LIC Jeevan Azad Plan: ఎల్ఐసీ సార్.. ఎల్ఐసీ అంతే! కొత్త ప్లాన్ ప్రకటించిందో లేదో.. ఎంత రెస్పాన్సో చూశారా? ప్లాన్ వివరాలు ఇవి..

2023 జనవరిలో ఎల్‌ఐసీ జీవన్‌ ఆజాద్‌ పాలసీని ప్రకటించింది. కేవలం 10 నుంచి 15 రోజుల వ్యవధిలోనే ఏకంగా 50,000 ప్లాన్లను విక్రయించింది. ఇది పొదుపు ఆధారిత జీవిత బీమా పాలసీ కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు ప్లాన్లను స్వీకరించేందుకు మొగ్గు చూపుతున్నారు.

LIC Jeevan Azad Plan: ఎల్ఐసీ సార్.. ఎల్ఐసీ అంతే! కొత్త ప్లాన్ ప్రకటించిందో లేదో.. ఎంత రెస్పాన్సో చూశారా? ప్లాన్ వివరాలు ఇవి..
Lic Jeevan Azad
Follow us

|

Updated on: Feb 12, 2023 | 1:25 PM

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ) అంటేనే ప్రజలకు బాగా గురి. ఎన్ని ప్రైవేటు కంపెనీలు వచ్చినా.. ఎంత వడ్డీలు చెల్లిస్తామన్నా.. వాటి వైపు చూసేవారు చాలా తక్కువ. ఎల్ఐసీ ‌ప్రభుత్వ రంగ సంస్థ అవడంతో సొమ్ముకు పూర్తి భద్రత.. పెట్టిన పెట్టుబడికి తగిన రాబడి వస్తుందన్న భరోసా లభిస్తుండటంతో ప్రజలకు దీనిపై నమ్మకాన్నిపెరిగింది. ఇదే విషయం మరోసారి నిరూపితమైంది. ఇటీవల ఎల్‌ఐసీ ప్రకటించిన ఓ పాలసీకి రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఎల్‌ఐసీ చైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

జీవన్‌ ఆజాద్‌ పాలసీ..

2023 జనవరిలో ఎల్‌ఐసీ జీవన్‌ ఆజాద్‌ పాలసీని ప్రవేశపెట్టింది. అది ప్రారంభించిన 10 నుంచి 15 రోజుల వ్యవధిలోనే ఏకంగా 50,000 ప్లాన్లను విక్రయించింది. ఇది పొదుపు ఆధారిత జీవిత బీమా పాలసీ కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు ప్లాన్లను స్వీకరించేందుకు మొగ్గు చూపారు. దీనిలో మెచ్యూరిటీ తర్వాత హామీతో కూడిన మొత్తాన్ని అందిస్తుంది. పైగా పెట్టుకున్న పాలసీ మెచ్యూరిటీ వ్యవధికి ఎనిమిదేళ్ల ముందే చెల్లింపులు ఆపేయవచ్చు. అంటే ఏవరైన పాలసీని 18 ఏళ్ల మెచ్యురిటీ వ్యవధిని పెట్టుకుంటే 10 ఏళ్ల పాటు మాత్రమే చెల్లింపులు చేస్తే సరిపోతుంది. పాలసీని కనిష్టంగా 15 ఏళ్లు, గరిష్టంగా 20 ఏళ్ల వరకూ మెచ్యూరిటీ పిరియడ్ పెట్టుకోవచ్చు. చెల్లింపులు ఏడాదికి కనిష్టంగా రూ. 2 లక్షలు, గరిష్టంగా రూ. 5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు.

ప్రయోజనాలు ఇలా..

ఉదాహరణకు ఓ వ్యక్తి 30 ఏళ్ల వయసులో ఈ జీవన్ ఆజాద్ పాలసీ తీసుకున్నాడనుకోండి.. 18 ఏళ్లకు మెచ్యురిటీ పెట్టుకుంటే.. అతను పదేళ్ల పాటు సంవత్సరానికి రూ. 12,083 చొప్పున చెల్లిస్తే 18 ఏళ్ల తర్వాత అతనికి 4 నుంచి 5 శాతం వడ్డీ కలుపుకుంటే మొత్తం రూ.2 లక్షలు అవుతుంది. ఒకవేళ పాలసీదారు మరణిస్తే.. డెత్ బెనిఫిట్ కింద అప్పటి వరకూ కట్టిన వార్షిక ప్రీమియంనకు ఏడు రెట్టు చెల్లిస్తారు. అంటే దాదాపు మీ మొత్తం చెల్లింపులపై దాదాపు 105 శాతం మొత్తం పాలసీ దారుడి నామినీకి చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

అధిక ప్రాధాన్యం..

జీవన్ ఆజాద్‌తో సహా నాన్-పార్టిసిటింగ్ ప్లాన్‌లకు ఎల్ఐసీ చాలా ప్రాధాన్యతనిస్తోంది. ఎందుకంటే ఇటువంటి పథకాలు తమ పెట్టుబడిదారులకు మెరుగైన మార్జిన్‌లను అందిస్తాయి. వాటాదారుల వాటాను పెంచి.. తద్వారా వ్యాపారం మొత్తాన్ని లాభదాయకంగా మార్చడంలో ఇవి సాయపడతాయి. డిసెంబర్ 31, 2022తో ముగిసిన త్రైమాసికంలో, ఎల్ఐసీ నికర లాభంలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. అంతకుముందు సంవత్సరం రూ. 235 కోట్ల నుంచి రూ. 6,334 కోట్లను తాకింది. ఈ పెరుగుదలలో ఎక్కువ భాగం దాని నాన్ పార్టిసిపేటింగ్ ఫండ్ నుండి షేర్ హోల్డర్స్ ఫండ్‌కి రూ. 5,670 కోట్లను బదిలీ చేయడమే కారణమని చెప్పవచ్చు. వాస్తవానికి కంపెనీ నికర ప్రీమియం ఆదాయం 2022 ఆర్థిక సంవత్సరంలో త్రైమాసికానికి రూ. 97,620 కోట్లు ఉండగా.. అది 2023 ఆర్థిక సంవత్సర త్రైమాసికానికి 15 శాతం పెరిగి రూ. 1.1 లక్షల కోట్లకు చేరింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..