Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఒక్కొ సిలిండర్‌పై రూ.500 సబ్సిడీ.. కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్..
గ్యాస్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. గ్యాస్ సిలిండర్లపై ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా ఇస్తున్న సబ్సిడీల గురించి వివరించింది. ఒక్కొ సిలిండర్‌పై పరోక్షంగా రూ.500కిపైగా పరోక్ష సబ్సిడీ అందిస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన లబ్దిదారులకు మరింత సబ్సిడీ అందిస్తున్నామంది.

ఇటీవల గ్యాస్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం వల్ల ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు అంతరాయం కలగడంతో ధరలు పెరిగాయి. గ్యాస్ డెలివరీ పొందటంలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో గ్యాస్‌కు డిమాండ్ పెరగడంతో ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు యుద్దం తిరిగి ప్రారంభం కావడం, హర్ముజ్ జలసంధి మళ్లీ మూతపడటంతో గ్యాస్ రవాణాకు అంతరాయం కలుగుతుంది. ఈ క్రమంలో గ్యాస్ ధరలు మళ్లీ పెరుగుతాయా? అనే వార్తలు వినిపిస్తు్న్నాయి. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతల వల్ల ఎల్పీజీ ధరలు పెరిగినప్పటికీ.. దేశంలో సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని కేంద్రం తెలిపింది. అలాగే సబ్సిడీని కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది.
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై పరోక్ష సబ్సిడీ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూ.700కిపైగా పరోక్ష సబ్సిడీ అందిస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం ఎల్పీజీ సిలిండర్ రిటైల్ ధర రూ.942 వద్ద కొనసాగుతుందని, కేంద్రం పరోక్షంగా జూన్ 20226లో ఒక్కో సిలిండర్‌పై రూ.700కిపైగా పరోక్ష సబ్సిడీ అందించిందని స్పష్టం చేసింది. జులైలో ఒక్కో సిలిండర్‌పై రూ.500కిపైగా పరోక్ష సబ్సిడీ కొనసాగుతుందని తెలిపింది. ఇక ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన లబ్దిదారులు ఒక్కో సిలిండర్‌పై రూ.640 మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపింది. కేంద్రం వీరికి ఒక్కొ సిలిండర్‌పై రూ.300 ప్రత్యక్ష సబ్సిడీ అందిస్తుండగా.. రూ.500 పరోక్ష సబ్సిడీ కూడా కొనసాగుతుందని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1695గా ఉందని, తాము ప్రజలపై భారం పడకుండా ధరలను నియంత్రిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.
