Tech News: భారంగా మారుతోన్న రెండు సిమ్‌లు.. డ్యూయల్ సిమ్ ట్రెండ్‌కు ఫుల్‌స్టాప్ పడనుందా.?
ఒకప్పుడు ఫోన్‌లలో ఒకటే సిమ్ కార్డు ఉండేది. కానీ ఎప్పుడైతే డ్యూయల్ సిమ్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయో అప్పటి నుంచి కస్టమర్లు రెండు సిమ్‌లను ఉపయోగించడం తప్పనిసరిగా మారిపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా రెండు సిమ్ కార్డులను వాడడం ప్రారంభించారు...

ఒకప్పుడు ఫోన్‌లలో ఒకటే సిమ్ కార్డు ఉండేది. కానీ ఎప్పుడైతే డ్యూయల్ సిమ్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయో అప్పటి నుంచి కస్టమర్లు రెండు సిమ్‌లను ఉపయోగించడం తప్పనిసరిగా మారిపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా రెండు సిమ్ కార్డులను వాడడం ప్రారంభించారు. అయితే తాజాగా డ్యూయల్ సిమ్ ట్రెండ్‌కు ఫుల్‌స్టాప్ పడనుందా అంటే.. తాజాగా కనిపిస్తోన్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ఇంతకీ డ్యూయల్ సిమ్ ఎందుకు కనుమరుగు కానుందో తెలియాలంటే. ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
మొన్నటి వరకు సిమ్ కార్డులు యాక్టివ్‌లో ఉండాలంటే ఎలాంటి రీచార్జ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. లైఫ్ టైం వ్యాలిడిటీతో సిమ్‌లు పనిచేసేవి. కానీ ప్రస్తుతం సిమ్ యాక్టివ్‌లో ఉండాలంటే కచ్చితంగా నెలవారీ రీచార్జ్ చేయాలనే నిబంధన వచ్చింది. అంతకు ముందు ఒక సిమ్ కార్డుకు బ్యాలెన్స్ వేసుకొని మరోసిమ్‌ను అలాగే వదిలేసేవారు. అయితే ప్రస్తుతం తరుణంలో రీచార్జ్ చేయకపోతే కనెక్షన్‌ను తొలగిస్తామని టెలికం సంస్థలు కస్టమర్లకు ఫోన్‌లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు సిమ్‌లకు రీచార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఇది వినియోగదారుడిపై ఆర్థికంగా ప్రభావం చూపుతోంది.
టెలికం సంస్థలు కూడా మినిమం రీచార్జ్‌ను అమాంతం పెంచేశాయి. దీంతో రెండు సిమ్‌లను వాడడం కస్టమర్లకు భారంగా మారుతుంది. ప్రస్తుతం దాదాపు అన్ని టెలికం కంపెనీలు ఒకే రకమైన రీఛార్జ్ ప్లాన్లను అమలు చేస్తున్న నేపథ్యంలో చాలా మంది ఒకే సిమ్‌ను వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఈ ఏడాది ఏప్రిల్‌లోనే సుమారు 70 లక్షల మంది ఒక సిమ్‌ను ఉపయోగించడం మానేశారు. వీటిలో మొదటి స్థానంలో వొడాఫోన్-ఐడియా ఉండగా, ఎయిర్‌టెల్ రెండో స్థానంలో నిలించింది.



మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..