EPFO: ఈపీఎఫ్‌వోలో మరో కొత్త అప్డేట్.. త్వరలో మారనున్న రూల్స్.. కొత్త పోర్టల్‌పై కీలక ప్రకటన
ఈపీఎఫ్‌వో కొత్త మార్పులు రానున్నాయి. ఈ మేరకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త సిస్టమ్ అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ఏప్రిల్ 1 నుంచి కీలక అప్డేట్‌ను ప్రవేశపెట్టనుంది. కొత్త పోర్టల్, యూపీఐ విత్ డ్రా లాంటి కీలక సంస్కరణలు రానున్నాయి. ్ట

దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఉద్యోగులకు త్వరలో కేంద ప్రభుత్వం శుభవార్త అందించనుంది. ఈపీఎఫ్‌వో భారీ మార్పులు తీసుకురానుంది. దీంతో పీఎఫ్ సేవల స్వరూపమే పూర్తిగా మారనుంది. త్వరలో ఈపీఎఫ్‌వో 3.0 పేరుతో రూల్స్‌ను మార్చేందుకు సిద్దమవుతున్నారు. ఈ కొత్త రూల్స్‌తో పీఎఫ్ విత్ డ్రా సేవలు మరింత సులువు కావడంతో పాటు అనేక కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఉద్యోగులకు లాభపడేలా పీఎఫ్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరిస్తున్నారు. కొత్త పీఎఫ్ పోర్టల్‌తో పాటు యూపీఐ సౌకర్యం లాంటి కొత్త అప్డేట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
పీఎఫ్ కొత్త పోర్టల్
ప్రస్తుతం ఉన్న ఈపీఎఫ్ పోర్టల్ స్థానంలో కొత్త వెబ్‌సైట్ తీసుకురానున్నారు. అలాగే బ్యాకెండ్ సిస్టమ్ మొత్తం మారిపోతుంది. ఇక పీఎఫ్ సేవల్లో బ్యాంకింగ్ సిస్టమ్ పూర్తిగా మారనుంది. అన్నీ సమస్యలు ఒకేచోట పరిష్కరించుకునేలా సెంట్రలైజ్డ్ సిస్టమ్ ప్రవేశపెట్టనున్నారు. ఇక గిగ్ వర్కర్లకు కల్పించే రిటైర్‌మెంట్ ఫండ్‌లను కూడా ఈపీఎఫ్‌వో నిర్వహించనుంది. ఇక త్వరలో మరింతమంది ఉద్యోగులకు పీఎఫ్ సౌకర్యం కల్పించనంది. ఇందుకోసం ప్రభుత్వం ఉన్న రూ.15 వేల కనీస వేతన పరిమితి నిబంధనలను తొలగించనుందని తెలుస్తోంది.
ఏఐ టూల్
ఇక ఈపీఎఫ్‌లో ఏఐ లాంగ్వేజ్ టూల్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఖాతాదారుల సమస్యలకు తమ స్థానిక భాషలో సమాధానాలు ఇస్తుంది. ఇందుకోసం భాషిణి అనే ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ టూల్ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఏఐ టూల్‌ను కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ రూపొందించింది.
ఏప్రిల్ 1 నుంచి విత్ డ్రా సులువు
కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలు కానున్న ఏప్రిల్ 1వ తేదీ నుంచి పీఎఫ్ విత్ డ్రా చేసుకునేందుకు యూపీఐ సౌకర్యాన్ని కేంద్రం ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా మీరు యూపీఐ యాప్స్ నుంచి సులువుగా పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏటీఎం నుంచి కూడా డబ్బులు ఉపసంహరించుకునే ఫీచర్ ప్రవేశపెట్టనుంది. అయితే మొత్తం ఒకేసారి విత్ డ్రా చేసుకోవడానికి కుదరదు. కేవలం పీఎఫ్ ఖాతాలోని 75 శాతం సొమ్మును మాత్రమే తీసుకోవచ్చు. మిగతా సొమ్మును ఉద్యోగం మానేశాక మాత్రమే తీసుకోవడానికి కుదురుతుంది. యూపీఐ, ఏటీఎం సౌకర్యం అందుబాటులోకి వస్తే ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా అప్‌లోడ్ చేయాల్సిన పని ఉండదు. ఎప్పుడైనా ఎక్కడైనా పీఎఫ్ డబ్బులు సులువుగా విత్ డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ 3.0 అమలు చేసేందుకు టెండర్లను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. సిస్టమ్‌లో పూర్తి మార్పులు చేసేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోనుంది. ఈ అప్డేట్స్ కోసం ఉద్యోగులందరూ ఎదురుచూస్తున్నారు.
