AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC: వారెవ్వా.. ప్రతి నెలా రూ.9750 వడ్డీ.. ఎల్ఐసీలోని ఈ పథకం గురించి తెలుసా..?

మీ డబ్బును సురక్షితంగా ఉంచి, ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి ఇది శుభవార్త. ఎల్ఐసీ అనుబంధ సంస్థ అయిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ FD పథకం ఒక చక్కటి అవకాశం. ఈ పథకంలో మీ డబ్బుకు అత్యధిక భద్రత ఉంటుంది. ప్రస్తుతం దీనిపై 6.45శాతం నుంచి 7.8శాతం వరకు వడ్డీ లభిస్తుంది.

LIC: వారెవ్వా.. ప్రతి నెలా రూ.9750 వడ్డీ.. ఎల్ఐసీలోని ఈ పథకం గురించి తెలుసా..?
Lic Hfl Fd Scheme
Krishna S
|

Updated on: Oct 21, 2025 | 7:44 PM

Share

మీరు కష్టపడి సంపాదించిన డబ్బును భద్రంగా ఉంచి, ప్రతి నెలా కొంత ఆదాయం వచ్చేలా పెట్టుబడి పెట్టాలనుకుంటే మీకో గుడ్ న్యూస్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం మీకు బెస్ట్ ఆప్షన్. బ్యాంక్ ఎఫ్‌డీల మాదిరిగానే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసీ నుండి వస్తున్న ఈ పథకం పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన రాబడితో పాటు అత్యధిక భద్రతను అందిస్తుంది.

సురక్షితమైన రాబడికి హామీ

ఇది మార్కెట్ రిస్క్‌లు లేకుండా సురక్షితమైన పెట్టుబడి మార్గాన్ని కోరుకునే వారికి చాలా అనుకూలం. ప్రస్తుతం సాధారణ పెట్టుబడిదారులకు సంవత్సరానికి 6.45శాతం వరకు వడ్డీ రేటు లభిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 0.25% అధిక వడ్డీ రేటు లభిస్తుంది. ప్రత్యేక సందర్భాల్లో ఇది 7శాతం లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు.

నెలవారీ ఆదాయం – పెట్టుబడి వివరాలు

ఈ పథకం యొక్క దీని ముఖ్య ప్రయోజనం ఏమిటంటే.. మీ పెట్టుబడిపై వచ్చే వడ్డీ ప్రతి నెలా నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఇది రెగ్యులర్ ఆదాయం కోరుకునే వారికి సౌకర్యంగా ఉంటుంది. ఈ పథకంలో కనీసం రూ. 1,50,000 పెట్టుబడి పెట్టాలి. గరిష్టంగా ఎంతైనా పెట్టవచ్చు, పరిమితి లేదు. 1 సంవత్సరం నుండి 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టవచ్చు.

నెలకు ఎంతంటే..?

మీరు రూ. 1,50,000 పెట్టుబడి పెడితే వడ్డీ రేటును బట్టి ప్రతి నెలా రూ. 530 నుండి రూ. 950 వరకు ఆదాయం వస్తుంది. అదే మీరు రూ.15లక్షల పెట్టుబడి పెడితే నెలకు సుమారు 9750 వడ్డీ వస్తుంది.

పన్ను మినహాయింపు

మీరు 5 సంవత్సరాల FD చేస్తే, సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. సంవత్సరపు వడ్డీ ఆదాయం రూ. 40 వేలు మించకపోతే, ఫారం 15G లేదా ఫారం 15H సమర్పించి పన్ను కట్ కాకుండా చూసుకోవచ్చు. మీ ఎఫ్‌డీపై తక్కువ వడ్డీ రేటుకే లోన్ తీసుకునే అవకాశం ఉంది. డిపాజిట్ చేసిన 6 నెలల తర్వాత.. అవసరమైతే మీ డబ్బును ముందుగానే తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. మార్కెట్ రిస్క్‌లు తీసుకోకుండా, స్థిరమైన మరియు సురక్షితమైన నెలవారీ ఆదాయాన్ని కోరుకునే వారికి LIC HFL FD పథకం చాలా నమ్మకమైన పథకం అని చెప్పొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..