Mukesh Ambani: ఆదాయాల లెక్కలు రాకముందే ముఖేష్ అంబానీ కంపెనీకి రూ.65 వేల కోట్ల నష్టం

ఆసియాలోని అత్యంత సంపన్న బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ త్రైమాసిక ఫలితాలకు మరికొన్ని గంటల సమయం మిగిలి ఉంది. అయితే అంతకుముందే దేశంలోని అతిపెద్ద కంపెనీ..

Mukesh Ambani: ఆదాయాల లెక్కలు రాకముందే ముఖేష్ అంబానీ కంపెనీకి రూ.65 వేల కోట్ల నష్టం
Mukesh Ambani
Follow us
Subhash Goud

|

Updated on: Jul 21, 2023 | 5:38 PM

ఆసియాలోని అత్యంత సంపన్న బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ త్రైమాసిక ఫలితాలకు మరికొన్ని గంటల సమయం మిగిలి ఉంది. అయితే అంతకుముందే దేశంలోని అతిపెద్ద కంపెనీ రూ.65,000 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది. కంపెనీ షేర్లు మూడున్నర శాతానికి పైగా క్షీణించాయి. నిజానికి రెండో త్రైమాసికంలో రిలయన్స్ విక్రయాల్లో ఆదాయం తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ఫైనాన్షియల్‌ల విభజన ఒక రోజు క్రితం జరిగింది. ఆ కారణంగా కంపెనీ వెయిటేజీ కూడా బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇ నుంచి తగ్గింది. రిలయన్స్ రిజల్ట్‌కు సంబంధించి నిపుణులు ఎలాంటి అంచనాలు వేశారు ? తదితర విషయాలు తెలుసకుందాం.

ఆర్‌ఐఎల్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన రూ.2,19,304 కోట్లతో పోలిస్తే 4 శాతం తగ్గి రూ.2,09,771 కోట్లకు చేరుకోవచ్చు. రిలయన్స్ జియో గురించి మాట్లాడితే.. కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీల ప్రకారం.. Ebitda రూ. 90 లక్షల నికర వృద్ధి, మార్చి త్రైమాసికంలో ARPU రూ.179 నుంచి స్వల్ప పెరుగుదల కారణంగా ఏటా 15 శాతం వృద్ధి చెందుతుందని అంచనా.

షేర్లు 3.5 శాతానికి పైగా పడిపోయాయి

ఈ ఊహాగానాల కారణంగా ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. మధ్యాహ్నం 2.50 గంటలకు కంపెనీ షేరు 3 శాతం క్షీణతతో రూ.2540 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ సెషన్‌లో కంపెనీ షేరు కూడా రూ.2523.35కి చేరుకుంది. అంటే ఈరోజు కంపెనీ షేరు 3.63 శాతం క్షీణించింది.

ఇవి కూడా చదవండి

ప్రత్యేక సెషన్ తర్వాత కంపెనీ షేరు రూ.2619.80 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సెషన్‌లో రూ.2,635.17తో 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. జియో ఫైనాన్షియల్ విభజన తర్వాత, బుధవారంతో పోలిస్తే రిలయన్స్ షేర్లు గణనీయంగా తగ్గాయి. బుధవారం కంపెనీ షేరు రూ.2,800కు పైగా ముగిసింది.

కంపెనీ మార్కెట్ క్యాప్ 65 వేల కోట్లు క్షీణించింది:

షేర్ల పతనం కారణంగా రిలయన్స్ మార్కెట్ క్యాప్ భారీగా క్షీణించింది. ఒకరోజు క్రితం మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.17,73,507.12 కోట్లుగా ఉంది. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు కంపెనీ షేరు రూ.2523.35కి చేరుకోగా, కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.17,08,214.06 కోట్లకు చేరింది. అంటే కొన్ని గంటల్లోనే కంపెనీ మార్కెట్ రూ.65,293.06 కోట్ల నష్టాన్ని చవిచూసింది. మధ్యాహ్నం 3 గంటలకు కంపెనీ మార్కెట్ క్యాప్ కోలుకుని రూ.17,19,210.32 కోట్లకు చేరుకుంది.

జేఎం ఫైనాన్షియల్ ఆయిల్-టు-టెలికాం మేజర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం సంవత్సరానికి 12.2 శాతం తగ్గి రూ.15,764.90 కోట్లుగా అంచనా వేసింది. దీని విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 2.7 శాతం తగ్గి రూ.2,13,471 కోట్లుగా అంచనా వేయబడింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.17,955 కోట్లుగా ఉన్న ఆర్‌ఐఎల్ లాభం జూన్ త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన 14 శాతం తగ్గి రూ.15,417.70 కోట్లకు చేరుకోవచ్చని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ అభిప్రాయపడింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!