Mahindra Scorpio : మహింద్రా స్కార్పియో కొత్త అప్‌డేట్! ఈసారి డిజైన్ ఎలా ఉంటుందంటే..
రీసెంట్‌గానే మహింద్రా థార్‌లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రిలీజ్అయింది. అయితే ఇప్పుడు మహింద్రా తన ప్రీమియం SUV అయిన స్కార్పియోని అప్‌డేట్ చేయబోతోంది. ఈ కొత్త వెర్షన్‌లో ఇంటీరియర్ తో పాటు ఎక్స్‌టీరియర్ లుక్స్ కూడా మారబోతున్నాయి. ఈ కొత్త స్కార్పియో 2026లో రిలీజ్ అవుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వచ్చే ఏడాదిలో మహింద్రా కంపెనీ తమ పాపులర్ స్కార్పియో SUVని రీడిజైన్ చేయబోతోంది. స్కార్పియో ఎన్ మోడల్ లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ త్వరలోనే రిలీజ్ అవ్వబోతోంది. దానికి సంబంధించిన టెస్టింగ్ ఆల్రెడీ జరుగుతోంది. కొత్త స్కార్పియోలో డిజైన్‌తోపాటు ఇంటీరియర్ కూడా పూర్తిగా మారబోతున్నట్టు సమాచారం. ఇంకా ఇందులో ఏయే అప్ డేట్స్ ఉండొచ్చంటే..
డిజైన్ మార్పులు
మహింద్రా రిలీజ్ చేసిన టీజర్ పోస్టర్స్‌ను బట్టి చూస్తే.. కొత్త స్కార్పియో ఎన్ డిజైన్ పూర్తిగా అప్ డేట్ అవ్వనున్నట్టు తెలుస్తుంది. ముందు భాగంలో కొన్ని కాస్మెటిక్ మార్పులు కనిపించవచ్చు. అలాగే సిరకొత్త గ్రిల్, బంపర్లు, షార్ప్ LED హెడ్‌ల్యాంప్, సిగ్నేచర్ DRLలు ఉండవచ్చు. ఇకపోతే బండి సైడ్ ప్రొఫైల్ చాలావరకు పాత మోడల్ తరహాలోనే ఉంటుంది. కొత్త మోడల్ లో సరికొత్త అల్లాయ్ వీల్స్ ఉండొచ్చు. ఇక వీటితో పాటు కొత్త మోడల్ లో కొత్త కలర్ ఆప్షన్స్ జోడించే అవకాశం ఉంది.
ఫీచర్లు
కొత్త స్కార్పియోలో ఇంటీరియర్ ఫీచర్లు పూర్తిగా అప్‌డేట్ అవ్వనున్నాయి. క్యాబిన్ లో పెద్ద టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఇందులో ఉండే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్/యాపిల్ కనెక్టివిటీతో ఇంటిగ్రేట్ చేయబడుతుంది. అలాగే మెరుగైన యూజర్ ఇంటర్‌ఫేస్ ఉండబోతోంది. వీటితోపాటు కొత్త స్కార్పియో టాప్ వేరియంట్‌లలో పనోరమిక్ సన్‌రూఫ్ ఉండే అవకాశం ఉంది. అదనంగా మరికొన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉండొచ్చు.
ఇంజిన్ డీటెయిల్స్
ఇకపోతే కొత్త స్కార్పియోలో ఇంజిన్ పరంగా పెద్దగా మార్పులు ఉండవు. కొత్త స్కార్పియో ఎన్ లో.. ప్రస్తుత మోడల్ మాదిరిగానే 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఈ ఇంజన్లను మరింత రిఫైన్ చేసి మైలేజ్ కెపాసిటీని పెంచొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




