PM Modi: కెనడాలో హిందూ దేవాలయంపై దాడి.. ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
కెనడాలో ఖలిస్తాన్ వాదులు ఆలయంపై దాడి చేసిన ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.. ఈ ఘటనపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. హిందూ దేవాలయంపై జరిగిన దాడిని ఖండించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఇటువంటి హింసాత్మక చర్యలు భారతదేశ నిర్ణయాన్ని ఎప్పటికీ బలహీనపరచవంటూ స్ట్రాంగ్ మెస్సెజ్ ఇచ్చారు.
కెనడాలో ఖలిస్తాన్ వాదుల అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంపై దాడి చేశారు.. దాడి చేసిన వారి చేతుల్లో ఖలిస్థాన్ జెండాలు సైతం ఉన్నాయి. ఆలయంలో ఉన్న వారిపై కర్రలతో దాడి చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ఈ ఘటనను ఖండించారు. అయితే ఈ ఘటనపై కెనడాలోని భారత హైకమిషన్ వివరణ ఇచ్చింది. టొరంటో సమీపంలోని బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిర్‌తో కలిసి ఏర్పాటు చేసిన కాన్సులేట్ క్యాంప్ బయట ఈ దాడి జరిగింది. ఈవెంట్‌ల కోసం రక్షణ కల్పించాలని భారత ఎంబసీ అభ్యర్ధించింది. ఇది సాధారణ కాన్సులర్ ఫంక్షన్ అని, ఖలిస్తాన్ వేర్పాటువాదులు దాడి చేయడం దారుణమని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కెనడాలోని హిందూ దేవాలయంపై జరిగిన దాడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి హింసాత్మక చర్యలు భారతదేశ నిర్ణయాన్ని ఎప్పటికీ బలహీనపరచవు. కెనడియన్ ప్రభుత్వం న్యాయాన్ని నిర్ధారిస్తుంది.. చట్ట నియమాన్ని సమర్థిస్తుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
‘‘కెనడాలోని హిందూ దేవాలయంపై ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మన దౌత్యవేత్తలను బెదిరించేందుకు పిరికిపంద ప్రయత్నాలు.. ఇటువంటి హింసాత్మక చర్యలు భారతదేశ నిర్ణయాన్ని ఎప్పటికీ బలహీనపరచవు. కెనడియన్ ప్రభుత్వం న్యాయాన్ని నిర్ధారిస్తుంది .. చట్ట నియమాన్ని సమర్థిస్తుందని మేము ఆశిస్తున్నాము.’’ – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ప్రధాని మోదీ ట్వీట్..
I strongly condemn the deliberate attack on a Hindu temple in Canada. Equally appalling are the cowardly attempts to intimidate our diplomats. Such acts of violence will never weaken India’s resolve. We expect the Canadian government to ensure justice and uphold the rule of law.
— Narendra Modi (@narendramodi) November 4, 2024
కెనడా సంబంధిత వివాదం ప్రారంభమైన తర్వాత ప్రధాని చేసిన మొదటి ప్రకటన ఇదే.. తన వ్యాఖ్యలతో కెనడాకు బలమైన సందేశం పంపారు.. అంతేకాకుండా, ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు అండగా నిలుస్తున్నామన్న విషయాన్ని కూడా.. ప్రజల్లోకి పంపినట్లయింది..
కెనడాలో ఖలిస్తాన్ వాదులు ఆలయంపై దాడి చేసిన ఘటనపై హిందూ సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని ట్రుడో ప్రోద్భలం తోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించాయి. ఈ ఘటనపై ఆందోళన చేపట్టిన హిందూ సంఘాలపై కెనడా పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ఆందోళనకారులను వెనక్కి తోసేశారు కెనడా పోలీసులు. దాడి చేసిన ఖలిస్తాన్ వేర్పాటువాదుల మీద చర్యలు తీసుకోకుండా, బాధితుల పైనే కెనడా పోలీసులు దౌర్జన్యం చేయడంతో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..