AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fixed Deposits: ఎఫ్‌డీ చేయాలనుకునే వారికి షాక్.. త్వరలో వడ్డీ రేట్ల తగ్గింపు?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల వరుసగా మూడోసారి రెపో రేటును తగ్గించింది. ఈసారి 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రెపో రేటు 5.5 శాతానికి కి చేరుకుంది. ఈ వార్త ఎఫ్‌డీ పెట్టుబడిదారులకు షాక్ ఇచ్చిందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి స్థిరమైన ఆదాయం కోసం మీ డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టాలని ప్లాన్ చేస్తుంటే వడ్డీ రేట్లు బ్యాంకులు తగ్గించే ముందు వీలైనంత త్వరగా పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు.

Fixed Deposits: ఎఫ్‌డీ చేయాలనుకునే వారికి షాక్.. త్వరలో వడ్డీ రేట్ల తగ్గింపు?
Fixed Deposits
Nikhil
|

Updated on: Jun 06, 2025 | 5:15 PM

Share

ఆర్‌బీఐ రేటు తగ్గింపు తర్వాత బ్యాంకులు సాధారణంగా తమ డిపాజిట్, రుణ రేట్లను సవరిస్తాయి. ఈ చర్యలు వెంటనే తీసుకోవు. కొన్ని రోజుల సమయం తర్వాత పెంచుతాయి. ఫిబ్రవరి-ఏప్రిల్ నెలల్లో జరిగిన రెండు ద్రవ్య విధాన సమీక్షలలో ఆర్‌బీఐ ఇప్పటికే రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీని తర్వాత బ్యాంకులు కూడా తమ డిపాజిట్, రుణ వడ్డీ రేట్లను తగ్గించాయి. అయితే అనేక అగ్ర బ్యాంకులు ఇప్పటికీ 6.5 శాతం నుంచి 7.25 శాతం వరకు ఎక్కువ కాలపరిమితి (5 సంవత్సరాల కంటే ఎక్కువ) ఎఫ్‌డీ రేట్లను అందిస్తున్నాయి. కానీ ఈ స్థాయి రేటు ఎక్కువ కాలం ఉండదని, ఆర్‌బీఐ నిర్ణయం మేరకు త్వరలో బ్యాంకులు వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

పెట్టుబడిదారులు ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే లేదా త్వరలో మెచ్యూర్ అవుతున్న ఎఫ్‌డీ కలిగి ఉంటే రాబోయే కొన్ని సంవత్సరాల పాటు అధిక రేటుకు మీ డబ్బును లాక్ చేసుకోవడానికి 2025లో ఇదే మీకు చివరి అవకాశమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న బ్యాంక్ ఇప్పటికీ 3 నుండి 5 సంవత్సరాల కాలపరిమితికి 7 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఆఫర్ చేస్తుంటే మీ నిధులలో కొంత భాగాన్ని ఆ రేటుకు పెట్టుబడి పెట్టడానికి పరిగణించాలని సూచిస్తున్నారు. పెట్టుబడిదారులు కొంత ఫ్లెక్సిబిలిటీని కొనసాగించడానికి మీ ఎఫ్‌డీలను వేర్వేరు మెచ్యూరిటీలతో (1, 2, 3, లేదా 5 సంవత్సరాలు) భాగాలుగా విభజించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా భవిష్యత్తులో రేట్లు మళ్లీ పెరిగితే, మీరు మొత్తం డిపాజిట్‌ను విచ్ఛిన్నం చేయకుండా కొంత భాగాన్ని మెరుగైన రేట్లకు తిరిగి పెట్టుబడి పెట్టవచ్చని స్పష్టం చేస్తున్నారు. 

సీనియర్ సిటిజన్లు ఎఫ్‌డీలపై అదనంగా 0.50% పొందుతారు. అలాగే ఆర్బీఐ ఇటీవల ఆశ్చర్యకరంగా నగదు నిల్వ నిష్పత్తి (సీఆర్ఆర్)లో 50 బీపీఎస్ కోత ప్రకటించింది. డిసెంబర్ 2024లో కూడా ఆర్‌బీఐ సీఆర్ఆర్‌ను 50 బీపీఎస్‌ను తగ్గించి 4 శాతానికి తగ్గించింది. సీఆర్ఆర్ తగ్గింపు ప్రయోజనాన్ని పొందడానికి 3 నెలల నుంచి 3 సంవత్సరాల కాలపరిమితి గల బాండ్ పథకాలలో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. సెప్టెంబర్ 2025 నుంచి ప్రారంభమయ్యే విధంగా ఆర్‌బీఐ సీఆర్ఆర్‌లో 100 బేసిస్ పాయింట్లు తగ్గించి ఒక్కొక్కటి 25 బేసిస్ పాయింట్ల చొప్పున నాలుగు విడతలుగా 3 శాతానికి తగ్గింపును ప్రకటించింది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి