AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: నెలకు లక్షలు సంపాదించండి.. తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టే వ్యాపారం ఇది..

Paper Bag Making Business: ప్రకృతిని రక్షించండి.. భూమిని కాపాడండి.. ఇలాంటి స్లోగన్స్ మనం నిత్యం చూస్తుంటాం. కానీ, ఏం చేయాలో తెలియదు. మీరే స్వయంగా రంగంలోకి దిగొచ్చు.. అంతేకాదు మీరు కూడా ఆర్ధికంగా ఎదుగొచ్చు. పది మందికి ఉపాధి కల్పించవచ్చు. ప్లాస్టిక్ నిషేధం వల్ల పేపర్ బ్యాగుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే.. పేపర్ బ్యాగ్ తయారీ వ్యాపారం మంచి ఎంపిక అని చెప్పవచ్చు. రానున్న కాలంలో పేపర్ బ్యాగులకు డిమాండ్ మరింత పెరగనుంది. అటువంటి పరిస్థితిలో.. మీరు కూడా ఈ వ్యాపారం ద్వారా మంచి డబ్బు సంపాదించవచ్చు.

Business Ideas: నెలకు లక్షలు సంపాదించండి.. తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టే వ్యాపారం ఇది..
Paper Bag Making Business
Sanjay Kasula
|

Updated on: Jul 30, 2023 | 4:33 PM

Share

పర్యావరణం కలుషితం కావడానికి ప్లాస్టిక్‌ ప్రధాన కారణం. ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు నిషేధించాలని ప్రయత్నించినా దానికి పోటీగా మరో అవకాశం లేకపోవడంతో ప్లాస్టిక్‌ను ఎవరూ భర్తీ చేయలేకపోయారు. అయితే, ఇప్పుడు నిషేధం ఉన్నప్పటికీ ప్లాస్టిక్ వినియోగం మాత్రం విచ్చలవిడిగా సాగుతోంది. కాగితపు సంచి దాని వినియోగాన్ని కొంతవరకు తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే.. మీరు పేపర్ బ్యాగ్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ప్రస్తుతం ప్లాస్టిక్‌కు బదులు పేపర్‌ బ్యాగులు వాడాలని ప్రజలు పట్టుబడుతున్నారు. త్వరలో ప్లాస్టిక్ నిషేధం మరింత కఠినతరం కానుంది.

అటువంటి పరిస్థితిలో.. ఈ వ్యాపారం విజయవంతం కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి.. ఎంత ఖర్చు అవుతుంది.. ఎంత స్థలం కావాలి.. దీనికి మార్కెట్ ఉందా లేదా.. ఏమైన ఆర్ధిక సాయం లభిస్తుందా.. ఇలాంటి అనేక ప్రశ్నలకు జవాబులను ఇక్కడ కనుక్కుందాం..

ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి..

పేపర్ బ్యాగ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు చాలా విషయాలు తెలుసుకోవల్సిన అవసరం లేదు. దీని కోసం ప్రత్యేక శిక్షణ కూడా అవసరం లేదు. నేరుగా  ఈ వ్యాపారం మొదలు పెట్టవచ్చు. భారీగా డబ్బులు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ వెచ్చించే ప్రతీ పైసా మీకు తిరిగి రెట్టిపు స్థాయిలో లభిస్తుంది. తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారం మొదలు పెట్టవచ్చు.

ఇవి కూడా చదవండి

దీన్ని చేయడానికి, మీకు ప్రధానంగా పేపర్ రోల్, పాలిమర్ స్టీరియో, ఫ్లెక్సో కలర్, పేపర్ బ్యాగ్ మేకింగ్ మెషిన్ మొదలైనవి అవసరం. మీరు ఈ వస్తువులను మార్కెట్ నుంచి పెద్దమొత్తంలో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. కాగితపు సంచుల తయారీ యంత్రం ధర రూ. 3 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మీరు మీ బడ్జెట్ ప్రకారం దీన్ని ఎంచుకోవచ్చు.

కుటీర పరిశ్రమలా కూడా..

కాగితపు సంచులను కూడా యంత్రం లేకుండానే కూడా కొందరు తయారు చేస్తున్నారు. కుటీర పరిశ్రమలా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తూ ఎలాంటి యంత్రాలు లేకుండా తయారుచేయవచ్చు.పేపర్ బ్యాగ్ మేకింగ్ మెషీన్‌ను కొనుగోలు చేయడానికి మీకు బడ్జెట్ లేకపోతే ఇలా కూడా మొదలు పెట్టవచ్చు. మీరు దానిని సులభంగా మాన్యువల్‌గా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో పేపర్ బ్యాగ్స్ తయారు చేయడం చాలా సులభం. దీని ధర కూడా చాలా తక్కువ. దీని కోసం, మీకు మిగిలిన మెటీరియల్‌తో పాటు మెషీన్‌కు బదులుగా జిగురు, కత్తెర, పంచింగ్ మెషిన్ మొదలైనవి అవసరం. అయితే, మీ ఉత్పత్తి యంత్రం కంటే కొంచెం తక్కువగా ఉంటుంది.

స్టార్టప్ ఇండియా ద్వారా లోన్..

మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, మీరు దీని కోసం సులభంగా లోన్ పొందవచ్చు. కొత్త స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా కింద రుణాలు ఇస్తోంది. మీరు దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రోజుల్లో పేపర్ బ్యాగులకు మార్కెట్‌లో డిమాండ్ చాలా ఎక్కువ. ఈ రోజుల్లో చాలా పెద్ద బ్రాండ్‌లు, దుకాణదారులు ప్లాస్టిక్‌కు బదులుగా పేపర్ బ్యాగులు లేదా గుడ్డ సంచులను ఉపయోగిస్తున్నారు. మీరు ఈ వ్యాపారం ద్వారా పెద్ద డబ్బు సంపాదించవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం