టుబడి కూడా చాలా తక్కువ.. మీ వ్యాపారానికి ప్రభుత్వం ఆర్ధిక సాయం చేస్తుంది..

ఉద్యోగం చేయడం అందరికి ఇష్టం ఉండదు.. చాలా మంది తమ సొంత కాళ్లపై నిలుచోవాలని అనుకుంటారు. ఇందులో బిజినెస్ ప్లాన్స్ రెడీ చేస్తుంటారు. దీనికి తోడు కొద్దిగా ఆర్ధిక ప్రోత్సాహం కోసం చూస్తుంటారు. ఇలాంటి వారికి ఇది అద్భుతమైన బిజినెస్ ఐడియా. ఇందులో మొదట మనం పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. దీని కోసం మీ ఇంటినే వ్యాపార స్థలంగా మార్చుకోవచ్చు.

Business Idea: జాబ్ చేస్తూ మీ ఇంట్లోనే ఈ బిజినెస్ మొదలు పెట్టవచ్చు.. పెట్టుబడి కూడా చాలా తక్కువ.. మీ వ్యాపారానికి  ప్రభుత్వం ఆర్ధిక సాయం చేస్తుంది..
Money
Follow us

|

Updated on: Dec 27, 2022 | 7:13 AM

ఈ మధ్యకాలంలో యువతకు ఉద్యోగాల కోసం పరుగులు పెట్టడం మానేస్తున్నారు. తమ సొంత కాళ్లపై వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు తగినట్లుగా బిజినెస్ ఐడియాతో ముందుకు వస్తున్నారు. అయితే, మీరు కూడా కొత్త వ్యాపార ఆలోచన కోసం చూస్తున్నట్లయితే.. ఉద్యోగంతో సంతోషంగా లేకుంటే లేదా దానితోపాటు కొంత అదనపు ఆదాయాన్ని పొందాలనుకునేవారికి అద్భుతమైన వ్యాపారం గురించి చెప్పబోతున్నాము. అలాంటి వ్యాపార ఆలోచనను అందించబోతున్నాం. దీని ద్వారా మీరు చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు మంచి డబ్బు సంపాదించవచ్చు. ఇందులో మనం అద్భుమైన ఓ సక్సెస్ బిజినెస్ గురించి చెప్పుకుందాం. ఇది ఒక్కప్పుడు కుటీర పరిశ్రమగా ఉండేది. అంతే కాదు ఈ బిజినెస్ హ్యాండ్ మేడ్ బిజినెస్‌గా ఉండేది.. కాని ఇప్పుడు ఇందులోకి యంత్రాలు వచ్చాయి.

ఇది పాపడ్ మేకింగ్ బిజినెస్ గురించి ముందుగా తెలుసుకుందాం. మీరు మీ ఇంటి నుంచి ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అలాగే ఇందులో పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ప్రభుత్వం నుంచి పెసో సహాయం పొందుతారు. మీరు ఒక గ్రామంలో లేదా చిన్న పట్టణంలో నివసిస్తుంటే.. దీని కోసం మీకు తక్కువ స్థలం అవసరం.

ఇలా ప్రారంభించండి..

పాపడ్ మేకింగ్ బిజినెస్ ప్రారంభించడానికి మీకు కనీసం 250 – 300 చదరపు అడుగుల స్థలం కావాలి. దీనిలో మీరు పాపడ్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.. దీనికి 2 నైపుణ్యం కలిగిన కార్మికులు, 3 నైపుణ్యం లేని కార్మికులు, 1 సూపర్‌వైజర్ అవసరం. ఈ వ్యాపారం ప్రారంభించిన వెంటనే మీ సంపాదన మొదలవుతుంది. మీరు తయారు చేసిన పాపడ్ నాణ్యతను కొనేవారు ఇష్టపడితే చాలు.. దాని తర్వాత డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇందులో బంగాళదుంపలు, పప్పులు, బియ్యంతో మార్కెట్‌లో బాగా డిమాండ్‌ ఉన్న పాపడ్‌ను తయారు చేసుకోవచ్చు.

ఎంత ఖర్చు అవుతుంది..

ఈ వ్యాపారంలో, 30,000 కిలోల ఉత్పత్తి సామర్థ్యం గల యూనిట్‌ను సిద్ధం చేయడానికి మీకు రూ. 6 లక్షల పెట్టుబడి అవసరం. ఇందులో మీకు ప్రభుత్వం నుండి రూ.4 లక్షల రుణం లభిస్తుంది. ఇందులో మీరు 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి.

రూ. 6 లక్షలలో స్థిర మూలధనం, వర్కింగ్ క్యాపిటల్ రెండూ ఉంటాయి. 2 యంత్రాలు, ప్యాకేజింగ్ యంత్ర పరికరాలు స్థిర మూలధనం నుంచి ఖర్చు చేయబడతాయి. మరోవైపు, సిబ్బంది 3 నెలల జీతం, 3 నెలల ముడిసరుకు, యుటిలిటీ ఉత్పత్తులు వర్కింగ్ క్యాపిటల్‌లో ఖర్చు చేయబడతాయి. దీంతోపాటు అద్దె, కరెంటు, నీరు, టెలిఫోన్ బిల్లులు వంటి ఖర్చులు కూడా ఇందులో ఉంటాయి.

ప్రభుత్వం నుంచి చాలా సాయం అందుతుంది..

కేంద్ర ప్రభుత్వం అనేక కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు చౌకగా రుణాలు ఇస్తోంది. ఈ వ్యాపారంలో కూడా మీరు చౌక ధరలకు రుణం పొందగలరు. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (NSIC) ప్రాజెక్ట్ రిపోర్టును సిద్ధం చేసింది. ఇందులో ముద్రా పథకం కింద తక్కువ ధరకు రూ.4 లక్షల రుణం పొందొచ్చు. ఈ రుణ సహాయంతో మీరు వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీరు సంపాదించడం ప్రారంభించిన తర్వాత మీరు లోన్ EMIని కూడా చెల్లించవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

Latest Articles
దానిమ్మ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!
దానిమ్మ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!
హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు
హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సహజంగా పెంచే ఆహారాలు ఇవే..
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సహజంగా పెంచే ఆహారాలు ఇవే..
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం