Kinetic Zulu EV Scooter: మార్కెట్‌లోకి నయా ఈవీ స్కూటర్‌.. స్టన్నింగ్‌ ఫీచర్లతో కైనటిక్‌ స్కూటర్‌ లాంచ్‌

| Edited By: TV9 Telugu

Dec 18, 2023 | 3:58 PM

కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ ఈవీలను పరిచయం చేస్తున్నాయి. తాజాగా కైనెటిక్ గ్రీన్ జూలూ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని భారతీయ మార్కెట్లో రూ. 94,990  రిలీజ్‌ చేసింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు అధికారిక వెబ్‌సైట్‌లో లేదా దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత డీలర్‌షిప్‌ల ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు.

Kinetic Zulu EV Scooter: మార్కెట్‌లోకి నయా ఈవీ స్కూటర్‌.. స్టన్నింగ్‌ ఫీచర్లతో కైనటిక్‌ స్కూటర్‌ లాంచ్‌
Kinetic Zulu Green
Follow us on

ప్రపంచవ్యాప్తంగా ఈవీ స్కూటర్ల హవా నడుస్తుంది. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్‌ ధరలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు ఈవీ స్కూటర్లను ఆదరిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం నుంచి రక్షణకు ఈవీ స్కూటర్లను ప్రోత్సహిస్తున్నాయి. కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ ఈవీలను పరిచయం చేస్తున్నాయి. తాజాగా కైనెటిక్ గ్రీన్ జూలూ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని భారతీయ మార్కెట్లో రూ. 94,990  రిలీజ్‌ చేసింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు అధికారిక వెబ్‌సైట్‌లో లేదా దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత డీలర్‌షిప్‌ల ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ప్రముఖ ఈవీ  తయారీదారు జులు ఈ-స్కూటర్ భారతదేశంలో తయారు చేస్తుంది. ఈ స్కూటర్‌ లివరీలు 2024 ప్రారంభంలో ప్రారంభమవుతాయి.  ఫీచర్ల విషయానికి వస్తే కైనెటిక్ గ్రీన్ జూలు ఎలక్ట్రిక్ స్కూటర్ ఆప్రాన్-మౌంటెడ్ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ డిజిటల్ స్పీడోమీటర్, ఆటో-కట్ ఛార్జర్, సైడ్ స్టాండ్ సెన్సార్, బూట్ లైట్ వంటి అధునాత ఫీచర్లతో వస్తుంది. జులు ఇ-స్కూటర్ 160 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది.  కైనెటిక్ గ్రీన్ జూలు ఈ-స్కూటర్ 1,830 మిమీ పొడవు, 1,135 మిమీ  ఎత్తు, 715 మిమీ వెడల్పు కలిగి ఉంటుంది. ఇది 1,360 ఎంఎం వీల్‌బేస్, 93 కిలోల కర్బ్ వెయిట్ కలిగి ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ 150 కిలోల పేలోడ్ సామర్థ్యం కలిగి ఉంటుంది.

కైనెటిక్ గ్రీన్ జూలూ ఈ-స్కూటర్‌కు శక్తినిచ్చేది 2.27 కేడబ్ల్యూహెచ్‌ లిథియం-అయాన్ బ్యాటరీ, ఇది ఛార్జ్‌కి 104 కిమీల క్లెయిమ్ పరిధిని అందిస్తుంది. 2.1 కేడబ్ల్యూ బీఎల్‌డీసీ ఎలక్ట్రిక్ మోటారుతో అమర్చారు. కైనటిక్‌ జులు ఈవీ స్కూటర్‌ గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. 15 ఏఎంపీ సాకెట్‌ను ఉపయోగించి  బ్యాటరీని కేవలం అరగంటలో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూటర్‌ సస్పెన్షన్ కోసం, కైనెటిక్ గ్రీన్ జులులో ముందు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లు ఉంటాయి. బ్రేకింగ్ విధులు ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌ల ఈ స్కూటర్‌ ప్రత్యేకతలుగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..