Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Features: మాటలతోనే చెల్లింపులు షురూ.. యూపీఐ చెల్లింపుల్లో కీలక అప్‌డేట్స్‌ ఇవే..!

పెరిగిన ప్రజాదరణకు అనుగుణంగా ఎన్‌పీసీఐ కూడా యూపీఐ చెల్లింపుల్లో కొత్తకొత్త అప్‌డేట్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది. తాజాగా ఎన్‌పీపీసీఐ వాయిస్‌ కమాండ్‌, క్రెడిట్‌ లైన్‌ వంటి ఎన్నో అప్‌డేట్స్‌ను జత చేసింది. ముఖ్యంగా యూపీఐపై క్రెడిట్ లైన్, యూపీఐ లైట్ ఎక్స్‌, ట్యాప్ అండ్‌ పే, హలో యూపీఐ ద్వారా సంభాషణ చెల్లింపులు, బిల్‌పే కనెక్ట్ అంటే సంభాషణ బిల్లు చెల్లింపులు వంటి చెల్లింపులను ప్రోత్సహిస్తున్నట్లు ఇటీవల ఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపారు.

UPI Features: మాటలతోనే చెల్లింపులు షురూ.. యూపీఐ చెల్లింపుల్లో కీలక అప్‌డేట్స్‌ ఇవే..!
Upi
Follow us
Srinu

|

Updated on: Sep 08, 2023 | 8:30 PM

2016లో నోట్ల రద్దు తర్వాత భారతదేశంలో డిజిటల్‌ పేమెంట్స్‌ బాగా పెరిగాయి. ముఖ్యంగా ఇందులో 50 శాతానికి పైగా చెల్లింపులు ఎన్‌పీసీఐ ప్రవేశపెట్టిన యూపీఐ పేమెంట్స్‌ ద్వారానే జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెరిగిన ప్రజాదరణకు అనుగుణంగా ఎన్‌పీసీఐ కూడా యూపీఐ చెల్లింపుల్లో కొత్తకొత్త అప్‌డేట్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది. తాజాగా ఎన్‌పీపీసీఐ వాయిస్‌ కమాండ్‌, క్రెడిట్‌ లైన్‌ వంటి ఎన్నో అప్‌డేట్స్‌ను జత చేసింది. ముఖ్యంగా యూపీఐపై క్రెడిట్ లైన్, యూపీఐ లైట్ ఎక్స్‌, ట్యాప్ అండ్‌ పే, హలో యూపీఐ ద్వారా సంభాషణ చెల్లింపులు, బిల్‌పే కనెక్ట్ అంటే సంభాషణ బిల్లు చెల్లింపులు వంటి చెల్లింపులను ప్రోత్సహిస్తున్నట్లు ఇటీవల ఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపారు. ముఖ్యంగా యూపీఐ ఆఫ్‌లైన్ చెల్లింపులను ప్రారంభించడానికి ఎన్‌పీసీఐ గతేడాది యూపీఐ లైట్‌ను ప్రారంభించింది. ఈ తాజా అప్‌డేట్‌ గురించి మరిన్ని వివరాలను ఓ సారి  తెలుసుకుందాం.

హలో యూపీఐ 

హలో యూపీఐ ప్రస్తుతానికి హిందీతో పాటు ఇంగ్లీషులో భాషల్లో అందుబాటులో ఉంది. యాప్‌లు, టెలికాం కాల్‌లు, ఐఓటీ పరికరాల ద్వారా వాయిస్ ప్రారంభించి యూపీఐ చెల్లింపులు చేయడానికి వినియోగదారులను అనుమతఘ్తుంది. ఇది త్వరలో అనేక ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. ‘హలో యూపీఐ’ వినియోగదారులు వారి స్మార్ట్‌ఫోన్‌లతో సంభాషణలలో పాల్గొనడం ద్వారా చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది. అది రెస్టారెంట్ బిల్లును విభజించడం, స్నేహితుడికి డబ్బు పంపడం లేదా యుటిలిటీ బిల్లులను సెటిల్ చేయడం వంటి సేవలకు బాగా ఉపయోగపడుతుంది. 

యూపీఐ క్రెడిట్‌ లైన్‌

యూపీఐ క్రెడిట్ యాక్సెస్‌ను విస్తరించడానికి ఆర్థిక చేరికతో పాటు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఆర్‌బీఐ గవర్నర్ యూపీఐలో క్రెడిట్ లైన్‌ను ప్రారంభించారు. ఈ కొత్త ఆఫర్ యూపీఐ ద్వారా బ్యాంకుల నుండి ముందస్తుగా మంజూరైన క్రెడిట్ లైన్‌లను ప్రారంభిస్తుంది. మరింత క్రమబద్ధీకరించిన, డిజిటల్ బ్యాంకింగ్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తూ క్రెడిట్‌కు కస్టమర్ యాక్సెస్‌లో విప్లవాత్మక మార్పులు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

యూపీఐ లైట్‌ ఎక్స్‌, ట్యాప్‌ అండ్‌ పే

యూపీఐ లైట్‌ ఫీచర్ విజయవంతమైన నేపథ్యంలో ఆఫ్‌లైన్ చెల్లింపుల కోసం యూపీఐ లైట్‌ ఎక్స్‌ను ప్రారంభించారు. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఇప్పుడు పూర్తిగా ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు డబ్బును పంపగలరు, స్వీకరించగలరు. కాబట్టి, భూగర్భ స్టేషన్‌లు, మారుమూల ప్రాంతాలు మొదలైన పేలవమైన కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలలో కూడా లావాదేవీలను ప్రారంభించడానికి, అమలు చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ)కి మద్దతిచ్చే అనుకూల పరికరం ఉన్న ఎవరైనా యూపీఐ లైట్‌ చెల్లింపులు ఇతర చెల్లింపు పద్ధతుల కంటే వేగంగా చేయవచ్చు. ఎందుకంటే వాటికి లావాదేవీని ప్రాసెస్ చేయడానికి తక్కువ సమయం పడుతుంది.

సంభాషణ బిల్లు చెల్లింపులు

బిల్‌పే కనెక్ట్‌తో, భారత్‌ బిల్‌ పే భారతదేశం అంతటా బిల్లు చెల్లింపుల కోసం జాతీయీకరించిన నంబర్‌ను పరిచయం చేసింది. మెసేజింగ్ యాప్‌లో ఒక సాధారణ ‘హాయ్’ని పంపడం ద్వారా కస్టమర్‌లు వారి బిల్లులను చెల్లించగలరు. దీంతో పాటు స్మార్ట్‌ఫోన్‌లు లేదా తక్షణ మొబైల్ డేటా యాక్సెస్ లేని వినియోగదారులు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా బిల్లులు చెల్లించగలరు. వెరిఫికేషన్, పేమెంట్ ఆథరైజేషన్ కోసం కస్టమర్‌లు వెంటనే కాల్ బ్యాక్ అందుకుంటారు. అదనంగా బిల్‌ పే కనెక్ట్‌ వాయిస్ అసిస్టెడ్ బిల్లు చెల్లింపుల సౌకర్యాన్ని అందిస్తుంది. కస్టమర్‌లు తమ స్మార్ట్ హోమ్ పరికరాల్లో వాయిస్ కమాండ్‌ల ద్వారా బిల్లులను చెల్లించవచ్చు. అలాగే తక్షణ వాయిస్ నిర్ధారణను పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం