AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Price: బిగ్‌ రిలీఫ్‌.. చౌకగా మారనున్న ఉల్లి ధర.. కారణం ఏంటంటే..

దేశంలోని రిటైల్ మార్కెట్‌లో వెల్లుల్లి ధర కిలో రూ.600కి చేరింది. దేశంలోనే అతిపెద్ద వెల్లుల్లి మార్కెట్‌లలో ఒకటైన గుజరాత్‌లోని జామ్‌నగర్ మండిలో గత కొద్దిరోజులుగా వెల్లుల్లి టోకు ధర కిలో రూ.350కి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో దీని రిటైల్ ధరలు కిలో రూ.500 నుంచి రూ.550కి చేరుకోగా చాలా ప్రాంతాల్లో కిలో రూ.600 వరకు పలుకుతోంది. గతేడాది కంటే ఈసారి వెల్లుల్లి..

Onion Price: బిగ్‌ రిలీఫ్‌.. చౌకగా మారనున్న ఉల్లి ధర.. కారణం ఏంటంటే..
Onion Price
Subhash Goud
|

Updated on: Feb 21, 2024 | 5:28 PM

Share

ఈ ద్రవ్యోల్బణం కాలంలో ఉల్లి ధరలు పెరిగి ఉంటే సామాన్యులు భారంగా మారేంది. ఇప్పుడు సామాన్యులకు ఉపశమనం లభించింది. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్‌లో కేవలం 24 గంటల్లోనే ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.150 తగ్గింది. ఉల్లి ఎగుమతిపై నిషేధాన్ని తొలగిస్తున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. దాని కారణంగా ఉల్లి ధరలు పెరిగాయి. అయితే, మంగళవారం మధ్యాహ్నం వరకు దాని ధరలు తగ్గడం ప్రారంభించాయి. దేశంలో అతిపెద్ద ఉల్లి మార్కెట్ మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న లాసల్‌గావ్ మండి. మంగళవారం మధ్యాహ్నం వరకు ఉల్లి ఎగుమతిపై నిషేధం మార్చి 31 వరకు కొనసాగుతుందని ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చింది. దీంతో ఉల్లి ధర పతనమై క్వింటాల్‌ రూ.150కి పడిపోయింది.

ఉల్లి ధర మొదట 41 శాతం పెరిగింది:

అంతకు ముందు ఫిబ్రవరి 19న లాసల్‌గావ్ మండిలో టోకు ఉల్లి ధర క్వింటాల్‌కు 40.62 శాతం పెరిగి రూ.1,800కి చేరుకుంది. ఫిబ్రవరి 17న ఇదే ధర క్వింటాల్‌కు రూ.1,280గా ఉంది. ఉల్లి ఎగుమతిపై నిషేధం కొనసాగుతుందని మంగళవారం ప్రభుత్వం ప్రకటించడంతో ధర క్వింటాల్‌కు రూ.150 తగ్గి రూ.1,650కి చేరింది.

ఇవి కూడా చదవండి

లాసల్‌గావ్ వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీ (ఎపిఎంసి) చైర్మన్ బాలాసాహెబ్ క్షీరసాగర్ మాట్లాడుతూ.. గత వారం ధరలు పెరిగాయి.. అయితే, ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేతకు సంబంధించి ప్రభుత్వ ప్రతిపాదన లేదా ప్రకటన లేకపోవడంతో అవి దాదాపు స్తబ్దుగా మారాయని అన్నారు. గతంలో వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ కూడా ఉల్లి ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయలేదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. దేశంలోని వినియోగదారులకు సరసమైన ధరలకు ఉల్లి తగినన్ని లభ్యమయ్యేలా చూడడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత.

వెల్లుల్లి ధర కిలో రూ.600కు చేరింది:

దేశంలోని రిటైల్ మార్కెట్‌లో వెల్లుల్లి ధర కిలో రూ.600కి చేరింది. దేశంలోనే అతిపెద్ద వెల్లుల్లి మార్కెట్‌లలో ఒకటైన గుజరాత్‌లోని జామ్‌నగర్ మండిలో గత కొద్దిరోజులుగా వెల్లుల్లి టోకు ధర కిలో రూ.350కి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో దీని రిటైల్ ధరలు కిలో రూ.500 నుంచి రూ.550కి చేరుకోగా చాలా ప్రాంతాల్లో కిలో రూ.600 వరకు పలుకుతోంది. గతేడాది కంటే ఈసారి వెల్లుల్లి ఉత్పత్తి తక్కువగా ఉంది. దీంతో మార్కెట్‌లో కొత్త పంటల రాక తక్కువ. పాత పంట నిల్వ అయిపోయింది. అందుకే దీని ధర భారీగా పెరిగింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి