Budget 2024: బడ్జెట్‌లో వారికే అగ్రతాంబూలం.. పన్ను ఆదా చేసేలా కీలక చర్యలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్ 2024ను పార్లమెంట్‌లో సమర్పించారు. సాధారణంగా కేంద్ర బడ్జెట్ గురించి భారతదేశంలో అధికంగా ఉండే మధ్య తరగతి ప్రజలు ఎదురుచూస్తూ ఉంటారు. ముఖ్యంగా కేంద్రం పన్ను విధానాల్లో తీసుకునే చర్యలు ఈ వర్గాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ ప్రకటనలో రూ. 3 నుంచి రూ. 7 లక్షల ఆదాయంపై 5 శాతం పన్నుతో సహా కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించడానికి మంత్రి కొన్ని ఉపశమన చర్యలను ప్రవేశపెట్టారు. గతంలో రూ.3 నుంచి 6 లక్షల శ్లాబుపై 5 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఈ మార్పులతో కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులు రూ. 17,500 ప్రయోజనాన్ని పొందుతారు.

Budget 2024: బడ్జెట్‌లో వారికే అగ్రతాంబూలం.. పన్ను ఆదా చేసేలా కీలక చర్యలు
Budget 2024
Follow us
Srinu

|

Updated on: Jul 25, 2024 | 3:40 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్ 2024ను పార్లమెంట్‌లో సమర్పించారు. సాధారణంగా కేంద్ర బడ్జెట్ గురించి భారతదేశంలో అధికంగా ఉండే మధ్య తరగతి ప్రజలు ఎదురుచూస్తూ ఉంటారు. ముఖ్యంగా కేంద్రం పన్ను విధానాల్లో తీసుకునే చర్యలు ఈ వర్గాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ ప్రకటనలో రూ. 3 నుంచి రూ. 7 లక్షల ఆదాయంపై 5 శాతం పన్నుతో సహా కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించడానికి మంత్రి కొన్ని ఉపశమన చర్యలను ప్రవేశపెట్టారు. గతంలో రూ.3 నుంచి 6 లక్షల శ్లాబుపై 5 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఈ మార్పులతో కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులు రూ. 17,500 ప్రయోజనాన్ని పొందుతారు. అయితే పన్ను ఆదా చేసేందుకు పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి ఎలాంటి ప్రయోజనాలు లభించలేదు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా చర్యలు ఉన్నాయా? లేదా? అనే విషయం గురించి ఓ సారి తెలుసుకుందాం.

ముఖ్యంగా బడ్జెట్‌లో మ్యూచువల్ ఫండ్స్, షేర్లలో తమ డబ్బును పెట్టుబడి పెట్టే వారికి కూడా ఎలాంటి ఉపశమన ప్రకటన చేయలేదు. ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, స్వయంగా ఆర్థిక మంత్రి కూడా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టమని ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. ఎల్‌టీసీజీ (లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్) 10 శాతం నుంచి 12.5 శాతానికి, ఎస్టీసీజీ (స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను) 15 శాతం నుంచి 20 శాతానికి పెంచారు. అయితే దిగువ, మధ్య-ఆదాయ తరగతుల ప్రయోజనాల కోసం కొన్ని లిస్టెడ్ ఆర్థిక ఆస్తులపై మూలధన లాభాల మినహాయింపు పరిమితిని సంవత్సరానికి రూ. 1,00,000 లక్షల నుండి రూ. 1.25,00,000కి పెంచారు. అయినప్పటికీ పెట్టుబడిదారులకు మ్యూచువల్ ఫండ్స్, షేర్లలో తమ పెట్టుబడులపై  పన్ను బాదుడు తప్పదు.

స్థిరాస్తులపై దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్‌టిసిజి) పన్నును 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అయితే ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేయడానికి ఇండెక్సేషన్ ప్రయోజనాలను తీసిశారు. ఈ నిర్ణయం ఆస్తులను విక్రయించే వ్యక్తులను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఇండెక్సేషన్ అనేది ద్రవ్యోల్బణం కోసం ఆస్తి కొనుగోలు ధరను సర్దుబాటు చేస్తుంది. పన్ను విధించదగిన లాభాలతో పాటు పన్ను బాధ్యతలను తగ్గిస్తుంది. ఈ సర్దుబాటు లేకుండా తక్కువ ఎల్‌టీసీజీ రేటు ఉన్నప్పటికీ పన్ను చెల్లింపుదారులు పెరిగిన పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..