May Month New Rules
ఇక ఏప్రిల్ నెల ముగియబోతోంది. మే నెల వస్తోంది. 1వ తేదీ నుంచి పలు నిబంధనలు మారనున్నాయి. దీంతో వినియోగదారులు ముందస్తుగా అప్రమత్తమై మారే నిబంధనలు ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రతినెల మొదటి తేదీ నుంచి అనేక మార్పులు ఉండటం గమనిస్తూనే ఉంటారు. ఏప్రిల్ నెల ముగియనుంది. రేపటి నుంచి మే నెల ప్రారంభం కానుంది. ప్రతి నెల మొదటి తేదీన అనేక మార్పులు ఉంటాయి. మే 1 నుంచి కూడా చాలా మార్పులు జరగనున్నాయి. కొత్త మార్పుల కారణంగా మీ జేబుకు చిల్లులు పడే అవకాశం ఉంది.
- జీఎస్‌టి నిబంధనలు: ఇప్పటికే జీఎస్టీలోని పలు రూల్స్ మారనున్నాయి. వ్యాపారులు కొత్త నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఏదైనా లావాదేవీకి సంబంధించిన రసీదుని 7 రోజులలోపు ఇన్‌వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడం తప్పనిసరి చేశారు. మే 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీల కోసం వస్తువులు, సేవా పన్నులో ఈ మార్పు ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలు ఐఆర్‌పిలో ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
- గ్యాస్ సిలిండర్ ధర: ఇక ప్రతి నెల ఒకటో తారీఖును గ్యాస్ ధరలలో మార్పులు జరగడం చూస్తూనే ఉన్నాము. అలాగే మే 1న ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఎల్‌పిజి వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు ఏప్రిల్‌లో తగ్గించారు. కంపెనీలు ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ.92 వరకు తగ్గించాయి. ఢిల్లీలో సిలిండర్ తగ్గింది. ఢిల్లీలో వాటి ధరల్లో ఏడాదిలో రూ.225 ఉపశమనం లభించింది. అయితే గ్యాస్ ధరగొచ్చు.. లేదా తగ్గొచ్చు. లేక స్థిరంగా కొనసాగవచ్చు.
- మ్యూచువల్ ఫండ్ల ఇన్వెస్టర్లకు అలర్ట్..: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలను కేవైసీ చేసిన ఇ-వాలెట్ల నుండి డబ్బును అంగీకరించేలా చూసుకోవాలని కోరింది. మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసేవారు సాధారణంగా ఇ-వాలెట్లను వినియోగిస్తుంటారు. అయితే ఇవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విధించిన కేవైసీ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని SEBI ఆదేశించింది. మే 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ ప్రకటించింది. మీ వాలెట్ KYC కాకపోతే, మీరు దాని ద్వారా పెట్టుబడి పెట్టలేరు.
- సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు: సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు కూడా ప్రతి నెల 1వ తేదీన లేదా నెల మొదటి వారంలో సవరిస్తారు. ఢిల్లీ, ముంబైలలో నెల మొదటి వారంలో పెట్రోలియం కంపెనీలు గ్యాస్ ధరను మారుస్తాయి. మే ప్రారంభంలో సిఎన్‌జి ధరలలో మార్పు ఉండవచ్చు. ఏప్రిల్‌లో ముంబై, ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో సిఎన్‌జి, పిఎన్‌జి ధరలు తగ్గించారు. కొత్త ధరలు ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో కూడా సిఎన్‌జి ధరను తగ్గించింది.
- పంజాబ్ నేషల్ బ్యాంకు కస్టమర్లకు..: ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకు తన కస్టమర్లకు షాకివ్వనుంది. బ్యాంకు కీలక మార్పు చేసింది. ఖాతాదారులకు డబ్బు లేకపోవడంతో ATMలలో లావాదేవీలు విఫలమైతే వారికి రూ.10తో పాటు జీఎస్టీ కూడా విధించనున్నట్లు బ్యాంకు ప్రకటించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి