AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అది కూడా మానసిక సమస్యలకు సంకేతమట.. మీకు, ఉందో లేదో తెలుసుకోవాలంటే ఇలా చేయండి..

కొంతమంది వారి భావాలను లేదా.. ఆలోచనలను పంచుకునేందుకు ఇబ్బంది పడుతుంటారు.. ఇతరులు ఏమనుకుంటారో.. తనను విమర్శిస్తారేమో.. చెప్పే ఆలోచనలు చెడుగా భావిస్తారేమో.. ఎదుటివారు స్వీకరిస్తారో లేదో..? ఇలా ఎన్నో విషయాలను గుర్తుచేసుకుంటూ.. తమ భావాలను వ్యక్తపర్చరు. మరికొందరు భయంతో అస్సలు మాట్లాడనే మాట్లాడరు.. అయితే.. ఇందంతా కూడా ఒక మానసిక సమస్య లాంటిదేనని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.

అది కూడా మానసిక సమస్యలకు సంకేతమట.. మీకు, ఉందో లేదో తెలుసుకోవాలంటే ఇలా చేయండి..
Mental Health
Shaik Madar Saheb
|

Updated on: Nov 05, 2024 | 7:04 AM

Share

మీరు లేదా మీకు దగ్గరగా ఉన్నవారు.. ఆలోచనలు, భావాలను సరిగ్గా వ్యక్తపరచలేకపోతే దాని వెనుక ఎటువంటి చెడు ఉద్దేశం లేదు. కానీ.. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన పరిస్థితి కూడా ఉండవచ్చని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. మాట్లాడటం అనేది మానవుల ప్రాథమిక అవసరాలలో ఒకటి.. బహిరంగంగా మాట్లాడటం, భావాలను వ్యక్తపరచకపోవడం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఒక వ్యక్తి దుఃఖానికి లేదా సంతోషానికి ఆశించిన విధంగా స్పందించనప్పుడు.. అతను నిరాశలో ఉన్నట్లు లేదా మానసికంగా సరైన స్థితిలో లేనట్లు చెప్పవచ్చు.. అయితే.. ఇక్కడ వ్యక్తుల పరిస్థితిని బట్టి కూడా మార్పులుంటాయి.. ఒక వ్యక్తికి ఎదుటి వ్యక్తి నచ్చకపోతే.. తన ఆలోచనలను పంచుకోడు.. పరిస్థితికి తగినట్లు వ్యవహరించడు.. అయతే, బహిరంగంగా మాట్లాడలేకపోవడం మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతం అని పరిశోధకలు పేర్కొంటున్నారు.

అయితే.. మనోరోగచికిత్స ప్రకారం.. ఈ కమ్యూనికేషన్ సమస్యలు ఒకే వ్యక్తితో మళ్లీ మళ్లీ సంభవిస్తే, కారణం వారి మంచి ఉద్దేశ్యాలు లేకపోవడమే కాదు. ఇది సాధ్యమయ్యే సామాజిక అభిజ్ఞా మార్పును సూచించవచ్చు. మాంట్రియల్‌లోని మెక్‌గిల్ విశ్వవిద్యాలయంలో ఇటీవల నిర్వహించిన పరిశోధనలో సామాజిక జ్ఞానానికి – వివిధ మానసిక ఆరోగ్య రుగ్మతలకు మధ్య సంబంధం ఉందని తేలింది.

సామాజిక – సాంఘీక జ్ఞానం అంటే ఏమిటి ..?

సామాజిక జ్ఞానం అంటే మనం ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకునే సామర్ధ్యం.. వారి ఉద్దేశాలు – నమ్మకాలను అంచనా వేయడం. ఒక్క మాటలో చెప్పాలంటే.. సామాజిక జ్ఞానం అనేది మనస్తత్వశాస్త్రంలో ఒక అంశం.. ఇది వ్యక్తులు – ఇతర వ్యక్తులు – సామాజిక పరిస్థితుల గురించి సమాచారాన్ని ఎలా చేరవేస్తారు.. పంచుకుంటారు.. పరిస్థితికి తగినట్లు ఎలా వ్యవహరిస్తారనేది నిర్వచిస్తుంది..

మానసిక ఆరోగ్యం సామర్థ్యాన్ని తగ్గించవచ్చు..

మానసిక ఆరోగ్య రుగ్మతల కారణంగా, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం – బహిరంగంగా కమ్యూనికేట్ చేసే సామర్థ్యం తగ్గిపోవచ్చు. డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్ – స్కిజోఫ్రెనియా వంటి అనేక మానసిక ఆరోగ్య రుగ్మతలలో ఈ లోపం కనిపిస్తుందని పరిశోధనలో తేలింది.

రోజువారీ జీవితంపై ప్రభావం..

ఇటీవలి అధ్యయనాలు బైపోలార్ డిజార్డర్ ఉన్నవారిలో సామాజిక జ్ఞానంలో లోపాలు రోజువారీ జీవితంలో వారి పనితీరును ప్రభావితం చేస్తాయని కూడా చూపించాయి. ఈ లోపం ఒక వ్యక్తి భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, ఇతరులతో సంబంధాలను ఏర్పరచుకోవడానికి, సామాజిక జీవితంలో పాల్గొనడానికి అడ్డంకులను కలిగిస్తుంది.

నివారణ చర్యలు

సామాజిక జ్ఞానాన్ని మెరుగుపరచడానికి అనేక చర్యలు అభివృద్ధి చేశారు. వీటిలో సామాజిక జ్ఞానం – జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంపై దృష్టి సారించే వివిధ వ్యాయామాలు ఉన్నాయి. ఉదాహరణకు, మరొక వ్యక్తి భావోద్వేగాలు ఏమిటో గుర్తించడానికి రోగులకు వ్యాయామాలు ఇవ్వవచ్చు. అదనంగా, సామాజిక జ్ఞానాన్ని కథల ద్వారా అభివృద్ధి చేయవచ్చు, ఇక్కడ పాత్రల ఉద్దేశాలు క్రమంగా బహిర్గతమవుతాయి.

సాంకేతిక కార్యక్రమాలు

COVID-19 మహమ్మారి సమయంలో, పరిశోధకులు డిజిటల్ సాధనాలను ఉపయోగించి మానసిక ఆరోగ్య రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తుల కోసం ఆన్‌లైన్ గ్రూప్ సెషన్‌లను నిర్వహించారు.

ముఖ్యమైన విషయం ఏమిటంటే..

ఒక వ్యక్తి మానసిక ఆరోగ్య రుగ్మతతో బాధపడుతున్నప్పుడు, అతను లేదా ఆమె ఉద్దేశపూర్వకంగా హాని చేయలేదని కుటుంబ సభ్యులు – స్నేహితులు తెలుసుకోవడం ముఖ్యం. వారితో కమ్యూనికేషన్ మెరుగుపరచడానికి ప్రత్యేక కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి.. ఇది కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు సంబంధాలను కొనసాగించడంలో సహాయపడుతుంది.

వాస్తవానికి ఏదైనా మానసిక రుగ్మత లక్షణాలను గుర్తించినా.. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఉన్నా.. సైకియాట్రిస్ట్‌ను సంప్రదించడం మంచిది.. అయితే.. వారిని రోగులుగా చూడాల్సిన పనిలేదు.. చికిత్సతో మునుపటి వ్యక్తుల్లా మారిపోతారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..