AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patanjali: పతంజలి క్రెడిట్ కార్డు.. షాపింగ్ చేస్తే అదిరే క్యాష్‌బ్యాక్.. సూపర్ ఆఫర్స్..

ఆయుర్వేదం నుండి బ్యాంకింగ్ వరకు పతంజలి తన కస్టమర్లకు అద్భుతమైన సేవలను అందిస్తుంది. ఈ విషయంలో కంపెనీ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు ప్రయోజనకరంగా ఉన్నాయి. ఈ క్రెడిట్ కార్డులు రోజువారీ కొనుగోళ్లకు సంబంధించి రివార్డులు, క్యాష్ బ్యాక్ అందిస్తాయి. పతంజలి క్రెడిట్ కార్డుల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Patanjali: పతంజలి క్రెడిట్ కార్డు.. షాపింగ్ చేస్తే అదిరే క్యాష్‌బ్యాక్.. సూపర్ ఆఫర్స్..
Patanjali Launches Co Branded Credit Cards
Krishna S
|

Updated on: Oct 24, 2025 | 1:34 PM

Share

యోగా గురువు రాందేవ్ బాబా నేతృత్వంలోని పతంజలి గ్రూప్ ఇప్పుడు కేవలం ఆయుర్వేద ఉత్పత్తులకే పరిమితం కావడం లేదు. తమ కస్టమర్లను డిజిటల్ చెల్లింపుల వైపు ప్రోత్సహించడంలో భాగంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్‌లతో కలిసి పతంజలి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కార్డులు పతంజలి స్టోర్లలో షాపింగ్ చేసే వినియోగదారులకు ప్రత్యేక డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, రివార్డులను అందిస్తాయి. దీన్ని ద్వారా పతంజలి తమ కస్టమర్లకు ప్రతి కొనుగోలుపై అదనపు ప్రయోజనాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

RBL బ్యాంక్ పతంజలి కార్డు:

RBL బ్యాంక్ సహకారంతో పతంజలి గోల్డ్, ప్లాటినం అనే రెండు రకాల కార్డులను అందిస్తోంది. పతంజలి స్టోర్లలో షాపింగ్ చేసేవారికి ఈ రెండు కార్డులు ప్రతి నెలా 10శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తాయి. గోల్డ్ కార్డుపై మొదటి లావాదేవీపై స్వాగత రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. అదనంగా విమానాశ్రయ లాంజ్ యాక్సెస్, హోటల్ బసలు, సినిమా టిక్కెట్లపై డిస్కౌంట్లు వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్లాటినం కార్డుకు వార్షిక రుసుము ఉన్నప్పటికీ ఒక నిర్దిష్ట వార్షిక ఖర్చు పరిమితిని చేరుకుంటే ఈ ఛార్జీని రద్దు చేస్తారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ – పతంజలి కార్డు:

PNB భాగస్వామ్యంతో రూపే సెలక్ట్, రూపే ప్లాటినమ్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి పతంజలి స్టోర్లతో పాటు ఇతర వ్యాపార ప్రాంతాలలో కూడా రివార్డులు, క్యాష్‌బ్యాక్‌ను అందిస్తాయి. ఈ కార్డులతో మొదటి లావాదేవీపై 300 కి పైగా రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. పతంజలి స్టోర్లలో రూ.2,500 కంటే ఎక్కువ కొనుగోళ్లపై కస్టమర్లు 2శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఈ కార్డులు సమగ్ర బీమా కవరేజ్, 300 కి పైగా బిజినెస్ ఆఫర్ల నుండి ప్రయోజనాలను కూడా అందిస్తాయి.

స్వదేశీ సమృద్ధి కార్డుదారులకు బోనస్:

పతంజలి స్వదేశీ సమృద్ధి కార్డును ఉపయోగిస్తున్న కస్టమర్ల కోసం ప్రత్యేక ప్రయోజనం ఉంది. PNB-పతంజలి క్రెడిట్ కార్డుతో చేసే రీఛార్జ్‌లు లేదా లావాదేవీలపై వీరికి అదనంగా 5-7శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. సాధారణ పతంజలి కస్టమర్‌లు ప్రతి కొనుగోలుపై మరింత ఎక్కువ ప్రయోజనాలు పొందేలా ఈ ఫీచర్ రూపొందించబడింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి