Drive Safely: మీరు కారులో ప్రయాణిస్తుంటే ఈ వస్తువులు తప్పనిసరి ఉంచుకోండి.. ఎన్నో ఉపయోగాలు!
Drive Safely: మీరు కారులో దూర ప్రయాణం చేస్తున్నారా? ప్రయాణ సమయంలో కారు కొన్ని వస్తువులను వెంట ఉంచుకోవడం చాలా ముఖ్యం. వాటితో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చాలా మంది ఇలాంటి వాటి గురించి నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ వస్తువులు వెంట ఉంచుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం..
Updated on: Oct 24, 2025 | 6:23 PM

డ్రైవింగ్ చేసేటప్పుడు భద్రత అనేది అత్యంత ముఖ్యమైన విషయం. మీరు కారులో కొన్ని ముఖ్యమైన వస్తువులను ఉంచుకోవడం ద్వారా మీ ప్రయాణాన్ని సురక్షితంగా చేసుకోవచ్చు.

చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు మీకు సహాయం చేయడానికి, ఎల్లప్పుడూ కారులో ప్రథమ చికిత్స వస్తు సామగ్రిని ఉంచండి. చిన్నదే కదా అని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకండి. తప్పకుండా దీనిని మీ కారులో ఉంచుకోవడం మంచిదని గుర్తించుకోండి.

కారు చెడిపోయినప్పుడు స్టెప్ టైర్, టూల్ కిట్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే దూర ప్రయాణం చేసే సమయంలో మార్గమధ్యలో కారులో సమస్య తలెత్తితే ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

దూర ప్రయాణాల్లో నీళ్ల బాటిళ్లు, స్నాక్స్ ఉపయోగపడతాయి. మీరు ప్రయాణం చేసే ముందు ఇలాంటివి కారులో ఉంచుకోవడం తప్పనిసరి అని గుర్తించుకోండి. కారులో ఎల్లప్పుడూ అత్యవసర సంప్రదింపు నంబర్లు, వాహన పత్రాలను సురక్షితంగా ఉంచండి.

ఫోన్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి పవర్ బ్యాంక్, ఛార్జింగ్ కేబుల్ ఉపయోగిస్తుంటాము. మీరు కారులో ప్రయాణించే ముందు అకస్మాత్తుగా ఫోన్ ఛార్జింగ్ అయిపోయినట్లయితే ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే పవర్ బ్యాంక్‌ను వెంట ఉంచుకోండం మంచిది.




