Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan: షారుక్ కోసం అభిమాని సాహసం.. 95 రోజులుగా కింగ్ ఖాన్ ఇంటి బయట..

తమ అభిమాన హీరోలను ఒక్కసారి చూడాలని, ఒక్కసారి కలవాలని చాలా మంది అభిమానులు రకరకాల సాహసాలు చేస్తుంటారు. ఒకరు తమ ఊరి నుంచి కాలినడకన హీరోని కలవడానికి వస్తుంటారు. కొంతమంది సైకిల్ పై.. మరికొందరు ఇంకోలా సాహసాలు చేస్తుంటారు.

Shah Rukh Khan: షారుక్ కోసం అభిమాని సాహసం.. 95 రోజులుగా కింగ్ ఖాన్ ఇంటి బయట..
Shah Rukh Khan
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 05, 2024 | 7:39 AM

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా అంతా బాలీవుడ్ కింగ్ ఖాన్ గురించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆయన 59వ పుట్టినరోజుకు సంబంధించిన కథనాలు తెగ వైరల్ అవుతున్నాయి. అలాంటి మరో ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తమ అభిమాన హీరోలను ఒక్కసారి చూడాలని, ఒక్కసారి కలవాలని చాలా మంది అభిమానులు రకరకాల సాహసాలు చేస్తుంటారు. ఒకరు తమ ఊరి నుంచి కాలినడకన హీరోని కలవడానికి వస్తుంటారు. కొంతమంది సైకిల్ పై.. మరికొందరు ఇంకోలా సాహసాలు చేస్తుంటారు. తాజాగా  షారుఖ్ ఖాన్‌ను కలవాలని ఆశతో 95 రోజుల పాటు స్టార్ ఇంటి బయట ఉన్నాడు. ఆ అభిమానికి ఎట్టకేలకు తన కల నెరవేరింది.

ఇది కూడా చదవండి : సూపరో సూపర్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగార్జున హీరోయిన్

జార్ఖండ్‌కి చెందిన ఓ అభిమానిని కింగ్‌ఖాన్‌ కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన స్వగ్రామంలో కంప్యూటర్ సెంటర్ నడుపుతున్న ఓ అభిమాని తన దుకాణాన్ని మూసివేసి షారుక్ ఖాన్‌ను కలిసేందుకు వచ్చాడు. అయితే దాదాపు మూడు నెలల పాటు ఎదురుచూసిన తర్వాత షారూఖ్‌ను అతను కలిసాడు.

ఇది కూడా చదవండి : Tollywood : అమ్మబాబోయ్..! రచ్చ రచ్చ చేస్తుందిగా..!! ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ హీరోయిన్ గుర్తుందా..?

జార్ఖండ్‌కి చెందిన అబిరా ధర్ తన అభిమానంతో షారుక్‌ని కూడా ఆశ్చర్యపరిచాడు. ముంబైలోని మన్నత్‌లోని షారుక్ నివాసం బయట అబిరా ధార్ వేచి ఉన్నాడు. కారులో నిద్రపోతున్నాడు. 95 రోజులుగా మన్నత్ దగ్గర ఉన్న ఈ అభిమాని గురించి జాతీయ మీడియా వార్తలు విడుదల చేసింది. ఎన్ని రోజులు పట్టినా షారుక్ ను చూసి తీరుతా అని అతను మీడియాకు తెలిపాడు. ఇన్ని రోజులుగా తన కంప్యూటర్ సెంటర్ మూతపడడం వల్ల ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లిందని, అయినా తన అభిమాన నటుడిని కలిసి తీరుతా అని అతను చెప్పాడు. ఈ నిర్ణయానికి తన భార్య, తల్లి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని మీడియాకు తెలిపాడు. ఎట్టకేలకు అతను షారుక్ ను కలిసాడు. మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ముంబైలోని ఆయన నివాసం బయట ఫ్యాన్స్ చేరుకోలేదు. షారుఖ్ ఎప్పటిలాగే అభిమానులను పలకరించడానికి మన్నత్ బాల్కనీకి కూడా రాలేదు. కాగా షారుఖ్ ఈ సంవత్సరం తన పుట్టినరోజును జరుపుకుని కొంతమంది అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ నిర్వహించాడు.

ఇది కూడా చదవండి : ఈ హీరోలను గుర్తుపట్టారా.? పెద్ద కష్టం కాదులెండి..! కానీ కనిపెట్టండి చూద్దాం.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.