- Telugu News Photo Gallery Business photos 6 Essential Tips to Protect Your Credit Card from Online Fraud and Scams
Credit Card: ఈ తప్పులతో మీ క్రెడిట్ కార్డు ఖాళీ.. సేఫ్‌గా ఉండాలంటే 6 సీక్రెట్స్ తెలుసుకోండి..
ఆధునిక ఆర్థిక లావాదేవీలలో క్రెడిట్ కార్డులు అత్యంత సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ.. వాటి ద్వారా మోసాలు జరగడం కూడా చాలా సులభం. హ్యాకర్లు ఎప్పుడూ కొత్త పద్ధతుల్లో మీ వివరాలను దొంగిలించడానికి ప్రయత్నిస్తుంటారు. కాబట్టి మీ కార్డును సురక్షితంగా ఉంచుకోవడం ద్వారా మీ డబ్బుతో పాటు మీ గుర్తింపును కూడా కాపాడుకోవచ్చు.
Updated on: Oct 24, 2025 | 12:50 PM

స్పామ్ టెక్స్ట్- కాల్స్: స్కామర్‌లు తరచుగా మీ బ్యాంకు లేదా కార్డ్ కంపెనీలా నటిస్తూ.. మీకు కాల్స్ లేదా మెస్సేజులు పంపుతారు. వారు మీ కార్డ్ నంబర్‌లు, ఓటీపీలు, పిన్‌లు వంటి వ్యక్తిగత వివరాలను అడుగుతారు. గుర్తుంచుకోండి.. నిజమైన బ్యాంకులు ఎప్పుడూ ఫోన్ ద్వారా ఈ వివరాలను అడగవు. ఏదైన అనుమానంగా అనిపిస్తే నేరుగా మీ బ్యాంకుకు కాల్ చేసి నిజాన్ని తెలుసుకోండి.

సేఫ్ నెట్‌వర్క్: డబ్బుకు సంబంధించిన ఏ లావాదేవీ కోసం కూడా పబ్లిక్ వైఫైను ఉపయోగించవద్దు. ఓపెన్ నెట్‌వర్క్‌లలో హ్యాకర్లు మీ సమాచారాన్ని సులభంగా దొంగిలించవచ్చు. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు లేదా బిల్లులు చెల్లించేటప్పుడు ఎల్లప్పుడూ ప్రైవేట్ కనెక్షన్‌ను ఉపయోగించండి. ముఖ్యంగా మీరు లావాదేవీ చేసే వెబ్‌సైట్ అడ్రస్ "http" కాకుండా "https" తో ప్రారంభమవుతుందో లేదో నిర్ధారించుకోండి.

ట్రాన్సక్షన్స్ అలర్ట్స్ : చాలా బ్యాంకులు ప్రతి కార్డ్ ట్రాన్సక్షన్ జరిగిన వెంటనే ఎస్ఎంఎస్ లేదా యాప్ ద్వారా అలర్ట్ మెస్సేజ్‌లు పంపిస్తాయి. వీటిని తప్పకుండా ఆన్ చేసుకోండి. మీరు చేయని చిన్న ఖర్చు కూడా కనిపిస్తే, వెంటనే బ్యాంకుకు చెప్పండి.

ఖర్చు లిమిట్స్: మీరు మీ కార్డ్‌పై ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లావాదేవీల కోసం రోజువారీ ఖర్చు పరిమితులను సెట్ చేయవచ్చు. మీరు చేయని చిన్న ఖర్చు కూడా కనిపిస్తే, వెంటనే బ్యాంకుకు చెప్పండి. ఈ సాధారణ నియంత్రణలు అనధికార ఖర్చులు జరగకుండా నిరోధించగలవు.

ఎవరికీ చెప్పొద్దు: మీ కార్డ్ వివరాలు, సీవీవీ, ఓటీపీలను ఎవరికీ చెప్పొద్దు. మీ పిన్/పాస్‌వర్డ్‌లు తరచుగా మారుస్తూ ఉండండి.

6. కార్డు బ్లాక్: మీరు ఏదైనా అనుమానాస్పద లావాదేవీని గమనించినట్లయితే వెంటనే మీ బ్యాంక్ యాప్‌లో కార్డ్‌ను ఫ్రీజ్ చేయండి. బ్యాంకుకు కాల్ చేసి, ఆ లావాదేవీ నాది కాదని చెప్పండి. మీరు ఎంత వేగంగా చర్య తీసుకుంటే, మీ డబ్బును తిరిగి పొందే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది.




