AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acer Muvi: టెక్ దిగ్గజం లాంచ్ చేసిన కొత్త స్కూటర్.. రెట్రో లుక్.. స్టైలిష్ డిజైన్.. మామూలుగా లేదుగా..

ప్రముఖ టెక్ దిగ్గజం ఏసర్ కంపెనీ తన కొత్త బ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించింది. ఏసర్ మూవీ 125 4జీ(Acer Muvi 125 4G) పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ.99,999. అలాగే ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు 80 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీ దీని ప్రత్యేకత. తద్వారా బండి నిర్వహణ చాలా సులభంగా ఉంటుంది.

Acer Muvi: టెక్ దిగ్గజం లాంచ్ చేసిన కొత్త స్కూటర్.. రెట్రో లుక్.. స్టైలిష్ డిజైన్.. మామూలుగా లేదుగా..
Acer Muvi 125 4g
Madhu
|

Updated on: Apr 19, 2024 | 4:37 PM

Share

దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పరిధి శరవేగంగా విస్తరిస్తోంది. రోజుకొక కొత్త స్కూటర్ మార్కెట్లో విడుదల అవుతోంది. ప్రత్యేక ఫీచర్లు, స్టైలిష్ లుక్ తో వేటికవే కొనుగోలు దారులను ఆకట్టుకుంటున్నాయి. వీటి ధర కూడా అందుబాటులో ఉండడంతో సామాన్యులు సైతం ఆసక్తి చూపుతున్నారు. దాదాపు 80 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ స్కూటర్ల అమ్మకాలు, దానికంటే ఎక్కువ వేగంతో పరిగెడుతున్నాయి. పెట్రోలు ధరలు పెరిగిపోవడం, పర్యావరణ రక్షణ తదితర ప్రధాన కారణాలతో వీటి వినియోగం ఇటీవల బాగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా రాయితీలు ఇచ్చి కొనుగోలు దారులకు ప్రోత్సహిస్తుంది. ఈ క్రమంలో అనేక కొత్త కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ రంగంలో అడుగుపెడుతున్నాయి. ఇప్పటికే షావోవి వంటి సెల్ ఫోన్ కంపెనీలు ఈ రంగంలో అడుగుపెట్టాయి. ఇప్పుడు ప్రముఖ టెక్ దిగ్గజం ఏసర్ కంపెనీ తన కొత్త బ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించింది. ఏసర్ మూవీ 125 4జీ(Acer Muvi 125 4G) పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ.99,999. అలాగే ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు 80 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీ దీని ప్రత్యేకత. తద్వారా బండి నిర్వహణ చాలా సులభంగా ఉంటుంది.

ఒప్పందం ప్రకారం..

ఏసర్ కంపెనీ, ఈబైక్ గో మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ దేశ మార్కెట్ లోకి విడుదలైంది. దీనిని రెట్రో, ఆధునిక డిజైన్ల కలబోతగా చెప్పవచ్చు. మన దేశంలో రూ.99,999 (ఎక్స్ షోరూమ్)కు ఈ బండి అందుబాటులో ఉంది. తెలుపు, నలుపు వేరియంట్లలో ఆకట్టుకుంటుంది. కంపెనీ తన అధికార వెబ్ సైట్ ద్వారా ప్రీ బుక్కింగ్ ప్రారంభించింది. కేవలం రూ.999 చెల్లించి బుక్కింగ్ చేసుకోవచ్చు.

రాయితీలు..

ఈ ఎలక్ట్రిక్ వాహనానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలు లభిస్తాయి. నిర్వహణ వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. రెండు బ్యాటరీల ద్వారా తగినంత శక్తి అందుతుంది. గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

ప్రత్యేకతలు..

స్కూటర్ కు ముందు భాగంలో రౌండ్ ఎల్ ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంది, రెండు చక్రాలను డిస్క్ బ్రేక్‌లు అమర్చారు. దీంతో అత్యవసర సమయంలో వాహనాన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఐవోఎస్, ఆండ్రాయిడ్ పరికరాలతో కనెక్ట్ చేయగల 4 అంగుళాల బ్లూటూత్ దీనికి అదనపు ఆకర్షణ. 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ తో ఆకట్టుకుంటోంది.

మరిన్ని వాహనాల ఆవిష్కరణకు చర్యలు..

ఓలా ఎలక్ట్రిక్ , ఏథర్ తదితర కొత్త బ్రాండ్‌లు మార్కెట్లో దూసుకుపోతున్నాయి. వాటికి ఈ కొత్త బ్రాండ్ ఎంత వరకూ పోటీ ఇస్తుందో చూాడాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా కొత్త బ్రాండ్ దేశంలో అడుగుపెట్టింది. అలాగే దీని నుంచి మరిన్ని ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను ఆవిష్కరించడానికి అడుగులు పడుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..