ONGC: లాభాల రికార్డు సృష్టించిన ఓఎన్‌జీసీ.. ఈ త్రైమాసికంలో రిలయన్స్ కన్నా ఎక్కువగా.. ఎంత సాధించిందంటే..

ప్రభుత్వ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) రికార్డు సాధించింది. ఏ ఒక్క త్రైమాసికంలోనైనా దేశంలోనే అత్యధిక లాభాలు ఆర్జించిన కంపెనీగా అవతరించింది.

ONGC: లాభాల రికార్డు సృష్టించిన ఓఎన్‌జీసీ.. ఈ త్రైమాసికంలో రిలయన్స్ కన్నా ఎక్కువగా.. ఎంత సాధించిందంటే..
Ongc Profits
Follow us
KVD Varma

|

Updated on: Nov 14, 2021 | 12:49 PM

ONGC: ప్రభుత్వ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) రికార్డు సాధించింది. ఏ ఒక్క త్రైమాసికంలోనైనా దేశంలోనే అత్యధిక లాభాలు ఆర్జించిన కంపెనీగా అవతరించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.18,347.73 కోట్ల లాభాన్ని ఆర్జించింది ఓఎన్‌జీసీ.

ఇండియన్ ఆయిల్ రికార్డు సృష్టించింది

ఇప్పటి వరకు ఏ ఒక్క త్రైమాసికంలోనైనా అత్యధిక లాభాలు ఆర్జించిన రికార్డు గతంలో ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేరిట ఉంది. మార్చి 2013 త్రైమాసికంలో కంపెనీ రూ.14,513 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అయితే, టాటా స్టీల్ ఈ రికార్డును బద్దలు కొట్టి మార్చి 2018లో రూ.14,688 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

కోల్ ఇండియా 14,189 కోట్ల లాభాన్ని ఆర్జించింది

అంతకు ముందు ప్రభుత్వ రంగ కోల్ ఇండియా మార్చి 2016 త్రైమాసికంలో రూ.14,189 కోట్ల లాభాన్ని ఆర్జించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ, సెప్టెంబర్ 2021 త్రైమాసికంలో రూ.13,680 కోట్లు ఆర్జించింది. ఈ లెక్కన టాటా స్టీల్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన అన్ని కంపెనీలు లాభాలు సాధించాయి. కాగా, వాటిని దాటుకుని ఒఎన్‌జిసి ఒక్కటే రూ.18,348 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఇతర ఓఎన్‌జీసీ(ONGC) కంపెనీల ప్రయోజనాలను కలిపితే ఈ సంఖ్య రూ. 18,749 కోట్లు.

110% డివిడెండ్..

దీనితో  ఓఎన్‌జీసీ 110% డివిడెండ్‌ను ప్రకటించింది. అంటే ఒక్కో షేరుకు కంపెనీ రూ.5.50 డివిడెండ్ చెల్లిస్తుంది. దీని స్టాక్ శుక్రవారం 154 రూపాయల పైన ముగిసింది. ఏడాది క్రితం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ 2,757.77 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. దీనితో పోలిస్తే ఈసారి లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 5.65 రెట్లు పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరం పూర్తి సంవత్సరంలో (ఏప్రిల్ 2019 నుండి మార్చి 2020 వరకు) కేవలం రూ.11,246 కోట్ల లాభం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు అర్ధ వార్షిక కాలంలో రూ.22,682 కోట్ల లాభాన్ని ఓఎన్‌జీసీ ఆర్జించింది.

రెండు కారణాల వల్ల ఓఎన్‌జీసీ లాభం పెరిగింది

ఓఎన్‌జీసీ(ONGC) లాభాల్లో ఇంతటి విపరీతమైన వృద్ధికి రెండు కారణాలున్నాయి. ఒకవైపు ముడి చమురు ధరలు 41 డాలర్ల నుంచి 69 డాలర్లకు పెరిగాయి. కంపెనీ వన్-టైమ్ ట్యాక్స్ ప్రయోజనాన్ని పొందింది. ఏకమొత్తం పన్ను విషయంలోనే 8,541 కోట్ల లాభాన్ని కంపెనీ సంపాదించింది. చమురు, గ్యాస్ ఉత్పత్తి తగ్గినప్పటికీ ఓఎన్‌జీసీ ఈ లాభాలను ఆర్జించింది. కంపెనీ క్రూడ్ ఉత్పత్తి 3.8% క్షీణించి 54 లక్షల టన్నులకు చేరుకుంది. గ్యాస్ ఉత్పత్తి 7% క్షీణించి 5.4 బిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరుకుంది.

2019లో ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టాన్ని సంస్కరించింది

ఆదాయపు పన్ను చట్టం 1961ని ప్రభుత్వం 2019లో సవరించింది. దీని ప్రకారం, భారతదేశంలో ఉన్న కంపెనీలు కార్పొరేట్ ఆదాయపు పన్నులో 22% చెల్లించడానికి ఎంచుకోవచ్చు. దీనిపై సర్‌చార్జ్ , సెస్ వర్తిస్తాయి. గతంలో ఈ పన్ను 30% ఉండేది. ఇందుకోసం కొన్ని షరతులు పాటించాలి.సెప్టెంబర్ త్రైమాసికంలో ఓఎన్‌జీసీ ఆదాయం 44% పెరిగి రూ.24,353 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ ఆదాయం రూ.18,348 కోట్లు. అయితే, దాని అన్ని కంపెనీల ఆదాయం కలిపితే, మొత్తం1.22 లక్షల కోట్లు అవుతుంది. ఇది సెప్టెంబర్ 2020లో రూ.83,619 కోట్లు.

ఆసియాలో ముఖ్యమైన చమురు శుద్ధి కేంద్రం

ఓఎన్‌జీసీ ఆసియాలో ముఖ్యమైన చమురు శుద్ధి కేంద్రం. దీని వార్షిక సామర్థ్యం 249.36 మిలియన్ టన్నులు. ఇందులో 23 రిఫైనరీలు ఉన్నాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు దిగుమతులపై భారతదేశం 62.71 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో 101.4 బిలియన్లు అలాగే, 2018-19లో 111.9 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.

ఇవి కూడా చదవండి: Crypto Currency: అక్రమ క్రిప్టో ఎక్స్ఛేంజీలపై కఠిన చర్యలు తీసుకోవాలి..అధికారులను కోరిన ప్రధాని మోడీ

Amit Shah: అమిత్ షా ఆంధ్రా పర్యటన.. మూడురోజుల పాటు బిజీ బిజీగా గడపనున్న కేంద్ర హోం మంత్రి!

Sharia Law: కఠినమైన షరియా చట్టం అమలుకు ఆఫ్ఘనిస్తాన్ సిద్ధం.. ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన తాలిబన్ ప్రభుత్వం!