Low Cost Electric Cars: ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? తక్కువ ధరకే అందుబాటులో ఉన్న 5 కార్లు..

పెట్రోల్, ఢీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఇక వినియోగదారుల మైండ్‌సెట్‌ను దృష్టిలో ఉంచుకుని, సామాన్యులకు అందుబాటు ధరలకే ఎలక్ట్రిక్ కార్లను రిలీజ్ చేస్తున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు. మీరు కూడా బడ్జెట్ ధరలకే ఎలక్ట్రిక్ కారునే కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే, అత్యంత తక్కువకే, మంచి కంపెనీలకు చెందిన..

Low Cost Electric Cars: ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? తక్కువ ధరకే అందుబాటులో ఉన్న 5 కార్లు..
Electric Cars
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 22, 2023 | 8:40 PM

పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి క్రమేపీ ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టి సారిస్తున్నారు ప్రజలు. రవాణా కోసం చౌకైన మార్గాలను ఎంచుకుంటున్నారు. పెట్రోల్, ఢీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఇక వినియోగదారుల మైండ్‌సెట్‌ను దృష్టిలో ఉంచుకుని, సామాన్యులకు అందుబాటు ధరలకే ఎలక్ట్రిక్ కార్లను రిలీజ్ చేస్తున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు. మీరు కూడా బడ్జెట్ ధరలకే ఎలక్ట్రిక్ కారునే కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే, అత్యంత తక్కువకే, మంచి కంపెనీలకు చెందిన 5 ఉత్తమ కార్ల వివరాలు మీకోసం..

1. ఈ లిస్ట్‌లో మొదటగా ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్. దేశంలోనే అతి తక్కువ ధరకు దీన్ని కొనుగోలు చేయొచ్చు. దీని ప్రారంభ ధర రూ. 7.98 లక్షలు(ఎక్స్-షోరూమ్) ఉంటుంది. దీని రేంజ్‌ గురించి చెప్పాలంటే, ఒక్కసారి ఛార్జ్ చేస్తే రూ. 230 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.

2. తరువాతి బడ్జెట్ ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో. దీని ప్రారంభ ధర రూ. 8.69 లక్షలు(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 నుండి 310 కిలోమీటర్ల పరిధి వస్తుందని కంపెనీ తెలిపింది.

3. ఇక మరో ఎలక్ట్రిక్ కారు సిట్రోయెన్ EC3. దీని ప్రారంభ ధర రూ. 11.50 లక్షలు(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అని కంపెనీ తెలిపింది.

4. ఇక తరువాత చూసుకుంటే టాటా ఎలక్ట్రిక్ సెడాన్ కారు టిగోర్. దీని ప్రారంభ ధర రూ. 12.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అని కంపెనీ తెలిపింది.

5. ఈ లిస్ట్‌లో 5వ సరసమైన ఎలక్ట్రిక్ కారు టాటా నెక్సాన్. ఈ కారు ప్రారంభ ధర రూ. 14.49 లక్షలు(ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారును కూడా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 312 కిలోమీటర్ల వరకు రేంజ్‌ ఇస్తుందని కంపెని తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..