Telugu News » World » Kim jong uns powerful sister sends warning to biden administration
North korea chief sister : జో బైడెన్‌కు నార్త్ కొరియా అధినేత పవర్ ఫుల్ సిస్టర్ కిమ్ యో జోంగ్ వార్నింగ్
North korea chief sister Kim Yo Jong : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌కు నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. పవర్ ఫుల్ సిస్టర్ కిమ్ యో జోంగ్ వార్నింగ్..
అమెరికా, నార్త్ కొరియా మధ్య విభేదాలు తీవ్ర వైషమ్యాలకు దారి తీస్తున్న వైనం.
1 / 5
గతవారం అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా సైనిక విన్యాసాలను ప్రారంభించగా దీన్నిప్యాంగాంగ్ లోని అధికార వార్తా పత్రిక ..’మా భూమిపై గన్ పౌడర్ చల్లాలనుకుంటే అమెరికాలోని కొత్త జో బైడెన్ ప్రభుత్వం కొన్ని సలహాలను ఆలకించాల్సిందే’ అంటూ పరోక్ష హెచ్చరిక.
2 / 5
ఇదే సందర్భంలో నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ‘వచ్చే నాలుగేళ్ళూ మీరు సుఖంగా నిద్రించాలనుకుంటే ఈ ‘సౌకర్యాన్ని పోగొట్టుకునే’ ఎలాంటి పనులు ప్రారంభించకండి’ అని ప్రకటించింది.
3 / 5
ఉత్తర కొరియాకు అమెరికా మరో చర్య కూడా ఆగ్రహం కలిగించింది. పెంటగాన్ చీఫ్ లాయిడ్ ఆస్టిన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ నిన్న జపాన్, సౌత్ కొరియాలను సందర్శించడం మరో ముఖ్యకారణమైంది.
4 / 5
అణ్వాయుధాల కోసం తహతహలాడుతున్న నార్త్ కొరియాను ఏకాకిని చేసేందుకు, చైనాను ఎండగట్టేందుకు వీరు ఓ సమైక్య ఫ్రంట్ ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన సోదరుడు కిమ్ కి అన్నివిధాలా అండదండలుగా ఉన్న అతని సోదరి కిమ్ యో జోంగ్ చేసిన ఈ హెచ్చరిక అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.