Health Insurance: ఆరోగ్య బీమా క్లెయిమ్ చేయాలా? ఎన్ని రకాల క్లెయిమ్స్ ఉంటయో? తెలుసుకోండి
న్ని ప్రైవేట్ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు ఆయా కంపెనీలే ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లిస్తూ బీమా కల్పిస్తాయి. అయితే కొంత మంది వ్యక్తిగతంగానే బీమాను తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు వివిధ ఆఫర్ల గురించి చెప్పే కంపెనీ ప్రతినిధులు క్లెయిమ్ సమయంలో మాత్రం ఇబ్బంది పెడతారని చాలా మంది నమ్మకం.

సాధారణంగా భారతదేశంలో ఆరోగ్య బీమా గురించి చాలా మంది పట్టించుకోరు. మధ్య తరగతి ప్రజలైన ఆరోగ్య బీమా అంటే ఓ ఖర్చుగానే చూస్తారు. ఆరోగ్య బీమా కంటే పొదుపు పాలసీలు తీసుకుంటూ ఉంటారు. అయితే మార్కెట్ నిపుణులు మాత్రం ప్రతి ఒక్కరికీ కచ్చితంగా ఆరోగ్య బీమా ఉండాలని సూచిస్తుంటారు. అలాగే కొన్ని ప్రైవేట్ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు ఆయా కంపెనీలే ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లిస్తూ బీమా కల్పిస్తాయి. అయితే కొంత మంది వ్యక్తిగతంగానే బీమాను తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు వివిధ ఆఫర్ల గురించి చెప్పే కంపెనీ ప్రతినిధులు క్లెయిమ్ సమయంలో మాత్రం ఇబ్బంది పెడతారని చాలా మంది నమ్మకం. ఈ వాదనలో కొంతమేర నిజం ఉన్నా ఆరోగ్య బీమా తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని నిపుణుల సూచన. ఎందుకంటే క్లెయిమ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుగానే ఓ అవగాహనతో ఉండడం ఉత్తమం. అసలు ఆరోగ్య బీమా క్లెయిమ్స్ ఎన్ని రకాలు ఉంటాయో? ఓ సారి తెలుసుకుందాం.
నగదు రహిత క్లెయిమ్
ఇది ఒక రకమైన ఆరోగ్య బీమా క్లెయిమ్. దీనిలో బీమా కంపెనీ నేరుగా ఆసుపత్రితో క్లెయిమ్‌ను పరిష్కరిస్తుంది. అందువల్ల పాలసీదారులు తమ జేబులోంచి మెడికల్ బిల్లుల కోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. నగదు రహిత క్లెయిమ్ ప్రణాళికాబద్ధమైన హాస్పిటలైజేషన్, ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్ రెండింటికీ పొందవచ్చు. అయితే నెట్‌వర్క్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటేనే ఇటువంటి క్లెయిమ్‌లు పొందవచ్చని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. క్లెయిమ్ సెటిల్‌మెంట్ సమయంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అని పిలువబడే ఆసుపత్రుల సమూహంతో టై-అప్‌లను కలిగి ఉంటుంది. ఈ ఆసుపత్రులు సాధారణంగా సంబంధిత ఆరోగ్య బీమా కంపెనీల అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు అవుతాయి. ప్రజలు అటువంటి సమాచారాన్ని మధ్యవర్తులు, ఆరోగ్య బీమా ఏజెంట్ల నుండి కూడా పొందవచ్చు. పాలసీదారు సాధారణంగా నలభై-ఎనిమిది నుంచి డెబ్బై-రెండు గంటల లోపు బీమా సంస్థకు తెలియజేయవచ్చు. అయితే, అత్యవసర ఆసుపత్రిలో చేరిన సందర్భంలో బీమా సంస్థకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆసుపత్రిలో చేరిన 24 గంటలలోపు బీమా సంస్థకు తెలియజేయడం మాత్రం తప్పనిసరి. అలాగే ప్రీ, పోస్ట్ హాస్పటలైజేషన్ నిబంధనలను బీమా తీసుకునే సమయంలో క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్
కొన్ని పరిస్థితులు లేదా అవగాహన లేమి కారణంగా ప్రజలు నెట్‌వర్క్ కాని ఆసుపత్రులలో చికిత్సలు చేయించుకోవాల్సిన సందర్భాలు ఉండవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకు టై-అప్‌లు లేని ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటే రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే పాలసీదారు ఆస్పత్రికి ముందుగానే కట్టిన డబ్బును ఇన్సూరెన్స్ కంపెనీకి బిల్లుల రూపంలో సమర్పించారు. అలాగే నిబంధనల ప్రకారం కొన్ని రకాల డాక్యుమెంట్లను కూడా సమర్పించాలి. బీమా కంపెనీ మన డాక్యుమెంట్లన్నీ సరిగ్గా ఉంటే మనం ఆస్పత్రి బిల్లును తిరిగి మనకు చెల్లిస్తుంది. అయితే ఇది ప్రాసెస్ చేయడానికి చాలా సమయం పడుతుందని గుర్తుంచుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..