Tirupati: హమ్మయ్య.. శ్రీవారి భక్తులకు రిలీఫ్.. బిగ్ ప్లాన్ సిద్ధం చేసిన టీటీడీ

తిరుమల శ్రీవారిని రోజు దర్శించుకునే భక్తుల సంఖ్య 80 నుంచి 85 వేలకు మించడంతో శ్రీవారి దర్శనం కష్టంగా మారింది. సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు పలు సేవలు విఐపి బ్రేక్ దర్శనాలు, సర్వదర్శనాలు కలిపి శ్రీవారిని భక్తులు దర్శించుకునేందుకు టిటిడి ఎంతో ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కోసం గంటలు గంటలు ఎదురు చూడాల్సిన పరిస్థితి కొనసాగుతోంది.

Tirupati: హమ్మయ్య.. శ్రీవారి భక్తులకు రిలీఫ్.. బిగ్ ప్లాన్ సిద్ధం చేసిన టీటీడీ
Tirumala Rush
Follow us
Raju M P R

| Edited By: Surya Kala

Updated on: Nov 05, 2024 | 8:54 AM

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం క్షణం పాటు కలిగితే చాలన్నది కోట్లాది మంది భక్తుల ఆశ. ఇందులో భాగంగానే దేశంలోని నలు మూలలా ఉన్న శ్రీవారి భక్తులు తిరుమలకు వస్తారు. సంపన్నుడి నుంచి సామాన్యుడి దాకా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య నిత్యం లక్షల్లో ఉంటుంది. ఈ నేపధ్యంలో క్యూలైన్ మేనేజ్మెంట్ విషయంలో కొత్త కొత్త ఆలోచనలు చేస్తోంది టీటీడీ. ఎక్కువ మంది సామాన్య భక్తులకు వెంకన్న దర్శనం కల్పించాలని తపిస్తోంది. ఇందులో భాగంగానే రెండు రోజుల్లో 1,72,565 మందికి శ్రీవారి దర్శనం కల్పించినట్లు టిటిడి పేర్కొంది.

శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేసే ప్రయత్నం చేసినట్లు కొత్త విధానాన్ని తెరమీదికి తెచ్చింది. వారాంతపు రోజుల్లో శని, ఆదివారాల్లో అత్యధిక మంది భక్తులకు శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ చర్యలు చేపట్టినట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో గత శని, ఆదివారాల్లో 1,72,565 మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించగా శనివారం 88,076 మంది, ఆదివారం 84,489 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పించింది. ఇందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.

నారాయణగిరి షెడ్ల వద్ద ఏర్పాటు చేసిన సర్వీస్ లైన్ ను భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. సర్వీస్ లైన్ ద్వారా క్యూలైన్ లో వేచి ఉండే సమయం తగ్గించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాక భక్తులను ఆలయం బయట కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్ లో నడవాల్సిన పని లేకుండా సర్వీస్ లైన్ ను వినియోగించింది.

ఇవి కూడా చదవండి

వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఔటర్ క్యూలైన్లు, నారాయణగిరి షెడ్ల ను నిరంతరం పర్యవేక్షించిన టీటీడీ సిబ్బంది. శ్రీవారి సేవకుల సహకారంతో భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. క్యూలైన్లలోని భక్తులకు అల్పాహారం, పాలు, తాగు నీటిని 24 గంటలు పంపిణీ చేసిన టీటీడీ  భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు అన్నీ ఏర్పాట్లు చేసింది. దీంతో సర్వీస్ లైన్ సామాన్య భక్తుడికి నడక సమయాన్ని సేవ్ చేసింది. ఎక్కువ సమయం క్యూలైన్ లో ఉండకుండా శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కలిగింది.

గతంలోనూ వారాంతపు రోజులు, పర్వదినాల్లోనూ 90 వేలకు పైగా భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.  తిరుమలలో రద్దీ ఉండే రోజులు, వారాంతపు సెలవు దినాలు, పర్వదినాల్లో టీటీడీ ఎక్కువమంది భక్తులకు గతంలోనూ దర్శన అవకాశం కల్పించింది. సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు పలు సేవలు, విఐపి సిఫారసు లేఖలు, శ్రీవాణి టికెట్స్, ప్రత్యేక ప్రవేశ దర్శనం టైం స్లాటెడ్ టోకెన్లు, సర్వదర్శనం టోకెన్లతో భక్తులు శ్రీవారిని దర్శించుకునే భక్తులు రోజుకు 90 వేల దాకా కూడా దర్శించుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందుకు టిటిడి క్యూలైన్ మేనేజ్మెంట్ చేసింది.

ఇప్పుడు సర్వీస్ లైన్ సహకారంతో రెండు రోజులకు లక్ష 70 వేల మంది భక్తులకు దర్శనం కల్పించిన టీటీడీ రెండు రోజులకు దాదాపు 1.80 లక్షల మందికి పైగానే భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించింది. వారాంతపు రోజుల్లో ప్రోటోకాల్ మినహా సిఫారసు లేఖలను అనుమతించక పోవడం, శ్రీవాణి ట్రస్ట్ కింద టికెట్ల జారీని పరిమితం చేయడం లాంటి నిర్ణయాల ద్వారా సామాన్య భక్తులకు అదనంగా గంటన్నర నుంచి రెండు గంటల పాటు అదనపు సమయం లభించడం తో ఎక్కువమంది దర్శనం చేసుకునే అవకాశం ఏర్పడింది.

ఇందులో భాగంగానే గంటకు నాలుగున్నర వేల నుంచి 5వేల మంది భక్తులు శ్రీవారిని సర్వదర్శనం చేసుకునే అవకాశం దక్కుతోంది. గత శని, ఆదివారాలు రెండు రోజులు టీటీడీ సర్వీసు లైన్ లో భక్తుల్ని అనుమతించడం ద్వారా నడక సమయం భక్తులకు కలిసి రాగా అదనంగా దాదాపు 5 నుంచి 10 వేల మంది వరకు భక్తులకు శ్రీవారిని సర్వ దర్శనం చేసుకునే అవకాశం కలిగింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..