AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN Card : మీరు కూడా పాన్ కార్డ్ ఇలాగే వాడుతున్నారా? అయితే రూ.10 వేలు ఫైన్ తప్పదు!

బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల్లో దాదాపు ప్రతి పనికి ఆధార్, పాన్ తప్పనిసరి. ఈ రెండింటిని లింక్ చేసుకోవాలని కూడా ప్రభుత్వం సూచిస్తుంది. అయితే ఇప్పటికీ చాలామంది పాన్ కార్డుని ఆధార్ తో అనుసంధానించలేదు. ఇలాంటి కార్డులను ఇనాక్టివ్ పాన్ కార్డులంటారు. వీటివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవేంటంటే..

PAN Card : మీరు కూడా పాన్ కార్డ్ ఇలాగే వాడుతున్నారా? అయితే రూ.10 వేలు ఫైన్ తప్పదు!
PAN Card: నేటి డిజిటల్ యుగంలో పన్నులు దాఖలు చేయడానికి లేదా బ్యాంక్ ఖాతా తెరవడానికి మాత్రమే పాన్ కార్డ్ అవసరం. ఇది మీ గుర్తింపుకు అనుసంధానించబడిన ముఖ్యమైన పత్రంగా మారింది. రుణం, క్రెడిట్ కార్డ్ లేదా పెట్టుబడి వంటి ఏదైనా ఆర్థిక లావాదేవీకి పాన్ కార్డ్ అవసరం. కానీ మీ పాన్ కార్డ్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీకు తెలియకుండా ఇతరులు కూడా మీ పాన్‌ కార్డును ఉపయోగించవచ్చు. అందుకే పాన్‌ ఎక్కడెక్కడ ఉపయోగించారు? ఎవరైనా ఉపయోగించారా? లేక మీరే ఉపయోగించారా? అనే విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Nikhil
|

Updated on: Oct 24, 2025 | 1:20 PM

Share

ఆధార్ తో లింక్ చేయని పాన్ కార్డులు.. చాలా వరకు ఇనాక్టివ్ కార్డులుగా మారాయి. ఇలాంటి వాటిని తిరిగి యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ విషయం తెలియక చాలామంది బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ లో ఇనాక్టివ్ పాన్ కార్డులను వాడుతున్నారు. ఇలాంటివాళ్లకు ఇన్ కమ్ ట్యాక్స్ ఫైన్ విధించే అవకాశం ఉంది. అలాగే కొంతమంది ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కూడా వాడుతుంటారు. అది కూడా చట్టరీత్యా నేరమే. దీనికి కూడా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

ఇనాక్టివ్ కార్డు

ఆర్థిక లావాదేవీల్లో ఇనాక్టివ్‌ పాన్‌ కార్డు ఉపయోగిస్తే ప్రతి ట్రాన్సాక్షన్ కు  ప్రత్యేక జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272బి కింద ఒక్కో లావాదేవీపై రూ.10,000 వరకు జరిమానా విధించవచ్చు. కేవలం డబ్బు వేయడం తీసుకోవడమే కాదు, బ్యాంకు అకౌంట్ తెరవడం, షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం, ఆస్తిని కొనుగోలు చేయడం, లోన్ అప్లై చేయడం.. ఇలాంటివన్నీ ట్రాన్సాక్షన్స్ కిందకే వస్తాయి. వీటికోసం యాక్టివ్ గా ఉన్న పాన్ కార్డులనే వాడాలి.

పాన్ కార్డుపోతే..

ఇకపోతే కొంతమంది రెండు పాన్ కార్డులు వాడుతుంటారు. పాన్ కార్డు పోతే వెంటనే రెండో పాన్ కార్డుకి అప్లై చేస్తుంటారు. అయితే ఒక వ్యక్తి రెండు పాన్ కార్డులు కలిగి ఉండటం కూడా చట్టరీత్యా నేరమే. పాన్ కార్డు పోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అలాగే కొత్త పాన్ కార్డు కాకుండా పాత పాన్ కార్డుకే డూప్లికేట్ కార్డు పొందాలి. ఒకవేళ రెండు పాన్ కార్డులు ఉన్నట్టయితే.. ఐటీ చట్టం 1961, సెక్షన్ 272బీ ప్రకారం రూ.10 వేల జరిమానా విధించే అకాశం ఉంది. అయితే అడ్రెస్ మార్పు, పేరు మార్పు కోసం రెండో పాన్ కోసం అప్లై చేసుకోవచ్చు. కానీ, పాన్ నెంబర్ మారే విధంగా కొత్త అడ్రెస్, ఫోన్ నెంబర్లతో కొత్త పాన్ కార్డుకి అప్లై చేయకూడదు. చట్టాల ప్రకారం ఒక వ్యక్తికి ఒకటే పాన్ నెంబర్ ఉండాలి. అదే నెంబర్ మీద డూప్లికేట్ కార్డులు ఎన్నైనా తీసుకోవచ్చు. కానీ, మరొక నెంబర్ తో రెండవ కార్డు మాత్రం వాడకూడదు. అలా వాడితే చట్ట పరంగా చర్యలు తప్పవు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి