Flipkart Big Saving Days: రూ. 30 వేల స్మార్ట్ టీవీనీ రూ. 7,749కే సొంతం చేసుకునే అవకాశం.. ఎలా అంటే..
Flipkart Big Saving Days: ఈకామర్స్ సైట్లు ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించే పనిలో పడింది. ఇందులో భాగంగా అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ పేరుతో (Fab phones fest) సేల్‌ను ప్రారంభించింది. ఇక మరో దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్టు (FlipKart) కూడా వినియోగదారులను ఆకర్షించేపనిలో పడింది. ఇందులో...
Flipkart Big Saving Days: ఈకామర్స్ సైట్లు ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించే పనిలో పడింది. ఇందులో భాగంగా అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ పేరుతో (Fab phones fest) సేల్‌ను ప్రారంభించింది. ఇక మరో దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్టు (FlipKart) కూడా వినియోగదారులను ఆకర్షించేపనిలో పడింది. ఇందులో భాగంగానే ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ పేరుతో సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌పై ఆఫర్లను ప్రకటించింది. మార్చి 12న ప్రారంభమైన ఈ సేల్ మార్చి 16వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ ఆఫర్‌లో భాగంగానే రూ. 30 వేలు విలువైన స్మార్ట్ టీవీని కేవలం రూ. 7500కే సొంతం చేసుకునే అవకాశం ఉంది. 42 ఇంచెస్ స్మార్ట్ టీవీని రూ. 7,749కి ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
బ్లౌపంక్ట్ కంపెనీకి చెందిన సైబర్ సౌండ్ అనే స్మార్ట్ టీవీపై ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది ఫ్లిప్ కార్ట్. 42 అంగుళాల ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 29,999గా ఉంది. అయితే ఆఫర్‌లో భాగంగా ఫ్లిప్ కార్ట్ ఈ టీవీపై 33 శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది. దీంతో ఈ టీవీ రూ. 19,999కే అందుబాటులో ఉంది. ఇక ఒక వేళ ఈ టీవీని ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంటే ఈ టీవీని రూ. 18,749కే సొంతం చేసుకోవచ్చన్నమాట. ఈ టీవీపై ఉన్న ఆఫర్లు ఇంతటితో ఆగలేదు. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత టీవీని ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 11,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇచ్చే టీవీకి పూర్తి ఆఫర్ వర్తిస్తే మీరు ఈ కొత్త టీవీని రూ. 7,749కే సొంతం చేసుకోవచ్చన్నమాట.
టీవీ ఫీచర్ల విషయానికొస్తే..
తక్కువ ధరకు వస్తుంది కాదా అని టీవీ ఫీచర్ల విషయంలో ఏమాత్రం రాజీ అవసరం లేదండోయ్. ఎందుకంటే ఈ టీవీలో అన్ని రకాల అధునాతన ఫీచర్లను అందించారు. Blaupunkt Cybersound 106 cm (42 inch) టీవీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో 40 వాట్స్‌తో కూడిన సౌండ్ అవుట్‌పుట్‌ను ఇచ్చారు. హెచ్‌డీ ఎల్‌ఈడీతో పాటు 1920 x 1080 రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. ఈ టీవీలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ వంటి అన్ని యాప్‌లను అందించారు.