Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC: ఎల్‌ఐసీ పాలసీ ఉన్న వారికి హెచ్చరిక.. బీమా సంస్థ కీలక ప్రకటన

LIC: మన దేశంలో దేశీయ అతిపెద్ద బీమా రంగ సంస్థ భారతీయ జీవిత బీమా కంపెనీ అయిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC)కి ప్రత్యేక స్థానముంది. ఎన్నో పాలసీలను అందుబాటులోక తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలో తన వినియోగదారులకు ఎల్‌ఐసీ కీలక హెచ్చరిక జారీ చేసింది.

LIC: ఎల్‌ఐసీ పాలసీ ఉన్న వారికి హెచ్చరిక.. బీమా సంస్థ కీలక ప్రకటన
Follow us
Subhash Goud

|

Updated on: Feb 06, 2025 | 6:38 PM

దేశీయ అతిపెద్ద బీమా రంగ సంస్థ భారతీయ జీవిత బీమా కంపెనీ అయిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) తమ పాలసీదారులు, కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఎల్‌ఐసీ వినియోగదారులు ఫేక్ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అయితే ఎల్‌ఐసీ పేరుతో నకిలీ యాప్స్‌ సోసల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయని తాము గుర్తించామని, వాటిని నమ్మి మోసపోయే ప్రమాదం ఉందని పాలసీదారులను సూచించింది. నకిలీ యాప్స్‌ను ఎల్‌ఐసీ యాప్‌గా నమ్మి మోసపోవద్దని వినియోగదారులకు సూచించింది.

ఎల్‌ఐసీ ఇండియా పేరుతో కొన్ని నకిలీ మొబైల్‌ ఆప్లికేషన్లు వైరల్‌ అవుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని, అందుకే వినియోగదారులను, పాలసీదారులను అప్రమత్తం చేస్తున్నామని తెలిపింది. నకిలీ యాప్‌లను నమ్మి ఎలాంటి లావాదేవీలు చేయవద్దని, కేవలం ఎల్ఐసీ ఇండియా అధికారిక వెబ్‌సైట్, ఎల్ఐసీ డిజిటల్ యాప్ సహా ఎల్ఐసీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్న ఇతర మార్గాల ద్వారా మాత్రమే లావాదేవీలు చేయాలని సూచించింది.

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ధృవీకరించండి:

ఇవి కూడా చదవండి

లావాదేవీలు అధికారిక మార్గాల ద్వారా జరుగుతున్నాయని ఎల్లప్పుడూ నిర్ధారించుకోండి. URLలు, యాప్‌లను తనిఖీ చేయండి. ఏదైనా వివరాలను నమోదు చేసే ముందు, అది అధికారిక డొమైన్‌కు చెందినదో లేదో నిర్ధారించడానికి URLను క్రాస్-చెక్ చేయాలని సూచించింది ఎల్‌ఐసీ. Google Play Store లేదా Apple App Store వంటి విశ్వసనీయ మూలాల నుండి మాత్రమే మొబైల్ అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి. తెలియని మూలాల నుండి వచ్చే కాల్‌లు, ఇమెయిల్‌లు లేదా సందేశాలకు ప్రతిస్పందించవద్దు. వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరుచుకోండి.

అధికారి అని చెప్పుకునే ఎవరితోనూ సున్నితమైన పాలసీ వివరాలు, OTPలు లేదా బ్యాంక్ ఆధారాలను ఎప్పుడూ పంచుకోకండి. మీరు ఏవైనా మోసపూరిత యాప్‌లు లేదా లావాదేవీలను చూసినట్లయితే, వాటిని కస్టమర్ కేర్, సంబంధిత సైబర్ క్రైమ్ అధికారులకు నివేదించండని ఎల్‌ఐసీ సూచించింది.

ఇది కూడా చదవండి: Jio AirFiber: జియో అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. రూ.599కే ఇంటర్నెట్‌, 12 ఓటీటీలు, 800కుపైగా టీవీ ఛానళ్లు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి