Maruti Suzuki: మారుతీ సుజుకిని ఊరిస్తున్న ‘లక్షలాది పెళ్లిళ్లు‘.. విక్రయాలపై భారీ ఆశలు

అక్టోబర్ నెలలో రికార్డు స్థాయిలో రిటైల్ అమ్మకాలు జరిపిన మారుతి సుజుకి నవంబర్ నెలలో కూడా ఇదే జోరు కొనసాగుతుందని కంపెనీ ఆశాభావంతో ఉంది. మరీ ముఖ్యంగా నవంబర్ మాసంలో మ్యారేజ్ సీజన్ కారణంగా కార్ల విక్రయాలు జోరందుకుంటాయని ఆశిస్తోంది.

Maruti Suzuki: మారుతీ సుజుకిని ఊరిస్తున్న ‘లక్షలాది పెళ్లిళ్లు‘.. విక్రయాలపై భారీ ఆశలు
90589291
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 04, 2024 | 2:03 PM

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి అక్టోబర్‌లో నెలలో 2,02,402 యూనిట్ల రికార్డు రిటైల్ అమ్మకాలను సాధించింది. ఇక నవంబర్ నెలలో దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో వివాహాలు జరగనుండటంతో ఈ వృద్ధి మరింత పెరగడం ఖాయంగా ఆ కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. మ్యారేజ్ సీజన్ విక్రయాల జోరుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 4-5% వృద్ధిని ఆ సంస్థ అంచనా వేస్తోంది.

పండుగ సీజన్ డిమాండ్ కారణంగా ఇప్పటి వరకు అత్యధిక అమ్మకాలను అక్టోబర్ మాసంలో నమోదు చేసింది. అక్టోబర్ 2020లో నెలకొల్పిన 191,476 యూనిట్ల మునుపటి రికార్డును అధిగమించింది. ఇక గత ఏడాది ఇదే నెలలో ఆటో మేజర్ సంస్థ మొత్తం 1,99,217 యూనిట్లను విక్రయించినట్లు మారుతీ సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మాసం నుంచి అక్టోబర్ మాసం వరకు కార్ల విక్రయాల్లో 4 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. నవంబర్ మాసంలో లక్షలాది పెళ్లిళ్లు జరగనున్నాయి.. పెళ్లి సీజన్ కారణంగా తమ కార్ల విక్రయాలు కూడా భారీగా పెరిగే అవకాశమున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.

అక్టోబర్ నెలలో పండుగ విక్రయాల సందర్భంగా కొనసాగిన అమ్మకాల జోరను నవంబర్‌లో పెళ్లిళ్ల సీజన్ వెళ మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రణాళిక సిద్దంగా ఉందని.. కంపెనీ రిటైల్ అమ్మకాల పరంగా కూడా ఇది మాకు మంచి ట్రాక్షన్ ఇస్తుందని మేము చాలా ఆశాభావంతో ఉన్నామని మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ మరియు సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్తో బెనర్జీ పిటిఐకి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4-5 శాతం వృద్ధి అంచనాతో మారుతి సుజుకి ఇండియా ట్రాక్‌లో కొనసాగుతుందని నమ్మకంగా ఉంది.

దీపావళి ముగియడంతో ఇప్పుడు వ్యాపారులు, రీటైల్ సంస్థలు మ్యారేజ్ సీజన్‌ను సద్వినియోగం చేసుకోవడంపై దృష్టిసారించాయి. లక్షలాది పెళ్లిళ్లు జరగనుండటంతో  తమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయాలుగా సాగిపోతుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. మ్యారేజ్ సీజన్‌‌లో ఇతర కంపెనీల నుంచి పోటీ నెలకొనడంతో దీపావళి తర్వాత కూడా ప్రత్యేక ఆఫర్స్‌ను కొనసాగించే యోచనలో ఉన్నాయి కంపెనీలు.

సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
షారుక్ కోసం అభిమాని సాహసం..
షారుక్ కోసం అభిమాని సాహసం..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..