AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola S1 Air: ఓలా ఈవీ స్కూటర్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఓలా ఎస్1 ఎయిర్ బుకింగ్స్ ఓపెన్.. ఈ నెల 28 లోపు బుక్ చేసుకుంటే బంపర్ ఆఫర్

ఈవీ వాహనాల్లో విషయంలో భారతదేశంలో ఓలా కంపెనీ ఓ బెంచ్‌ మార్క్‌ను సెట్‌ చేసింది. సూపర్‌ స్టైలిష్‌ డిజైన్‌తో వచ్చే ఓలా స్కూటర్లను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతన్నారు. అయితే ధరల నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలు కొంచెం దూరంగా ఉన్నారు. అయితే అన్ని వర్గాలను ఆకట్టుకునే విధం ఓలా తన ఎస్‌1 మోడల్‌ ఎస్‌1 ఎయిర్‌ పేరుతో తక్కువ ధరకే స్కూటర్‌ను లాంచ్‌ చేసింది.

Ola S1 Air: ఓలా ఈవీ స్కూటర్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఓలా ఎస్1 ఎయిర్ బుకింగ్స్ ఓపెన్.. ఈ నెల 28 లోపు బుక్ చేసుకుంటే బంపర్ ఆఫర్
Ola S1 Air
Nikhil
|

Updated on: Jul 24, 2023 | 10:29 AM

Share

ప్రపంచ వ్యాప్తంగా ఈవీ వాహనాల జోరు పెరిగింది. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్‌ ధరలకు ప్రత్యామ్నాయ వాహనాలుగా ప్రజలు ఈవీలను భావిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా పెట్రోల్‌ కొనుగోలు భారం నుంచి రక్షణకు ఈవీ వాహనాలపై ప్రత్యేక సబ్సిడీలను ఇస్తూ ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఊహించని డిమాండ్‌తో స్టార్టప్‌ కంపెనీల నుంచి టాప్‌ ఎండ్‌ కంపెనీల వరకూ ఈ కంపెనీ తరఫును ఈవీ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే ఫోర్‌ వీలర్స్‌ మార్కెట్‌తో పోల్చుకుంటే టూ వీలర్‌ ఈవీలపైనే ప్రజలు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. వీటిల్లో కూడా బైక్స్‌ కంటే స్కూటర్లను ఇష్టపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉండే ట్రాఫిక్‌ నేపథ్యంలో అందరూ ఈవీ స్కూటర్లను వాడుతున్నారు. ఈ ట్రెండ్‌ క్రమేపీ గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరింది. అయితే ఈవీ వాహనాల్లో విషయంలో భారతదేశంలో ఓలా కంపెనీ ఓ బెంచ్‌ మార్క్‌ను సెట్‌ చేసింది. సూపర్‌ స్టైలిష్‌ డిజైన్‌తో వచ్చే ఓలా స్కూటర్లను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతన్నారు. అయితే ధరల నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలు కొంచెం దూరంగా ఉన్నారు. అయితే అన్ని వర్గాలను ఆకట్టుకునే విధం ఓలా తన ఎస్‌1 మోడల్‌ ఎస్‌1 ఎయిర్‌ పేరుతో తక్కువ ధరకే స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. అయితే ఈ స్కూటర్‌ను ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ఈ స్కూటర్‌ ప్రీ బుకింగ్స్‌  ఇప్పటికే ప్రారంభయ్యాయి. అయితే జూలై 28 లోపు బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక ఆఫర్‌ను కంపెనీ  ప్రకటించింది. ఈ స్కూటర్‌ ధర, ఇతర ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రారంభ ఆఫర్‌ ఇదే..

ఓలా ఎస్‌1 ఎయిర్‌ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. అయితే ఈ స్కూటర్‌ను జూలై 28లోపు ఈ స్కూటర్ను బుక్ చేసుకున్నవాళ్లకు ఈ స్కూటర్ ప్రారంభ ఆఫర్‌లో లభించనుంది. ప్రారంభ ఆఫర్ కింద ఈ స్కూటర్ రూ.1.09 లక్షలకే పొందవచ్చు. అలాగే ఇప్పటికే మీరు ఓలా కస్టమర్లు అయ్యితే జూలై 28 నుంచి జూలై 30 వరకూ ప్రత్యేకంగా ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. వీరికి కూడా రూ.1.09 లక్షలకే లభించనుంది.  అయితే జూలై 30 తర్వాత ఈ స్కూటర్‌ ధర రూ.1.20 లక్షలుగా ఉంది. అయితే ఈ ధరలకు ఆయా రాష్ట్రాల ట్యాక్స్‌లు అదనంగా ఉంటాయి. కాబట్టి ఈ స్కూటర్‌పై అంచనాలు విపరీతంగా పెరిగాయి. 

ఓలా ఎస్‌1 ఎయిర్‌ ఫీచర్లు ఇవే

ఓలా ఎస్‌ 1 ఎయిర్‌ ఈవీ స్కూటర్‌ 3 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. అలాగే ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జ్‌ చేస్తే 125 కిలో మీటర్ల మైలేజ్‌ ఇస్తుంది. ఈ స్కూటర్‌ గరిష్ట వేగం గంటకు 90 కిలో మీటర్లు. ముఖ్యంగా ఓలా కంపెనీ ఎస్‌ 1 ఎయిర్‌పై చాలా ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా ఈ స్కూటర్‌ ద్వారా ఈవీ స్కూటర్‌ రంగంలో రారాజుగా నిలవాలని చూస్తుంది. మరి చూద్దాం ఓలా ఆశలు ఫలిస్తాయో? లేదో?

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..