ULIP pension plan: రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రతినెలా ఆదాయం కావాలా..? ఈ పెన్షన్ ప్లాన్‌తో ఎంతో ప్రయోజనం
భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం. సంపాదించే సమయంలో తెలివిగా వ్యవహరిస్తే ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక నిశ్చితంగా ఉండవచ్చు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు లేకండా హాయిగా జీవించవచ్చు. కాబట్టి సంపదను, రాబడిని పెంచుకోవడానికి ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. వివిధ పథకాలలో పెట్టుబడులు పెట్టాలి. చిన్న వయసులోనే పదవీ విరమణకు ఆదా చేయడానికి ప్లాన్ వేసుకుంటే చాలా లాభం కలుగుతుంది. అందుకు యులిప్ పెన్షన్ ప్లాన్ చాలా ఉపయోగంగా ఉంటుంది.
పదవీ విరమణ సమయానికి మనల్ని ఆదుకునేందుకు అనేక సాధనాలు ఉన్నాయి. వాటిలో యూఎల్ఐపీ (యులిప్) పెన్షన్ ప్లాన్ అత్యంత ఉపయోగంగా ఉంటుంది. మీ పెట్టుబడిని జీవితం కాలం లెక్కించడంతో పాటు డబుల్ ఇంజిన్ ఫెక్సిబిలిటీ, మార్కెట్ లింక్డ్ గ్రోత్ ను పొందుతారు. మీ పదవీ విరమణ కార్పస్ ను పెంచడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. యూనిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ లేదా యులిప్ అనేది ఒక రకమైన లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ. దీని ద్వారా బీమాతో పాటు పెట్టుబడికి ప్రయోజనం లభిస్తుంది. అంటే మీకు బీమా రక్షణ అందిస్తూనే సంపద పెంచుకోవడానికి అవకాశం కలుగుతుంది.
యులిప్ లో పెట్టే పెట్టుబడిని ప్రీమియం అంటారు. దీనిలో కొంత మొత్తాన్ని బీమా కవరేజీకి, మిగిలిన దాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడతారు. యులిప్ పెన్షన్ ప్లాన్ మీకు అనేక రకాల ప్రయోజనం కలిగిస్తుంది. డబ్బులను ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఎంపిక చేసుకునే అవకాశం కలుగుతుంది. మీ రిస్క్ ప్రొఫైల్, రిస్క్ అపెటిట్ ఆధారంగా ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, లేదా ఈ రెండింటి కలయికలో మీ ప్రీమియాన్ని పెట్టుబడిగా పెట్టవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే మీ ప్రీమియంలో వందశాతం వరకూ ఈక్విటీలో పెట్టుబడి పెట్టుకునే వీలుంటుంది. యలిప్ పెన్షన్ ప్లాన్ ద్వారా ఒకే ప్లాన్ లో అన్ని దశల్లోనూ సరైన బ్యాలెన్స్ చేయడానికి ఫండ్స్ మధ్య మారే వెసులుబాటు ఉంటుంది. స్థిర పోర్ట్ ఫోలియోకు కట్టుబడి ఉండకుండా మీరు నచ్చిన ఫండ్లకు మారిపోవచ్చు.
రాబడి పెంచుకునే లక్ష్యంలో భాగంగా మార్కెట్ పరిస్థితులను బట్టి ఫండ్ల ను మార్చుకుంటూ వెళ్లే అవకాశం ఉంటుంది. యులిప్ పెన్షన్ ప్లాన్ లో ఐదేళ్ల పెట్టుబడిని పూర్తి చేసిన తర్వాత, డబ్బులు అవసరమైతే పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చు. ఉద్యోగ విరమణ తర్వాత కార్పస్ లో 60 శాతాన్ని పన్నురహితంగా ఉపసంహరించుకునే అవకాశం కలుగుతుంది. మిగిలిన 40 శాతం యాన్యుటీలో పెట్టుబడి గా జమచేస్తారు. తద్వారా ఉద్యోగ విరమణ తర్వాత మీకు నిరంతరం ఆదాయం వచ్చే అవకాశం కలుగుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి