- Telugu News Photo Gallery Business photos Geyser Capacity Confusion Solved How to Choose the Perfect Geyser Size for Your Family
Geyser Capacity: గీజర్ కొనేటప్పుడు దీన్ని గుర్తుంచుకోండి.. మీ కుటుంబానికి ఎన్ని లీటర్ల గీజర్ సరైనది?
Geyser Capacity: మీ కుటుంబంలో 4 నుండి 6 మంది ఉంటే 25 నుండి 35 లీటర్ల సామర్థ్యం కలిగిన గీజర్ మీకు ఉత్తమం. పెద్ద బాత్రూమ్ లేదా రెండు బాత్రూమ్‌లు ఉన్న ఇళ్లకు ఇది ఉత్తమం. ప్రత్యేకత ఏమిటంటే ఈ..
Updated on: Oct 21, 2025 | 8:01 PM

Geyser Capacity: ఈ నెల ప్రారంభంతో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఇళ్లలో ఏసీలు ఆపివేసే టైమ్ వచ్చేస్తుంటుంది. ఇప్పుడు గీజర్లతో అవసరం ఏర్పడుతుంటుంది. అందుకే ఈ రోజుల్లో మీరు కొత్త గీజర్ కొనాలని ఆలోచిస్తుంటే, మీ కుటుంబానికి లీటర్ సామర్థ్యం ఎంత ఉంటుందో ముందుగా అర్థం చేసుకోవడం ముఖ్యం.

చిన్న ఇన్‌స్టంట్ గీజర్‌ల నుండి పెద్ద స్టోరేజ్ గీజర్‌ల వరకు వివిధ పరిమాణాలు, రకాలు, బడ్జెట్‌లలో గీజర్‌లు అందుబాటులో ఉన్నాయి. సరైన సామర్థ్యాన్ని ఎంచుకోవడం వల్ల విద్యుత్తు మాత్రమే కాకుండా నీరు కూడా ఆదా అవుతుంది. మీ కుటుంబానికి ఉత్తమమైన గీజర్ ఏదో తెలుసుకుందాం..

ఒంటరి వ్యక్తుల కోసం - మీరు ఒంటరిగా నివసిస్తుంటే మీరు పని చేస్తున్నా లేదా చదువుతున్నా, 3-లీటర్ల ఇన్‌స్టంట్ గీజర్ ఉత్తమ ఎంపిక. ఈ చిన్న సైజు గీజర్ చాలా తక్కువ స్థలాన్ని తీసుకుంటుంది. ప్రధాన విషయం ఏమిటంటే ఇంత చిన్న గీజర్ కేవలం 2 నుండి 3 నిమిషాల్లో నీటిని వేడి చేస్తుంది. ఇది ఒక వ్యక్తి స్నానం చేయడానికి లేదా రోజువారీ వినియోగానికి సరిపోతుంది.

ఇద్దరు సభ్యులున్న కుటుంబానికి - ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఉంటే, 10 లీటర్ల నిల్వ సామర్థ్యం కలిగిన గీజర్ మంచి ఎంపిక. ఈ గీజర్ ఒకేసారి తగినంత నీటిని వేడి చేస్తుంది. తద్వారా ఇద్దరూ హాయిగా స్నానం చేయవచ్చు. ప్రత్యేకత ఏమిటంటే ఈ గీజర్ నీటిని ఎక్కువసేపు వేడిగా ఉంచుతుంది. ఇది విద్యుత్ వినియోగాన్ని కూడా తగ్గిస్తుంది.

3 నుండి 4 మందికి - ఇంట్లో ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు నివసిస్తుంటే 15 నుండి 25 లీటర్ల సామర్థ్యం కలిగిన గీజర్ మీకు ఉత్తమమైనది. ఇది తగినంత నీటిని నిల్వ చేస్తుంది. తద్వారా మొత్తం కుటుంబం ఒకరి తర్వాత ఒకరు హాయిగా స్నానం చేయవచ్చు.

4 నుండి 6 మంది సభ్యులు ఉన్న కుటుంబానికి - మీ కుటుంబంలో 4 నుండి 6 మంది ఉంటే 25 నుండి 35 లీటర్ల సామర్థ్యం కలిగిన గీజర్ మీకు ఉత్తమం. పెద్ద బాత్రూమ్ లేదా రెండు బాత్రూమ్‌లు ఉన్న ఇళ్లకు ఇది ఉత్తమం. ప్రత్యేకత ఏమిటంటే ఈ పెద్ద గీజర్ లోపల ఒకసారి వేడి చేసిన తర్వాత నీరు ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. అంటే మీరు తరచుగా గీజర్‌ను ఆన్ చేయవలసిన అవసరం ఉండదు.




