Pan Card: పది నిమిషాల్లోనే పాన్ కార్డు మీ చేతిలో.. అందుకు ఏం చేయాలంటే..

|

Jan 18, 2022 | 10:54 AM

ప్రస్తుతం పాన్ కార్డు చాలా ముఖ్యమైనది. అన్ని సౌకర్యాలు.. అకౌంట్ డాక్యూమెంట్స్‏లలో పాన్ కార్డు అత్యవసరం. అయితే

Pan Card: పది నిమిషాల్లోనే పాన్ కార్డు మీ చేతిలో.. అందుకు ఏం చేయాలంటే..
Pan Card
Follow us on

ప్రస్తుతం పాన్ కార్డు చాలా ముఖ్యమైనది. అన్ని సౌకర్యాలు.. అకౌంట్ డాక్యూమెంట్స్‏లలో పాన్ కార్డు అత్యవసరం. అయితే గతంలో ఈ పాన్ కార్డు అంతగా అవసరం పడేది కాదు.. కానీ ప్రస్తుతం ప్రతి పనిలోనూ పాన్ కార్డు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే పాన్ కార్డు పొందాలంటే అప్పట్లో చాలా సమయం వేచి చూడాల్సి వచ్చేంది. దాదాపు 45 రోజల తర్వాత పాన్ కార్డు మన వరకు వస్తుండేది. కానీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో పాన్ ఇప్పుడు సులువుగా మీ ఇంటికి చేరుతుంది. కానీ ఇప్పుడు పాన్ కార్డు కేవలం పది నిమిషాల్లోనే తీసుకోవచ్చు. అయితే పాన్ కార్డు కావాలంటే తప్పనిసరిగా ఆధార్ ఉండాల్సిందే. మరీ ఇంత సులభంగా పాన్ కార్డు కావాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా.

☛ ముందుగా https://www.incometaxindiaefiling.gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
☛ ఆ తర్వాత ఇందులో ఎడమవైపు ఉండే “Instant PAN through Aadhaar” పై క్లిక్ చేయాలి.
☛ దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
☛ ఆ తర్వాత మరో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దానిపై “Get New PAN” అనే అప్షన్ పై క్లిక్ చేయాలి.
☛ మీకు ఒక అప్లికేషన్ వస్తుంది.
☛ అందులో మీరు మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ☛ ఆ తర్వాత ఓటీటీ కోసం క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
☛ వెంటనే మీ ఫోన్ కు ఓటీపీ వస్తుంది.
☛ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు పాన్ కార్డు అప్లికేషన్ కోసం ఈమెయిల్ ఐడీని దృవీకరించాలి.
☛ కేవలం పది నిమిషాల్లోనే మీ ఫాన్ నంబర్ పొందుతారు.
☛ దీనిని పీడీఎఫ్ ఫార్మాట్ లో కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ☛ అంతేకాకుండా… హార్ట్ కాపీ కావాలంటే అందుకు రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: Dhanush Divorce: సినిమా పరిశ్రమలో మరో బ్రేకప్‌.. భార్య ఐశ్వర్యా రజనీకాంత్ తో విడిపోతున్నట్లు ప్రకటించిన ధనుష్‌..

Anushka Shetty: అరుంధ‌తి చిత్రానికి 13 ఏళ్లు.. జేజ‌మ్మ పాత్ర‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన అనుష్క‌..

Radhe Shyam: మార్చిలో సంద‌డి చేయ‌నున్న రాధేశ్యామ్‌.? నెట్టింట వైర‌ల్ అవుతోన్న విడుద‌ల తేదీ..

Dhanush-Aishwaryaa: ఆ ఇద్దరినీ ఒకటి చేసిన సినిమా.. ఐశ్యర్య, ధనుష్‌ల అందమైన లవ్ స్టోరీ..