AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN Card: ఇక సింగిల్‌ బిజినెస్‌ ఐడీగా ‘పాన్‌కార్డు’.. బడ్జెట్‌లో మంత్రి నిర్మలమ్మ సంచలన నిర్ణయం

పాన్‌కార్డు నిర్దిష్ట ప్రభుత్వ ఏజెన్సీల అన్ని డిజిటల్ సిస్టమ్‌లకు సాధారణ ఐడెంటిఫైయర్‌గా ఉపయోగించుకునేలా చేయనున్నట్లు మంత్రి నిర్మలాసీతారామన్‌ అన్నారు. బుధశారం పార్లమెంట్‌లో..

PAN Card: ఇక సింగిల్‌ బిజినెస్‌ ఐడీగా 'పాన్‌కార్డు'.. బడ్జెట్‌లో మంత్రి నిర్మలమ్మ సంచలన నిర్ణయం
Pan Card
Subhash Goud
|

Updated on: Feb 01, 2023 | 3:51 PM

Share

పాన్‌కార్డు నిర్దిష్ట ప్రభుత్వ ఏజెన్సీల అన్ని డిజిటల్ సిస్టమ్‌లకు సాధారణ ఐడెంటిఫైయర్‌గా ఉపయోగించుకునేలా చేయనున్నట్లు మంత్రి నిర్మలాసీతారామన్‌ అన్నారు. బుధశారం పార్లమెంట్‌లో 2023-24 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె.. పాన్‌కార్డుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ దశ మెరుగైన పన్ను నిర్వహణలో, పరిశ్రమల వ్యాపారాన్ని సులభతరం చేయడంలో సహాయపడే అవకాశం ఉందన్నారు. అయితే ఈ బడ్జెట్‌లో బిజినెస్‌ అనుమతులు, కార్యకలాపాల కోసం విధించిన నిబంధనలను సడలిస్తూ మంత్రి కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. పర్మినెంట్‌ అకౌంట్‌ నంబర్‌ (పాన్‌)ను సింగిల్‌ బిజినెస్‌ ఐడీగా చట్టబద్దం చేయనున్నట్లు స్పష్టం చేశారు. జాతీయ, అంతర్జాతీయంగా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేందుకు వివిధ రకాల వ్యాపార లావాదేవీల కోసం సంబంధిత వ్యక్తులు కేంద్ర, రాష్ట్రాలలోని వివిధ శాఖల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం ఇతర డాక్యుమెంట్లను అందజేయాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఈ విధానానికి స్వస్తి పలికేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ సింగిల్‌ విండో సిస్టంగా ఏదైనా సంస్థను గుర్తించాలంటే పాన్‌ కార్డు ఒకటి ఉంటే సరిపోయేలా కొత్త రూల్స్‌ తీసుకువచ్చింది. కేంద్ర నిర్ణయంతో ఇప్పుడు పాన్‌కార్డుతోనే అన్ని రకాల వ్యాపార అనుమతులు తీసుకుని కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు.

ప్రస్తుతం వివిధ పనుల కోసం పాన్‌కార్డుతో పాటు ఈపీఎఫ్‌వో, జీఎస్‌టీఎన్‌, టీఏఎన్‌, ఈఎస్‌ఐసీ లాంటి దాదాపు 13 నుంచి 20 రకాల ఐడీలు వేర్వేరు సందర్భాలలో ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఉంది. వీటి కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. దీంతో సదరు వ్యక్తులు, పెట్టుబడిదారులకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు అధికంగా శ్రమ పడాల్సి వస్తుందని కేంద్రం భావించింది. ఈ విధానాన్ని రద్దు చేస్తూ ఫైనాన్స్‌ యాక్ట్‌ 2023 కింద ఒక్క పాన్‌ నంబర్‌తో చట్టబద్దత పొందేలా 2023-24 బడ్జెట్‌లో ప్రకటన చేశారు మంత్రి నిర్మలాసీతారామన్‌. మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఒక్క పాన్‌ కార్డుతో మీ పని సులభతరం అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి