AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM-KISAN 11th Instalment: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ డబ్బులు ఆ రోజే.. ప్రకటించిన నడ్డా..!

PM KISAN Samman Nidhi Yojana: దేశంలోని రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు కేంద్రం పలు పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం..

PM-KISAN 11th Instalment: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ డబ్బులు ఆ రోజే.. ప్రకటించిన నడ్డా..!
Subhash Goud
| Edited By: Ravi Kiran|

Updated on: May 31, 2022 | 12:03 PM

Share

8 Yrs Of Modi Govt – Good News To Farmers: మోదీ సర్కార్‌(Narendra Modi Government) 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రైతులకు శుభవార్తను అందించింది. ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ 11వ విడత సొమ్మును రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్దం చేసింది.

దేశంలోని రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు కేంద్రం పలు పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం (PM kisna yojana) ఒకటి. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Scheme) స్కీమ్ 11వ విడతకు సంబంధించిన రూ. 1.80 లక్షల కోట్లను మే 31వ తేదీన రైతుల బ్యాంకు అకౌంట్లో జమ చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర బీజేపీ చీఫ్‌ నడ్డా ప్రకటించారు. మంగళవారం 10కోట్ల మందికిపైగా రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ కానున్నాయి. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది కేంద్రం. ఈ స్కీమ్‌ ద్వారా ప్రతి భూమి ఉన్న రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ. 6,000 అందిస్తోంది. రూ. 2,000 చొప్పున మూడు విడతల్లో బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లను తనిఖీ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 10వ విడత జమ కాగా, ఇప్పుడు 11వ విడత నిధులు రేపు జమ కానున్నాయి. అయితే ఈ డబ్బులు వచ్చిన తర్వాత జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. పదో విడత జనవరి 1న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాగా, ఇప్పుడు 11వ విడత అందించనుంది.

ఇవి కూడా చదవండి

ఎవరు ప్రయోజనం పొందుతారు

ఈ పథకం ప్రయోజనం సాగు కోసం 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు, ఇతర రకాల ప్రభుత్వ పెన్షన్‌ల ప్రయోజనం పొందని రైతులు మాత్రమే ఈ పథకం ప్రయోజనాన్ని పొందుతారు. దీంతో పాటు వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేరు. దీనితో పాటు, కుటుంబంలో భార్య లేదా భర్త మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఇద్దరికి డబ్బులు వస్తున్నట్లయితే అనర్హులు.

డబ్బలు వచ్చాయా? లేదా ఇలా తనిఖీ చేయండి

☛ ముందుగా వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

☛ ఈ వెబ్‌సైట్‌కి కుడి వైపున ఉన్న ఫార్మర్స్ కార్నర్‌పై క్లిక్ చేయండి.

☛ ఇప్పుడు మీరు బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయాలి.

☛ మీ స్థితిని తనిఖీ చేయడానికి మీరు ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ వంటి అన్ని వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

☛ ప్రక్రియ పూర్తయిన తర్వాత జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి