- Telugu News Photo Gallery Business photos The deadline for updating Aadhaar details for free online is June 14, 2026
Aadhaar: వినియోగదారులకు అలర్ట్.. ఆధార్ అప్‌డేట్ కోసం గడువు ఎప్పటి వరకు ఉందో తెలుసా?
Aadhaar Update: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆధార్ ఉంటుంది. ఆధార్ లేనిది ఏ పనులు జరగవన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఆధార్ గురించి ఆధార్ జారీ చేసే సంస్థ యూఐడీఏఐ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఆధార్ కార్డులో వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం చాలా ముఖం..
Updated on: Oct 24, 2025 | 6:45 PM

Aadhaar Update: ఆధార్ కార్డు వినియోగదారులకు యూఐడీఏఐ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఉచితంగా ఆధార్ కార్డులో వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు గడువు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే ఆధార్ కార్డు జారీ చేసి పదేళ్లు పూర్తయినట్లయితే వివరాలను అప్‌డేట్ చేసుకోవడం చాలా ముఖ్యమని యూఐడీఏఐ చెబుతోంది.

గతంలో ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు గడువు జూన్ 14 వరకు ఉండేది. దీని తర్వాత యూఐడీఏఐ గడువు 2026 జూన్ 14వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ ప్రకటనకు సంబంధించిన ఉత్తర్వులను ఎక్స్ వేదికగా విడుదల చేస్తూ యూఐడీఏఐ సంస్థ ట్వీట్ చేసింది. ఆధార్‌లో కార్డులో ఉచితంగా వివరాలు నమోదు చేసుకునేందుకు వచ్చే ఏడాది వరకు గడువు ఉంది.

ఇదిలా ఉండగదా, ఈ ఉచిత ఆధార్ అప్‌టేడ్ అనేది వినియోగదారులు ఎంతో ఉపయోగపడుతుంది. ఎలా అంటే వివాహం, ఉద్యోగం, ఉన్నత చదువులు అంటూ ఇలా కొందరు వలసలు వెళ్లి జీవనం సాగిస్తూ ఉంటారు.

అలాంటి సమాయాల్లో వారి అడ్రస్ వంటి మారుతూ ఉంటాయి. దీంతో ఈ ఆధార్ అప్‌డేట్ అందుబాటులో ఉండడం వల్ల వారు ఎప్పటికప్పుడూ ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోగులుగుతారు. అలాగే ఆధార్ సెంటర్‌కు వెళ్లి వేలి ముద్రలు, ఐరిస్ వంటివి అప్‌డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఆధార్ కార్డు పొంది ప్రతి ఒక్కరు పదేళ్లు పూర్తయిన వెంటనే దాన్ని అప్‌డేట్ చేసకోవాలని యూఐడీఏఐ చెబుతోంది.




