Nokia: సంచలన నిర్ణయం తీసుకున్న నోకియా.. భారీగా ఉద్యోగులను తొలగించనున్న దిగ్గజ సంస్థ..
Nokia Reducing Employees: నోకియా.. ఇప్పుడంటే ఈ పేరు పెద్దగా ప్రాచుర్యంలో లేదు కానీ. ఒక 15 ఏళ్ల క్రితం మొబైల్ ఫోన్ ఇండస్ట్రీలో ఈ బ్రాండ్ ఒక సంచలనం. మొబైల్ ఫోన్ అంటే నోకియానే అన్నంతలా ఈ బ్రాండ్ పేరు...
Nokia Reducing Employees: నోకియా.. ఇప్పుడంటే ఈ పేరు పెద్దగా ప్రాచుర్యంలో లేదు కానీ. ఒక 15 ఏళ్ల క్రితం మొబైల్ ఫోన్ ఇండస్ట్రీలో ఈ బ్రాండ్ ఒక సంచలనం. మొబైల్ ఫోన్ అంటే నోకియానే అన్నంతలా ఈ బ్రాండ్ పేరు సంపాదించుకుంది. ఇక స్మార్ట్ ఫోన్‌లు వచ్చినప్పటి నుంచీ నోకియా తన ప్రాభావ్యాన్ని కోల్పోతూ వచ్చింది. పోటీ పెరగడం చాలా మొబైల్ కంపెనీలు తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్‌లు తీసుకురావడంతో నోకియా ఈ రేసులో వెనకబడింది. ఇదిలా ఉంటే తాజాగా నోకియా తన సంస్థను పునర్నిర్మాణం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే భారీగా ఉద్యోగులను తొలగించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నోకియా దాదాపు 10,000 మంది సిబ్బందిని తొలగించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ తొలగింపు ఇక్కడితోనే ఆగకుండా రానున్న రెండేళ్లలో మరికొంత మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపింది. ఇక నాలుగు ప్రధాన వ్యాపార విభాగాల్లో ఈ కోత ఉంటుందని నోకియా తెలిపింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులున్న ఈ సంస్థ ఏ దేశానికి చెందిన వారిని తొలగించనున్నారన్న విషయాన్ని మాత్రం తెలయజేయలేదు. ఇక ప్రస్తుతం నోకియాలో లక్ష మంది ఉద్యోగులు ఉండగా రానున్న రెండేళ్లలో ఈ సంఖ్యను 80 నుంచి 85 వేలకు పరిమితం చేయాలని భావిస్తోంది. దీంతో 2023 నాటికి సంస్థకు రూ.5,200 కోట్లు ఆదాచేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది.