LPG Cylinder Price: సామాన్యులకు భారీ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
మార్చినెల ఆరంభంలోనే వినియోగదారులపై గ్యాస్ బండ పడింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరో సారి గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచేశాయి. ఈసారి అటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు, ఇటు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు రెండూ కూడా పెరిగాయి.

మార్చినెల ఆరంభంలోనే వినియోగదారులపై గ్యాస్ బండ పడింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరో సారి గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచేశాయి. ఈసారి అటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు, ఇటు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు రెండూ కూడా పెరిగాయి. సుమారు 8 నెలల తర్వాత డొమెస్టిక్ సిలిండర్ ధర 50రూపాయలు పెరగడం గమనార్హం. నిన్న ఢిల్లీలో 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ 1053 రూపాయలుగా ఉండగా ఇవాల్టి (మార్చి1) నుంచి 1103 రూయాయలకు చేరింది. ఇక కమర్షియల్ సిలిండర్ ధర నిన్న 1769రూపాయలు ఉండగా..ఇవాళ అది 2119 రూపాయలకు చేరింది. అంటే ఏకంగా రూ. 350 మేర పెరిగాయన్నమాట. అలాగే కోల్‌కతాలో చూస్తే.. దీని ధర రూ. 1870 నుంచి రూ. 2221కు పెరిగింది. ఇక ముంబైలో ఈ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1721గా ఉండేది. ఇప్పుడు దీని రేటు రూ. 2071కు చేరింది. చెన్నైలో ఈ సిలిండర్ ధర రూ. 2268కు పెరిగింది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. డొమెస్టిక్ సిలిండర్ ధర పెరగడం 8 నెలల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. దీంతో ఈ రేటు తాజాగా రూ. 1155కు చేరింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఈ రేటు రూ. 1161 పలుకుతోంది. కాగా గతంలో సిలిండర్ ధర పెరిగితే సబ్సిడీ కూడా పెరిగేది. ఇప్పుడు సబ్సిడీ ఎత్తి వేయడంతో సామాన్యుల జేబులకు భారీగా చిల్లు పడనుంది.




మరిన్ని బిజినెస్ వార్తల కోసం.. క్లిక్ చేయండి..