US Elections 2024: అమెరికాలో ఎన్నికలు.. భారత్‌లో హడావిడి.. ట్రంప్ , కమలాహారీస్ గెలుపు కోసం పోటాపోటీగా పూజలు

  అమెరికాలో ఎన్నికలు జరుగుతుంటే..భారత్‌లో హడావుడి నెలకొంది. మరికొన్ని గంటల్లో అగ్రరాజ్యాధినేత ఎవరనేది తెలియనుంది. ఈ నేపథ్యంలో భారత్ లో ఓ వైపు ట్రంప్‌ గెలుపు కోసం ప్రత్యేక పూజలు చేస్తుంటే . . మరోవైపు కమలా హారీస్ విజయం కోసం ప్రత్యేక పూజలను చేస్తున్నారు .    

US Elections 2024: అమెరికాలో ఎన్నికలు.. భారత్‌లో హడావిడి.. ట్రంప్ , కమలాహారీస్ గెలుపు కోసం పోటాపోటీగా పూజలు
Us Elections 2024
Follow us

|

Updated on: Nov 05, 2024 | 6:30 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌, కమలాహారిస్‌ల మధ్య నువ్వా ? నేనా అన్న రీతిలో పోటీ ఉంది. ఇద్దరి గెలుపు కోసం భారత్‌లో ఇద్దరి అభిమానులు పోటాపోటీగా పూజలు , యాగాలు చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమవుతుంది. ఎక్కడో అమెరికాలో ఎన్నికలు జరుగుతుంటే భారత్‌లో హడావుడి ఎక్కువయ్యింది. ట్రంప్‌ గెలవాలని ఆయన అభిమానులు , కమలా హారీస్‌ గెలవాలని ఆమె అభిమానులు పోటాపోటీగా పూజలు , యాగాలు చేస్తున్నారు. ఢిల్లీలో మహా మండలేశ్వర స్వామి వేదమూర్తీనంద సరస్వతి ఆధ్వర్యంలో ట్రంప్‌ గెలుపు కోసం ప్రత్యేక పూజలు చేశారు. యాగం కూడా నిర్వహించారు.

డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కు ఆప్తుడు

డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కు ఆప్తుడని , హిందువులకు ఆయనతో ఎంతో మేలు జరుగుతుందని మహా మండలేశ్వర స్వామి చెబుతున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడిని ట్రంప్‌ ఖండించడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రపంచమంతా ఆర్ధికాభివృద్ది వేగంగా జరిగిందని , ఇప్పుడు యుద్దాలతో తల్లడిల్లుతోందన్నాడు.

మహా మండలేశ్వర స్వామి

డొనాల్డ్‌ ట్రంప్‌ కోసం మేము యజ్ఞం చేస్తున్నాం.. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడి జరిగితే ప్రపంచదేశాలు ఖండించలేదు.. ఒక ట్రంప్‌ మాత్రమే దాడులను ఖండించారు. అంతేకాకుండా హిందువులకు పూర్తి రక్షణ కల్పిస్తామని చెప్పారు. బంగ్లాదేశ్‌పై కఠినచర్యలు తీసుకుంటామని అన్నారు. ట్రంప్‌ 2016లో అమెరికా అధ్యక్షుడైనప్పుడు 2021 వరకు ప్రపంచమంతా ఆర్ధికాభివృద్ధి జరిగింది. ప్రపంచమంతా శాంతి నెలకొంది. ట్రంప్‌ గద్దె దిగగానే ప్రపంచమంతా యుద్దాలతో తల్లడిల్లిపోతోంది.

ఇవి కూడా చదవండి

కమల హారీస్‌ తీరును తప్పుపట్టారు మహా మండలేశ్వర స్వామి. హిందువులపై దాడులను ఆమె ఒక్కసారి కూడా ఖండించలేదన్నారు. అందుకే ట్రంప్‌కు మద్దతిస్తునట్టు తెలిపారు.

కమలా హారీస్‌ పూర్వీకుల గ్రామంలో ..

మరోవైపు తమిళనాడు లోని కమలా హారీస్‌ పూర్వీకుల గ్రామంలో కూడా ఆలయాల్లో ఆమె మద్దతుదారులు ప్రత్యేక పూజలు చేశారు. తులసిందపురం ఆలయంలో కమలహారీస్‌ గెలవాలని పూజలు నిర్వహించారు. కమలా హారీస్‌ పూర్వీకులు తులసిందపురంకు చెందినవాళ్లే.. ఈ ఊరుతో ఆమెకు ఎంతో అనుబంధం ఉంది. కమలా హారీస్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలని ఊరంతా కోరుకుంటోంది. ఆమె రెండుసార్లు ఇక్కడికి వచ్చారు. గ్రామం లోని చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఆమె విజయాన్ని కాంక్షిస్తున్నారు.

తమిళనాడు లోని తులసిందపురంలో మాత్రమే కాదు మధురై లాంటి నగరాల్లో కూడా కమలా హారీస్‌ విజయం కోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కమలా హారీస్‌ ఫోటోలు , బ్యానర్లను పెట్టి ఈ పూజలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .