Zomato: రెండు రోజుల ముందుగానే భోజనం ఆర్డర్.. జొమాటాలో అందుబాటులోకి నయా ఫీచర్..!

ఆర్డర్ చేయడానే భోజనాన్ని ఇంటికి తీసుకువచ్చి అందించే జొమాటో గురించి తెలియని వారెవ్వరూ ఉండవు. దేశవ్యాప్తంగా అనేక నగరాలు, చిన్న పట్ణణాలు, మేజర్ పంచాయతీలలో కూడా ఈ సంస్థ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మనకు కావాల్సిన భోజనాన్ని ఆర్డర్ చేయడానే ఈ సంస్థకు సంబంధించిన డెలివరీ సిబ్బంది తమకు ఇంటికి తీసుకువచ్చి, సమయానికి భోజనం అందజేస్తారు.

Zomato: రెండు రోజుల ముందుగానే భోజనం ఆర్డర్.. జొమాటాలో అందుబాటులోకి నయా ఫీచర్..!
Zomato
Follow us

|

Updated on: Aug 26, 2024 | 8:04 PM

ఆర్డర్ చేయడానే భోజనాన్ని ఇంటికి తీసుకువచ్చి అందించే జొమాటో గురించి తెలియని వారెవ్వరూ ఉండవు. దేశవ్యాప్తంగా అనేక నగరాలు, చిన్న పట్ణణాలు, మేజర్ పంచాయతీలలో కూడా ఈ సంస్థ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మనకు కావాల్సిన భోజనాన్ని ఆర్డర్ చేయడానే ఈ సంస్థకు సంబంధించిన డెలివరీ సిబ్బంది తమకు ఇంటికి తీసుకువచ్చి, సమయానికి భోజనం అందజేస్తారు. దీంతో అనేక మంది జొమాటో సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ సంస్థ కూడా వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ వారి అభిమానాన్ని పొందుతోంది. ఈ నేపథ్యంలో ఆర్డర్ షెడ్యూలింగ్ అనే కొత్త ఫీచర్ ను ప్రారంభించారు. దీని ద్వారా రెండు రోజుల ముందుగానే భోజనాన్ని ప్లాన్ చేసుకోవచ్చు.

కొత్త ఫీచర్

ప్రముఖ ఫుడ్ డెలివర్ ఫ్లాట్ ఫాం అయిన జోమాటా తీసుకువచ్చిన కొత్త ఫీచర్ తో వినియోగదారులకు మరిన్ని మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా దేశంలోని అనేక నగరాల్లో జోమాటో సేవలు అందిస్తోంది. కొత్త ఫీచర్ కారణంగా ఆయా నగరాల్లోని కంపెనీల నుంచి వచ్చే ఆర్డర్లు పెరుగుతాయని భావిస్తున్నారు. అలాగే రెండు రోజుల ముందుగానే ఆర్ధర్ ఇవ్వడం వల్ల సమాయానికి ఆహారం అందించే అవకాశం ఉంటుంది.

మొదటిగా ఏడు నగరాలలో..

జొమాటో సీఈవో, వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ కొత్త ఫీచర్ గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఢిల్లీ ఎన్ సీఆర్, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, చండీగఢ్, లక్నో, జైపూర్‌ నగరాల్లో కొత్త సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక్కడున్న 13 వేల రెస్టారెంట్ల నుంచి నచ్చిన ఫుడ్ ను ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే రూ.వెయ్యి కంటే ఎక్కువ ఆర్డర్ల కోస షెడ్యూలింగ్ అందుబాటులో ఉంది. ఆర్డర్ షెడ్యూలింగ్ ఫీచర్ ను ప్రణాళికా బద్ధంగా విస్తరించనున్నట్టు దీపిందర్ గొయిల్ తెలిపారు. తక్కువ మొత్తం కలిగిన ఆర్డర్ కు కూడా ఇవి వర్తింపజేస్తామని వివరించారు. భవిష్యత్తులో మిగిలిన నగరాలతో పాటు రెస్టారెంట్ల సంఖ్యను కూడా పెంచడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

ఇవి కూడా చదవండి

రుచి, శుభ్రతకు ప్రాధాన్యం

ఏడు నగరాలలోని మంచి రెస్టారెంట్లను ఎంపిక చేసి కొత్త ఫీచర్ ను జొమాటో అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటిలో అనేక రకాల వంటకాలు అందుబాటులో ఉన్నాయి. తయారీలో నిబంధనలను పక్కగా పాటిస్తున్నారు. రుచికి, శుభ్రతగా అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జొమాటో సర్వీస్ ఆఫర్లలో ఇటీవల అనేక మార్పులు తీసుకువచ్చింది. దానిలో భాగంగా సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కంపెనీ ఇటీవల తన ఇంటర్‌సిటీ డెలివరీ సేవను ఆపేసింది. చిన్న పార్సిల్ సర్వీసుల కోసం గతేడాది అక్టోబర్ లో దాన్ని ప్రారంభించింది. జొమాటో కంపెనీ ఈ నెల ప్రారంభంలో కొత్త గ్రూప్ ఆర్డరింగ్ ఫీచర్‌ను ఆవిష్కరించింది. ఇది గ్రూప్‌ల కోసం ఆహారాన్ని ఆర్డర్ చేసే ప్రక్రియను సులభతరం చేయడానికి దాన్ని రూపొందించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రెండు రోజుల ముందే భోజనం ఆర్డర్.. జొమాటాలో అందుబాటులోకి నయా ఫీచర్
రెండు రోజుల ముందే భోజనం ఆర్డర్.. జొమాటాలో అందుబాటులోకి నయా ఫీచర్
పురుషులకు ఉచిత సలహాచెప్పి ఉద్యోగం పోగొట్టుకున్న యాంకరమ్మ ఎక్కడంటే
పురుషులకు ఉచిత సలహాచెప్పి ఉద్యోగం పోగొట్టుకున్న యాంకరమ్మ ఎక్కడంటే
బీసీసీఐ కొత్త కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి తనయుడు
బీసీసీఐ కొత్త కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి తనయుడు
జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్న దర్శన్‌..
జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్న దర్శన్‌..
బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి వ్యాలిడిటీ క్యారీ ఫార్వర్డ్ ప్లాన్‌-అదేంటంటే
బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి వ్యాలిడిటీ క్యారీ ఫార్వర్డ్ ప్లాన్‌-అదేంటంటే
సైబర్‌ దాడుల నుంచి రక్షణకు ప్రత్యేక ఇన్సూరెన్స్‌..!
సైబర్‌ దాడుల నుంచి రక్షణకు ప్రత్యేక ఇన్సూరెన్స్‌..!
ఫోజులు చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే
ఫోజులు చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే
టీడీపీలోకి బాబూమోహన్..? చంద్రబాబుతో భేటి వెనుక ప్లాన్ అదేనా..?
టీడీపీలోకి బాబూమోహన్..? చంద్రబాబుతో భేటి వెనుక ప్లాన్ అదేనా..?
చోరీకి వచ్చి 'బుక్‌'అయిపోయాడు.. దొంగను ఆకర్షించిన ఓ పుస్తకం!
చోరీకి వచ్చి 'బుక్‌'అయిపోయాడు.. దొంగను ఆకర్షించిన ఓ పుస్తకం!
అర్ధరాత్రి కన్నయ్యను రాశిప్రకారం ఇలాపూజించండి శుభ ఫలితాలు మీసొంతం
అర్ధరాత్రి కన్నయ్యను రాశిప్రకారం ఇలాపూజించండి శుభ ఫలితాలు మీసొంతం
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!