Maruti Suzuki: కొత్త విజన్ ప్రకటించిన మారుతి సుజుకీ.. ఆ సంవత్సరం నాటికి మార్కెట్లో కొత్త ఈవీ కార్లు
కంపెనీ 40 లక్షల కార్లను తయారు చేయడమే కాకుండా వాటిని విక్రయించాల్సి ఉన్నందున మారుతీ సుజుకీకి ఇది పెద్ద సవాలుగా మారనుంది. గుజరాత్ ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ కార్ల తయారీ పనులు కొనసాగుతున్నాయి. 2024-25 నాటికి తొలి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. 2031 నాటికి, కంపెనీ 6 ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెడుతుంది. ఇది ఆ సమయంలో మొత్తం అమ్మకాలలో 15-20 శాతం వాటాను కలిగి ఉంటుంది..
ప్రస్తుతం ఈవీ వాహనాల హవా కొనసాగుతోంది. టెక్నాలజీ డెవలప్ కావడంతో రకరకాల వాహనాలు భారత మార్కెట్ రంగంలోకి వస్తున్నాయి. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వాహనాల తయారీ కంపెనీలు సైతం అడుగులు ముందుకు వేస్తున్నాయి. ఇందుకు తగినట్లుగానే మానవుడు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాడు. ఇక భారతదేశపు అతిపెద్ద కార్ కంపెనీ మారుతీ సుజుకి.. తన కొత్త విజన్ మారుతి సుజుకి 3.0 విజన్‌ని ప్రకటించింది. 2031 ఆర్థిక సంవత్సరం నాటికి 1.5 మిలియన్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ వ్యాపార ప్రణాళిక ముగిసే సమయానికి మారుతి 28 వాహనాలను కలిగి ఉండాలని భావిస్తోంది. ఈ వాహనాల్లో అర డజను అంటే 6 ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి. 2031 నాటికి ఏటా 40 లక్షల వాహనాల ఉత్పత్తిని సాధించాలని కార్ల కంపెనీ మరో ప్రణాళికను కలిగి ఉంది.
ఇందులో దాదాపు 15 శాతం అంటే ఆరు లక్షలకుపైగా వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా ఉంటాయని తెలుస్తోంది. ఇది కాకుండా దాదాపు 10 లక్షల వాహనాలు హైబ్రిడ్‌గా ఉంటాయి. ప్రస్తుతం కంపెనీ సామర్థ్యం ఏటా 22.5 లక్షల వాహనాలను తయారు చేయాలని భావిస్తోంది. మారుతీ సుజుకీ లక్ష్యాన్ని సాధిస్తే ఉత్పత్తి 75 శాతం పెరుగుతుంది. 2031 సంవత్సరం నాటికి వాహణాల ఎగుమతులను 3 రెట్లు అంటే 75 లక్షల యూనిట్లకు పెంచాలని కంపెనీ భావిస్తోంది.
ఎలక్ట్రిక్-హైబ్రిడ్ కారుపై దృష్టి
ఉత్పత్తి ప్రణాళికలోని 40 లక్షల యూనిట్లలో 32 లక్షల యూనిట్లు దేశీయ మార్కెట్‌కు సంబంధించినవి. వీటిలో 40 శాతం వరకు అంటే 12 లక్షల యూనిట్లు హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు కావాలని కంపెనీ కోరుకుంటోంది. మారుతీ సుజుకీ మొదటి దశ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్‌గా ఉందని చైర్మన్ ఆర్‌సి భార్గవ తెలిపారు. రెండవ దశ కరోనా వైరస్ మహమ్మారితో ముగిసింది.
మారుతీ సుజుకీ ప్రయాణం:
సుజుకి మోటార్ కంపెనీ 2 మిలియన్ యూనిట్ల సామర్థ్యాన్ని సాధించడానికి 40 ఏళ్లు పట్టిందని భార్గవ చెప్పారు. గుజరాత్‌లోని ప్లాంట్‌తో కంపెనీ ఈ మైలురాయిని సాధించింది. ఏటా 40 లక్షల ఉత్పత్తిని చేరుకోవాలంటే కంపెనీని పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కంపెనీ త్వరలో తన ప్రతిపాదనను వాటాదారులకు ప్రకటించవచ్చు.
మారుతీ సుజుకీకి పెద్ద సవాల్
కంపెనీ 40 లక్షల కార్లను తయారు చేయడమే కాకుండా వాటిని విక్రయించాల్సి ఉన్నందున మారుతీ సుజుకీకి ఇది పెద్ద సవాలుగా మారనుంది. గుజరాత్ ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ కార్ల తయారీ పనులు కొనసాగుతున్నాయి. 2024-25 సంవత్సరం నాటికి తొలి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. 2031 నాటికి, కంపెనీ 6 ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెడుతుంది. ఇది ఆ సమయంలో మొత్తం అమ్మకాలలో 15 శాతం నుంచి 20 శాతం వాటాను కలిగి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి