AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG eKYC: అలాంటిదేమి లేదు.. గ్యాస్‌ సిలిండర్‌ కస్టమర్ల ఈ-కేవైసీ గడువుపై కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి

ఎల్‌పీజీ సిలిండర్ల కోసం ఈకేవైసీ (eKYC) అథెంటికేషన్ ప్రక్రియను పాటించేందుకు ఎలాంటి కాలపరిమితి లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీస్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు..

LPG eKYC: అలాంటిదేమి లేదు.. గ్యాస్‌ సిలిండర్‌ కస్టమర్ల ఈ-కేవైసీ గడువుపై కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి
Lpg Gas Kyc
Subhash Goud
|

Updated on: Jul 10, 2024 | 12:20 PM

Share

ఎల్‌పీజీ సిలిండర్ల కోసం ఈకేవైసీ (eKYC) అథెంటికేషన్ ప్రక్రియను పాటించేందుకు ఎలాంటి కాలపరిమితి లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీస్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీషన్ రాసిన లేఖపై పూరీ స్పందించారు.

మస్టరింగ్ తప్పనిసరి అయినప్పటికీ, సంబంధిత గ్యాస్ ఏజెన్సీలలో దీన్ని చేయాలనే నిబంధన సాధారణ ఎల్‌పిజి హోల్డర్లకు అసౌకర్యంగా ఉందని సతీశన్ లేఖలో పేర్కొన్నారు. నకిలీ ఖాతాలను తొలగించడానికి, వాణిజ్య సిలిండర్ల మోసపూరిత బుకింగ్‌ను నిరోధించడానికి చమురు మార్కెటింగ్ కంపెనీలు లేదా OMCలు ఎల్‌పిజి కస్టమర్‌ల కోసం ఇకెవైసి ఆధార్ ప్రామాణీకరణను అమలు చేస్తున్నాయని హర్దీప్ సింగ్ పూరి మంగళవారం ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Gold Storage: ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చు? పరిమితికి మించి ఉంటే ఏమవుతుంది?

అయితే, ఈ ప్రక్రియ ఎనిమిది నెలలకు పైగా అమలులో ఉందని, నిజమైన వినియోగదారులకు మాత్రమే ఎల్‌పిజి సేవలు అందేలా చూడటమే లక్ష్యంగా పెట్టుకున్నామని పూరీ స్పష్టం చేశారు.

వంట గ్యాస్ సిలిండర్ల వినియోగదారుల ఈ-కేవైసీ ప్రక్రియకు ఎటువంటి తుది గడువు లేదని ఆయన స్పష్టం చేశారు. 2023లోనే ఎల్పీజీ ఈ-కేవైసీ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర చమురు సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. తదనుగుణంగా గ్యాస్ ఏజెన్సీలు తమ కస్టమర్ల ఈ-కేవైసీ ప్రక్రియ మొదలు పెట్టాయి. గ్యాస్ ఏజెన్సీల వద్దే ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని కొన్ని సంస్థలు పట్టుబట్టడంతో వంట గ్యాస్ వినియోగదారులు ఇబ్బందుల పాడుతున్న నేపథ్యంలో హార్థీప్‌సింగ్‌ పూరీ ఈ ప్రకటన చేశారు.

ఇది కూడా చదవండి: అనంత-రాధికల పెళ్లికి ఫోటోగ్రఫీ ఎవరు? ఇతను రోజుకు ఎంత ఫీజు తీసుకుంటాడో తెలిస్తే షాకవుతారు

గ్యాస్‌ వినియోగదారులు తమ సమయానుకూలంగా సమీపంలో ఉన్న గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్ సెంటర్‌కు వెళ్లి కూడా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. అలాగే కేంద్ర చమురు సంస్థల యాప్‌లు ఇన్ స్టాల్ చేసుకుని సొంతంగా ఈ-కేవైసీ అప్ డేట్ చేయొచ్చు’ అని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు.

ఇది కూడా చదవండి: Anant Ambani Wedding: అంబానీ ఇంట పెళ్లి సంబరాలు.. వంటకాల మెనూలో ఇది ప్రత్యేకం.. అదేంటో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి