Marry Now, Pay Later: పెళ్లి మీది.. ఖర్చు మాది.. ఈఎంఐ ఆప్షన్ పై రూ. 25లక్షల వరకూ లోన్..

పెళ్లికి అవసరమైన డబ్బులు గురించి మీరు చింత పడాల్సిన అవసరం లేదు. ఎంత ఖర్చైనా వారే పెట్టుకొంటారు. ఆ తర్వాత మీరు దానిని ఈఎంఐల పద్ధతిలో చెల్లించవచ్చు.

Marry Now, Pay Later: పెళ్లి మీది.. ఖర్చు మాది.. ఈఎంఐ ఆప్షన్ పై రూ. 25లక్షల వరకూ లోన్..
Marry Now Pay Later
Follow us
Madhu

|

Updated on: Mar 15, 2023 | 2:53 PM

పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అంటుంటారు పెద్దలు. నిజమే ఈ రెండూ ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధాన ఘట్టాలు. ఆ రెండూ ఖర్చుతో కూడుకున్నవి. ముఖ్యంగా జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే వేడుక కనుక ఎంత ఖర్చు చేయడానికి అయినా వెనకాడరు కొందరు. పెళ్లి ఎంత సింపుల్‌గా చేసుకుందాం అనుకున్నా.. 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కాస్త గ్రాండ్‌గా అంటే 10, 15 లక్షలు ఆ మొత్తం పెరుగుతూనే ఉంటుంది. ఎంత వెచ్చించినా ఇంకా కావాలనే అడుగుతాయి. అయితే ఎవరి తాహతను బట్టి వారు ఖర్చులు పెడుతుంటారు. నా పెళ్లి ఇలా చేసుకోవాలి.. అలా చేసుకోవాలి.. ఆకాశమంత పందిరి వేయాలి.. అని చాలా మంది కలలు కంటారు. అయితే అవి కొంత మంది మాత్రమే నిజం చేసుకోగలుగుతారు. కొందరి ఆర్థిక పరిస్థితులు దీనికి సహకరించవు. అలాంటి వారి కోసమే ఇప్పుడు మార్కెట్లో ఓ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. పెళ్లికి అవసరమైన డబ్బులు గురించి మీరు చింత పడాల్సిన అవసరం లేదు. ఎంత ఖర్చైనా వారే పెట్టుకొంటారు. ఆ తర్వాత మీరు దానిని ఈఎంఐల పద్ధతిలో చెల్లించవచ్చన్నమాట. స్కీమ్ బాగుంది కదా! ఇంతకీ ఎక్కడా ఆ స్కీమ్? ఎవరు నిర్వహిస్తారు? ఎక్కడ నిర్వహిస్తారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

మ్యారీ నౌ.. పే లేటర్..

మార్కెట్లో ‘బై నౌ, పే లేటర్’ స్కీమ్ గురించి మీరు వినే ఉంటారు. అంటే మనకు అవసరమైన వస్తువును కొనుగోలు చేసుకొని..దానికయ్యే ఖర్చు మొత్తాన్ని ఈఎంఐలుగా తిరిగి చెల్లించడం. దీనికి గురించి అందరికీ అవగాహన ఉంటుంది. ఇదే క్రమంలో ఇంటి రెంట్ కట్టడానికి ఇటువంటి ఆప్షన్లు వచ్చాయి. ‘రెంట్ నౌ, పే లేటర్’ పేరుతో దీనిని నిర్వహిస్తుంటారు. అయితే ఇదే విధానంలో పెళ్లి చేసుకొనే వెసులు బాటును కల్పిస్తున్నారు. ‘మ్యారీ నౌ, పే లేటర్ ’ (ఎంఎన్పీఎల్) పేరుతో దీనిని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఇది మార్కెట్ సెన్సేషన్ గా మారింది.

రోజుకు 50కి పైగా కాల్స్..

ట్రావెల్ ఫిన్ టెక్ సంస్థ సంకాష్, రాడిసన్ హోటళ్ల భాగస్వామ్యంతో మ్యారీ నౌ పే లేటర్ స్కీమ్ ని ప్రారంభించింది. ప్రస్తుతానికి ఈ ఆఫర్ రాజస్థాన్, మధ్యప్రదేశ్ లతో అందుబాటులో ఉంది. ఉత్తరప్రదేశ్, ఆగ్రాలోని ప్రముఖ ప్రదేశాలతో పాటు జైపూర్, చండీగఢ్, పూణేలోని హోటళ్లలోనే త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే దశల వారీగా దేశ వ్యాప్తంగా కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని సంకాష్ సహ వ్యవస్థాపకుడు సీఈఓ ఆకాష్ దహియా చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి రాడిసన్ హోటళ్లలో ఈ ఆఫర్ అందుబాటులోకి రానుందని వివరించారు. ప్రస్తుతం ఈ స్కీం అందుబాటులో ఉన్న హోటళ్లలో సగటున రోజుకు 50 పైగా కాల్స్, ఎంక్వయిరీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఆఫర్‌ వివరాలు ఏంటి..

  • మ్యారీ నౌ పే లేటర్‌ ఆఫర్‌ కింద గరిష్టంగా 25 లక్షల రూపాయల వరకు లోన్‌ పొందవచ్చు. ఆరు, 12 నెలల్లోపు ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
  • ఎంచుకున్న కాల వ్యవధి అనగా 6 నెలలు అయితే వడ్డీ లేకుండా.. 12 నెలలు అయితే 1 శాతం వడ్డీతో సంకాష్‌ ఎన్‌బీఎఫ్‌సీలకు ఈఎంఐ చెల్లించాలి.
  • కస్టమర్ల ఐడీ, అడ్రెస్‌ ప్రూఫ్‌, బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌, పేస్లిప్స్‌, ఐటీఆర్‌ తదితర అంశాలను పరిశీలించిన తర్వాత మీకు ఎంత లోన్‌ ఇవ్వాలి అన్నది అంచనా వేస్తారు.
  • అన్ని డాక్యుమెంట్స్‌ సరిగా ఉంటే లోన్‌ మంజూరు చేస్తారు.
  • తమ వివాహం కారణంగా కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాకూడదని భావించే వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..