AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కొత్త రూల్స్.. ఇకపై రూ.1800 చెల్లిస్తే సరిపోతుంది.. అమల్లోకి నిబంధనలు..

ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఈపీఎఫ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇక నుంచి రూ.15 వేల కంటే ఎక్కువ జీతం పొందుతున్నవారికి పీఎఫ్‌కు అధిక మొత్తంలో కాంట్రిబ్యూట్ చేయాల్సిన పని లేదు. అంతకంటే ఎక్కువ చెల్లించాలంటే యజమాని సమ్మతితో కాంట్రిబ్యూట్ చేయవచ్చు.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కొత్త రూల్స్.. ఇకపై రూ.1800 చెల్లిస్తే సరిపోతుంది.. అమల్లోకి నిబంధనలు..
Epfo Withdraw
Venkatrao Lella
|

Updated on: Jul 03, 2026 | 4:37 PM

Share

కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. 1952 నాటి పాత స్కీమ్ స్థానంలో కొత్త ఈపీఎఫ్ పథకం 2026 అమల్లోకి తెస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పథకంలో పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌కు సంబంధించి కేంద్రం పలు కీలక మార్పులు చేసింది. ఈపీఎఫ్ఓ కనీస వేతన పరిమితి రూ.15 వేల కంటే ఎక్కువ సంపాదించేవారు నెలకు రూ.1800 కాంట్రిబ్యూట్ చేస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ చెల్లించాలంటే స్వచ్చంధంగా ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇందుకోసం ఉద్యోగి, యజమాని మధ్య అంగీకారంతో అంతకంటే ఎక్కువ చెల్లించవచ్చు. దీని వల్ల ఉద్యోగులకు టేక్ హోం శాలరీ పెరగనుంది. ఈ నిబంధనల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఈపీఎఫ్ఓ కొత్త నిబంధన ఇదే..

ఉద్యోగి బేసిక్ శాలరీ రూ.15 వేలు ఉంటే ఈపీఎఫ్ఓలో ఖచ్చితంగా చేరాలి. ఉద్యోగి 12 శాతం కాంట్రిబ్యూట్ చేస్తే.. కంపెనీ అందుకు సమానమైన 12 శాతం చెల్లిస్తుంది. దీంతో ఉద్యోగి తన జీతం నుంచి ప్రతీ నెలా రూ.1800 పీఎఫ్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఇక యజమాని కూడా రూ.1800 కాంట్రిబ్యూట్ చేస్తారు. అయితే ఇప్పటివరకు కంపెనీలు రూ.15 వేల కంటే ఎక్కువ బేసిక్ శాలరీ ఉన్నవారికి అసలు జీతంపై పీఎఫ్ లెక్కించేవారు. దీంతో పీఎఫ్‌కు ఎక్కువ చెల్లించాల్సి వచ్చేది. ఎక్కువ శాలరీ ఉన్నవారికి రూ.5 వేలు, రూ.10 వేలు పీఎఫ్ కట్ అయ్యేవి. కానీ ఇక నుంచి రూ.1800 మాత్రమే కట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ కట్ చేయాలంటే యజమాని, ఉద్యోగి ఇద్దరి సమ్మతితో చేసుకోవచ్చు. ఈ నిబంధనను తప్పనిసరి కాకుండా స్వచ్చంధం చేశారు. దీంతో ఉద్యోగికి అవసరమైతే యజమాని అంగీకారంతో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయవచ్చు.

పెరగనున్న టేక్ హోం శాలరీ

రూ.1800 మాత్రమే తప్పనిసరిగా చెల్లించాలనే నిబంధనల వల్ల టేక్ హోం శాలరీ తగ్గనుంది. భవిష్యత్తులో ఎక్కువ డబ్బు పొదుపు చేయాలనుకునే ఉద్యోగులు స్వచ్చంధంగా ఎక్కువ మొత్తం చెల్లించవచ్చు. ఉద్యోగి ఎక్కువ చెల్లిస్తే.. యజమాని కూడా అందుకు సమానంగా చెల్లించాలి. ఇక యజమానులకు కూడా దీని వల్ల ఊరట కలగనుంది. ఎక్కువమంది ఉద్యోగులు ఉన్న కంపెనీలకు ఖర్చులను తగ్గించనుంది. దీంతో పాటు ఈపీఎఫ్ఓ కొత్త పథకంలో పలు మార్పులు చేసింది. ఇక నుంచి మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఏడాదికి రెండుసార్లు మాత్రమే పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇక కంపెనీలు మారినా ఏడాదికి రెండుసార్లు మాత్రమే నగదు ఉపసంహరించుకోవచ్చు. ఈ మేరకు కేంద్రం పలు పరిమితులు విధించింది. పాక్షిక ఉపసంహరణలపై కూడా పీఎఫ్ పలు నిబంధనలు అమల్లోకి తెచ్చింది.

Follow Us
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి మారిన రూల్స్.. కేంద్రం కొత్త నిబంధనలు
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి మారిన రూల్స్.. కేంద్రం కొత్త నిబంధనలు
ఏందీ.. ఎలుకల్లో ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయా?
ఏందీ.. ఎలుకల్లో ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయా?
మన తాతల సీక్రెట్ ఈ పొలం పచ్చడే.. ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్!
మన తాతల సీక్రెట్ ఈ పొలం పచ్చడే.. ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్!
ఒక్కో పరుగుకు రూ. 14 వేలు.. దటీజ్ బుడ్డోడి బ్రాండ్ వాల్యూ
ఒక్కో పరుగుకు రూ. 14 వేలు.. దటీజ్ బుడ్డోడి బ్రాండ్ వాల్యూ
బాలీవుడ్ ఫిట్‌నెస్ క్వీన్ మలైకా డైట్ ప్లాన్, ఫిట్‌నెస్ సీక్రెట్
బాలీవుడ్ ఫిట్‌నెస్ క్వీన్ మలైకా డైట్ ప్లాన్, ఫిట్‌నెస్ సీక్రెట్
'NEET UG 2026 రీఎగ్జాం ఫలితాల తేదీ ఇదే.. MBBS తరగతులు ఆలస్యంకావు'
'NEET UG 2026 రీఎగ్జాం ఫలితాల తేదీ ఇదే.. MBBS తరగతులు ఆలస్యంకావు'
తెలంగాణలో రాబోయే 3 రోజులకు లేటెస్ట్ రిపోర్ట్ ఇదే
తెలంగాణలో రాబోయే 3 రోజులకు లేటెస్ట్ రిపోర్ట్ ఇదే
ఒక్క దెబ్బకు వీరి అప్పులు మొత్తం ఎగిరిపోతాయి.. మీ రాశి ఉందా?
ఒక్క దెబ్బకు వీరి అప్పులు మొత్తం ఎగిరిపోతాయి.. మీ రాశి ఉందా?
అమర పావురాల రహస్యం నుంచి మంచు శివలింగం వరకు.. బాబా బర్ఫానీ మహిమలు
అమర పావురాల రహస్యం నుంచి మంచు శివలింగం వరకు.. బాబా బర్ఫానీ మహిమలు
ప్రభుత్వ బ్యాంకుల్లో భారీగా కొలువులు.. డిగ్రీ అర్హతతో IBPS జాబ్స్
ప్రభుత్వ బ్యాంకుల్లో భారీగా కొలువులు.. డిగ్రీ అర్హతతో IBPS జాబ్స్