Ola Electric: ఓలా నుంచి మరో కొత్త స్కూటర్‌.. ఏకంగా 198కి.మీ. రేంజ్‌.. 8 ఏళ్ల వారంటీ..

ఓలా ఎస్‌1ఎక్స్‌ 4కేడబ్ల్యూహెచ్‌ పేరిట కొత్త స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. ఇది సింగిల్‌ చార్జ్‌ పై 190కిలోమీటర్ల పరిధిని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఓలా ఎస్‌1ఎక్స్‌ లైనప్‌లోనే అత్యధిక సామర్థ్య కలిగిన బ్యాటరీ 4కేడబ్ల్యూహెచ్‌ కావడం విశేషం. దీని ప్రారంభ ధరను రూ. 1.99లక్షలుగా ఓలా ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Ola Electric: ఓలా నుంచి మరో కొత్త స్కూటర్‌.. ఏకంగా 198కి.మీ. రేంజ్‌.. 8 ఏళ్ల వారంటీ..
Ola S1x

Updated on: Feb 03, 2024 | 8:21 AM

భారతీయ విద్యుత్‌ శ్రేణి వాహన మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్‌ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ద్విచక్రవాహన విభాగంలో సత్తా చాటుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల శ్రేణిలో గత కొన్నేళ్లుగా అత్యధిక విక్రయాలు చేసిన సంస్థగా రికార్డులు నమోదు చేసింది. అత్యాధునిక ఫీచర్లు, డిఫరెంట్‌ లుక్‌తో ఎలక్ట్రిక్‌ స్కూటర్ల మార్కెట్‌కు జోష్‌ ఇచ్చింది ఓలా. అయితే ఇటీవల కాలంలో ఏథర్‌, బజాజ్‌ వంటి సంస్థల నుంచి పోటీ పెరుగుతుండటంతో ఓలా తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు కొత్త వేరియంట్లను లాంచ్‌ చేస్తోంది. ఇటీవల అతి తక్కువ ధరలో లభ్యమయ్యే ఓలా స్కూటర్‌ ను లాంచ్‌ చేసిన సంస్థ ఇప్పుడు మరో వేరియంట్‌తో ముందుకొచ్చింది. ఓలా ఎస్‌1ఎక్స్‌ 4కేడబ్ల్యూహెచ్‌ పేరిట కొత్త స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. ఇది సింగిల్‌ చార్జ్‌ పై 190కిలోమీటర్ల పరిధిని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఓలా ఎస్‌1ఎక్స్‌ లైనప్‌లోనే అత్యధిక సామర్థ్య కలిగిన బ్యాటరీ 4కేడబ్ల్యూహెచ్‌ కావడం విశేషం. దీని ప్రారంభ ధరను రూ. 1.99లక్షలుగా ఓలా ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

పాత వేరియంట్‌ మాదిరిగానే..

కొత్త లాంచ్‌ చేసిన ఓలా ఎస్‌1ఎక్స్‌ 4కేడబ్ల్యూహెచ్‌ స్కూటర్‌ ఇప్పటికే ఉన్న ఎస్‌1ఎక్స్‌ 3కేడబ్ల్యూహెచ్‌ మాదిరిగానే ఉంటుంది. పూర్తి మెకానిజం అంతా దానిలాగేనే ఉంటుంది. మారేదల్లా బ్యాటరీ శక్తితోపాటు రేంజ్‌ మాత్రమే. ఈ స్కూటర్‌ 3కేడబ్ల్యూహెచ్‌ వేరియంట్‌ మాదిరిగానే 3.3 సెకండ్లలోనే సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. దీనిలో 6కేడబ్ల్యూ సామర్థ్యంతో ఉండే మోటార్‌ 8బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్లో ఎకో, నార్మల్‌, స్పోర్ట్స్‌ వంటి మూడు రైడింగ్‌ మోడ్లు ఉంటాయి.

ధర, లభ్యత..

ఓలా ఎస్‌1ఎక్స్‌ 4కేడబ్ల్యూహెచ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ డెలివరీలు ఏప్రిల్‌ నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్‌ కూడా ప్రారంభమయ్యాయి. దీని ధర రూ. 1.99లక్షలుగా ఉంది. అదే సమయంలో ఎస్‌1ఎక్స్‌ 2కేడబ్ల్యూహెచ్‌ ధర రూ. 79,999కాగా.. ఓలా ఎస్‌1 ఎక్స్‌ 3కేడబ్ల్యూహెచ్‌ వేరియంట్‌ ధర రూ. 89,999గా ఉంది.

ఇవి కూడా చదవండి

ఎనిమిదేళ్ల వారంటీ..

సంస్థ నిర్ధిష్టమైన టార్గెట్‌ పెట్టుకొని అడుగులు వేస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ అండ్‌ ఎండీ భవిష్‌ అగర్వాల్‌ చెప్పారు. తమ ఉత్పత్తులు, చార్జింగ్‌ నెట్‌ వర్క్‌, బ్యాటరీ వారంటీలపై అన్ని అడ్డంకులు అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఇదే క్రమంలో తమ ఉత్పత్తులు ఎస్‌1 ఎయిర్‌, ఎస్‌1 ప్రో ఎలక్ట్రిక్‌ స్కూటర్ల బ్యాటరీ ప్యాక్‌ పై 8 సంవత్సరాలు/80,000కిలోమీటర్ల వరకూ వారంటీని అందిస్తున్నట్లు వివరించారు. అంతేకాక అదనంగా రూ. 5000 చెల్లిస్తే లక్ష కిలోమీటర్ల వరకూ వారంటీని పొడిగిస్తామని చెప్పారు. అదే సమయంలో 1.25లక్షల కిలోమీటర్ల వరకూ వారంటీ పెరగాలంటే రూ. 12,500 చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us