LPG Gas Cylinder Price: గుడ్‌న్యూస్‌.. తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఎంతంటే..!

పండుగ సీజన్‌లో ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో ఉపశమనం లభించింది. ప్రతి నెల ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను సవరిస్తుంటాయి చమురు కంపెనీలు. అయితే ఈ ఉపశమనం..

LPG Gas Cylinder Price: గుడ్‌న్యూస్‌.. తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఎంతంటే..!
Lpg Gas Cylinder
Follow us

|

Updated on: Oct 01, 2022 | 9:04 AM

పండుగ సీజన్‌లో ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో ఉపశమనం లభించింది. ప్రతి నెల ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను సవరిస్తుంటాయి చమురు కంపెనీలు. అయితే ఈ ఉపశమనం కేవలం వాణిజ్య సిలిండర్ల వినియోగించేవారికి మాత్రమే. అయితే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. చమురు కంపెనీలు ఇచ్చిన సమాచారం ప్రకారం.. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర అక్టోబర్‌ 1 నుంచి రూ.25.5 తగ్గింది. అదే సమయంలో కోల్‌కతాలో రూ.36.5, ముంబైలో రూ.32.5, చెన్నైలో రూ.35.5 సిలిండర్ ధర తగ్గింది. LPG ధరలు ప్రతి నెలా మొదటి తేదీన సమీక్షించబడతాయి. సమీక్ష తర్వాత హోటళ్లు, రెస్టారెంట్ల ధరలు తగ్గుతాయని అంచనా. కొత్త రేట్లు తక్షణం అమల్లోకి వచ్చాయి.

ధరలు ఎంత తగ్గాయి

ధరల మార్పు తర్వాత 19 కిలోల ఇండేన్ సిలిండర్ ఢిల్లీలో రూ. 1859.5 ఉండగా, ఇది గతంలో 1885 ఉంది. అదే సమయంలో కోల్‌కతాలో వాణిజ్య సిలిండర్ రూ. 1959గా ఉంది. ఇది గతంలో రూ. 1995.5కు అందుబాటులో ఉంది. ముంబైలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1844 నుంచి రూ.1811.5కి తగ్గింది. చెన్నైలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.2045 నుంచి రూ.2009.5కి తగ్గింది. అంతకుముందు సెప్టెంబర్‌లో సిలిండర్ ధర రూ.91.5 తగ్గినప్పుడు ధరలు కూడా తగ్గించబడ్డాయి. అక్టోబర్‌లో తగ్గింపుతో వరుసగా గత 5 నెలలుగా వాణిజ్య గ్యాస్ ధరలలో ఉపశమనం లభించింది.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్‌ 1న కూడా కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింది. అంతకు ముందు జూలై 6న 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్ ధరపై రూ.8.5 తగ్గింది. ఇక జూలై 6న 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.50 పెంచారు. అంతకు ముందు అంటే మే 19న గ్యాస్‌ ధరలను సవరించబడ్డాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో రూ.1,053, కోల్‌ కతాలో రూ.1,079, ముంబైలో రూ.1,052.5, చెన్నైలలో రూ.1,068 ఉంది. హైదరాబాద్‌లో రూ.1105 ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి