Gogoro Crossover GX250: చార్జింగ్ కష్టాలకు ‘క్రాస్ ఓవర్’.. బ్యాటరీ స్వాపింగ్‌తో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..

దేశీయ బ్రాండ్లతో పాటు అంతర్జాతీయ దిగ్గజాలు కూడా వీటిని ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ క్రమంలో పూర్తి మేడిన్ ఇండియా ఉత్పత్తిగా గొగోరో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకొచ్చింది. అధునాతన బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో గొగోరో క్రాస్ ఓవర్ జీఎక్స్250 పేరిట దీనిని పరిచయం చేసింది. ఇది స్కూటర్లలో ఎస్‌యూవీ టైప్ అని కంపెనీ పేర్కొంది. దీనిని మహారాష్ట్రలోని ప్లాంట్లో ఉత్పత్తి చేస్తున్నారు. ఇది అనువైన బడ్జెట్లోనే దీనిని అందిస్తున్నారు.

Gogoro Crossover GX250: చార్జింగ్ కష్టాలకు ‘క్రాస్ ఓవర్’.. బ్యాటరీ స్వాపింగ్‌తో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..
Gogoro Crossover Gx250
Follow us
Madhu

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 13, 2023 | 9:46 PM

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో వీటి కొనుగోళ్లు అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలో కొత్త కొత్త స్కూటర్లు మార్కెట్లోకి లాంచ్ అవుతున్నాయి. దేశీయ బ్రాండ్లతో పాటు అంతర్జాతీయ దిగ్గజాలు కూడా వీటిని ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ క్రమంలో పూర్తి మేడిన్ ఇండియా ఉత్పత్తిగా గొగోరో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకొచ్చింది. అధునాతన బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో గొగోరో క్రాస్ ఓవర్ జీఎక్స్250 పేరిట దీనిని పరిచయం చేసింది. ఇది స్కూటర్లలో ఎస్‌యూవీ టైప్ అని కంపెనీ పేర్కొంది. దీనిని మహారాష్ట్రలోని ప్లాంట్లో ఉత్పత్తి చేస్తున్నారు. ఇది అనువైన బడ్జెట్లోనే దీనిని అందిస్తున్నారు. ఈ గొగోరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

చార్జింగ్ సులభతరం..

మన దేశంలో ప్రస్తుతం ఎక్కువగా గ్రిడ్ చార్జెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మాత్రమే ఉన్నాయి. కొన్ని గంటల పాటు స్కూటర్ ను పార్క్ చేసి ఉంచి చార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో గొగోరో ఈ సమస్యకు పరిష్కారాన్ని తీసుకొచ్చింది. ఈ స్కూటర్లో బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీని పరిచయం చేసింది. అంటే ఏమిలేదు.. ఏదైనా స్వాపింగ్ స్టేషన్ కు వెళ్లి మీ బ్యాటరీని చార్జింగ్ కోసం అక్కడ ఉంచి.. ఫుల్ చార్జ్ అయిన మరో బ్యాటరీని తెచ్చుకోవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవడంతో పాటు రైడర్ కు సౌలభ్యం కూడా దొరకుతుంది. తైవాన్ లో ఈ కంపెనీ తన నెట్ వర్క్ ను విస్తరించి. 6,00,000 రైడర్లకు గానూ 1.3 మిలియన్ స్మార్ట్ బ్యాటరీలను అందిస్తోంది. దాదాపు 2,500 సెంటర్లలో 12,000 బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను సమకూర్చింది. ఈ స్టేషన్లలో చక్కగా బ్యాటరీలు మార్చుకునే వీలుంటుంది. ఒక్క తైవాన్ లోనే రోజూ 4,00,000 బ్యాటరీలను రైడర్లు స్వాప్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనిని ఇప్పుడు మన దేశంలో కూడా విస్తరించేందుకు ప్రణాళిక చేసింది. ముఖ్యంగా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, గోవా, ముంబై, పూణేలలో 2024 ఫస్ట్ హాఫ్ పూర్తయ్యే సమయానికి స్వాపింగ్ స్టేషన్లను తీసుకురావాలని తలపోస్తోంది.

మరో రెండు మోడళ్లలో క్రాస్ ఓవర్..

గొగోరో క్రాస్ ఓవర్ జీఎక్స్250 ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు రెండు మోడళ్లలో అందుబాటులో ఉన్నాయి. అవి ఒకటి క్రాస్ ఓవర్ 50, క్రాస్ ఓవర్ ఎస్ మోడల్స్. వీటిల్లో క్రాస్ ఓవర్ జీఎక్స్ 250 ప్రస్తుతం అందుబాటులో ఉంది. త్వరలో మిగిలిన రెండు మోడళ్లు అందుబాటులోకి రానుంది.

గొగోరో క్రాస్ ఓవర్ జీఎక్స్250 స్పెసిఫికేషన్స్..

ఈ క్రాస్ ఓవర్ స్కూటర్ లో 2.5కేడబ్ల్యూ డైరెక్ట్ డ్రైవ్ మోటార్ ఉంటుంది. గరిష్టంగా గంటకు 60కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించగలుతుంది. సింగిల్ చార్జ్ పై 111కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఈ స్కూటర్ కు అధిక కార్డో వెసిలిటీ ఉంటుంది. దీనిలోని వెనుక సీట్ ఫ్లిప్ చేయొచ్చు.. పూర్తిగా తీసేయచ్చు. పూర్తిగా తీసేసి కార్గో స్టోరేజ్ కోసం వినియోగించుకోవచ్చు. ఈ కంపెనీ స్కూటర్ల డెలివరీల కోసం జిప్ ఎలక్ట్రిక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..